వరంగల్, స్వేచ్ఛ: Greater Warangal: గ్రేటర్ వరంగల్ లో సంచలనం సృష్టించిన బాలికను కిడ్నాప్ చేసి డ్రగ్స్ ఇచ్చి అత్యాచారం చేయించి వ్యభిచార కూపంలోకి దించేందుకు ప్రయత్నించిన ముఠా గుట్టును వరంగల్ మిన్స్ కాలనీ పోలీసులు రట్టు చేశారు. నగరంలోని ఓ బాలిక కిడ్నాప్ కేసు విచారణలో వ్యభిచార ముఠా గుట్టు బయట పడింది. ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన ఓ మహిళ, బాలికలను ట్రాప్ చేయడంలో కీలకంగా వ్యవహరించిన మరో బాలిక సహా మరో నలుగురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ ముఠా అరెస్టుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
సీపీ తెలిపిన వివరాల ప్రకారం ఈ 11వ తేదిన బాలిక కనిపించడం లేదని మిల్స్ కాలనీ పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. వారు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి పోలీసు ప్రత్యేక బృందాలతో విచారణ చేపట్టారు. కిడ్నాప్ కు గురైన బాలికను ములుగు క్రాస్ రోడ్డు వద్ద గుర్తించి, వాళ్ల సంరక్షణలోకి తీసుకోని విచారించారు. తనను కొంత మంది వ్యక్తులు కిడ్నాప్ చేసి గంజాయి తాగించి, అనంతరం అత్యాచారానికి పాల్పడినట్లుగా సదరు బాలిక పోలీసులకు వెల్లడించింది. దీంతో, అప్రమత్తమైన పోలీసులు, పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు సెంట్రల్ డిసిపి షేక్ సలీమా పర్యవేక్షణలో వరంగల్ ఏసిపి అధ్వర్యంలో మూడు ప్రత్యేక దర్యాప్తు బృందాలుగా ఏర్పాటై నిందితులకోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Also read: Nandamuri Kalyan Ram: ప్రాణం పోయడం కోసం ప్రాణాన్ని పణంగా పెట్టే స్త్రీమూర్తుల కోసమే ఈ సినిమా..
ఈ వ్యవహరంలో ప్రధాన నిందితురాలైన ముస్కు లత, ల్యాదేళ్ళ గ్రామంలో వ్యభిచార వృత్తిని కొనసాగిస్తూ, తల్లిదండ్రులు లేని ఓ అనాధ బాలిక (ఈ కేసులో మరో నిందితురాలు)కు తన ఇంటిలోనే ఆశ్రయం కల్పించింది. ముస్కు లత నిర్వహిస్తున్న వ్యభిచార వృత్తికి అవసరమైన కొత్త మహిళలు లేదా బాలికలను తీసుకొచ్చి ఈ వ్యభిచారం నిర్వహించడం ద్వారా పెద్ద మొత్తం డబ్బు వస్తాయని, దానిలో నీకు కొంత డబ్బు ఇస్తానని బాలికకు నిందితురాలు ఆశ చూపింది.
ఆ మాటలకు ఆకర్షితురాలైన బాలిక( మైనర్ నిందితురాలు) పలువురు మహిళలు, పాఠశాలల్లో చదివే బాలికలను టార్గెట్ గా చేసుకుని వారికి తెలియకుండానే వారు తినే ఆహారంలో, తాగే డ్రింక్స్ లో డ్రగ్స్ కలికి మత్తులో ఉన్న వారికి వ్యభిచార కూపంలోకి దించేందుకు స్కెచ్ వేశారు.
స్నేహితురాలితో పరిచయం చేసుకుని రొంపిలోకి లాగి బాలిక జీవితంతో చెలగాటం..
ముందుగా నిందితులు వారు వేసుకున్న స్కెచ్ ప్రకారం తన స్నేహితురాలితో పరిచయమైన బాధిత బాలికను లక్ష్యంగా చేసుకొని ఇన్స్టాగ్రాం ద్వారా బాధిత బాలికతో పరిచయం పెంచుకుంది మైనర్ నిందితురాలు. బాధిత బాలిక స్కూల్‌కు వెళ్ళే సమయంలో కలవడంతోపాటు పలు కానుకలు ఇచ్చి పరిచయం పెంచుకుంది. క్రమక్రమంగా పాఠశాలకు వెళ్లే బాధిత బాలికను నిందితురాలు ఆమె ప్రియుడైన అబ్దుల్ అఫ్నాన్‌తో తీసుకువెళ్ళి మద్యం, గంజాయిని త్రాగటం అలవాటు చేశారు.
నిందితురాలిపై మరింత నమ్మకం కలిగేందుకు బాలికకు షాపింగ్ మాల్స్‌కు తీసుకవెళ్లారు. అక్కడ కొత్త బట్టలను ఇప్పించడంతో వీరిపై నమ్మకం కలిగించారు. బాధిత బాలిక వీరిని నమ్మి ఈ నెల 11వ తేదీన మైనర్ నిందితురాలు ఆమె ప్రియుడు, మరో ఇద్దరు నిందితులు షేక్ సైలాని బాబా, మహ్మద్ అల్తాఫ్‌లతో కలిసి కారులో బయలుదేరారు. గంజాయి విక్రయాలు చేసే మీర్జా ఫైజ్ బేగ్ వద్ద గంజాయిని కొనుగోలు చేసి నర్సంపేట శివారు ప్రాంతంలో నిందితుల్లో ఒకడైన షేక్‌సైలాని బాబాకు చెందిన ఓ పురాతన ఇంటికి వెళ్ళారు.
Also read Hyderabad Crime: హైదరాబాద్ లో దారుణం.. అప్పుడే పుట్టిన శిశువు కాల్చివేత.
బాధిత బాలికను తీసుకవెళ్ళి గంజాయి త్రాగించి షేక్ సైలాని బాబా బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం బాలికను నువ్వు రేపటి నుండి మేము చెప్పినట్లుగా వినాలి, లేకుంటే నువ్వు గంజాయి త్రాగుతుండగా, నీపై అత్యాచారం చేసేది సెల్‌ఫోన్లో చిత్రీకరించామని బ్లాక్ మెయిల్ చేశారు. అత్యాచారం జరిగింది వాస్తవంగా వీడియో తీయలేదు కానీ, తీశామని ఈ వీడియోను బయట పెడతామని బెదిరించి సదరు మైనర్ బాలికను ములుగు క్రాస్ రోడ్డు వద్ద వదిలి పారిపోయారు నిందితులు.
బాలికను గుర్తించిన పోలీసులు వారి సంరక్షణలోకి తీసుకుని విచారణ చేయగా జరిగిన విషయం మొత్తం బయటపడింది. బాధిత బాలిక ఇచ్చిన సమాచారం మేరకు, నిందితులు దామెర మండలం ల్యాదేళ్ళ గ్రామానికి చెందిన ముస్కు లత, వరంగల్ జిల్లాకు చెందిన మైనర్ బాలిక, వరంగల్ శంభుని పేటకు చెందిన అబ్దుల్ అఫ్నాన్, షేక్‌సైలాని బాబా, మహ్మద్ అల్తాఫ్, మీర్జా ఫైజ్ బేగ్ ఆలియాస్ వదూద్ లను అదుపులోకి తీసుకుని విచారించగా మొత్తం వ్యవహారం బయట పడిందని సీపీ తెలిపారు.
బాలికను అపహరించి అత్యాచారానికి పాల్పడి తరువాత వ్యభిచారం చేయించేందుకు ప్రయత్నించిన ఒక మైనర్ సహా ఆరుగురు సభ్యుల ముఠాను మంగళవారం అరెస్టు చేసి వారి నుండి 1కిలో 800 గ్రాముల గంజాయి, ఒక కారు, రూ. 75వేల నగదు, 4 సెల్ ఫోన్లు, భారీ స్థాయిలో కండోమ్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు సీపీ తెలిపారు. కిడ్నాప్ కేసు నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన సెంట్రల్ జోన్ డిసిపి షేక్ సలీమా, వరంగల్ ఏసిపి నందిరాం నాయక్, మిల్స్ కాలనీ ఇన్స్‌స్పెక్టర్ వెంకటరత్నం, ఎస్.ఐలు శ్రీకాంత్, సురేష్‌లతో పాటు పోలీస్ సిబ్బందిని పోలీస్ కమిషనర్ అభినందించారు.
Also read: Kalyana Lakshmi Scheme: తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. కళ్యాణలక్ష్మిపై క్లారిటీ ఇచ్చిన పొన్నం..