Nandamuri Kalyan Ram: ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ కథ ఇదే..
Nandamuri Kalyan Ram
ఎంటర్‌టైన్‌మెంట్

Nandamuri Kalyan Ram: ప్రాణం పోయడం కోసం ప్రాణాన్ని పణంగా పెట్టే స్త్రీమూర్తుల కోసమే ఈ సినిమా..

Nandamuri Kalyan Ram: నందమూరి కళ్యాణ్ రామ్ కొడుకుగా, విజయశాంతి మదర్‌గా నటించిన మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ ఫ్యామిలీ డ్రామా ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ (Arjun Son Of Vyjayanthi) . ‘కర్తవ్యం’ తరహాలో విజయశాంతి ఈ చిత్రంలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాను అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మించారు. ఈ చిత్ర టీజర్‌ని సోమవారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో..

హీరో నందమూరి కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ.. ‘‘ టీజర్ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అమ్మ (విజయశాంతి) చేసిన ‘కర్తవ్యం’ సినిమాని ఎవరు మర్చిపోలేం. అమ్మ చేసిన స్టంట్స్, యాక్టింగ్ అన్ని కూడా అస్సలు ఎప్పటికీ మరిచిపోలేని చిత్రమది. ఈ సినిమా కథని డైరెక్టర్ ప్రదీప్ చెబుతూ.. అమ్మ పాత్ర పేరు వైజయంతి అని అన్నాడు. అంతే.. ‘కర్తవ్యం’ సినిమాలో వైజయంతి క్యారెక్టర్‌కి కొడుకు పుడితే ఎలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతాయి అనేదే ఈ సినిమా. అయితే అమ్మ ఒప్పుకుంటేనే ఈ సినిమా చేద్దామని అన్నాను. అమ్మ ఒప్పుకోకపోతే ఈ సినిమా చేయడం కరెక్ట్ కాదేమో అన్నాను. ఎందుకంటే, ఈ సినిమాకు మెయిన్ పిల్లర్ అమ్మ. ఈ వయసులో కూడా అమ్మ ఎలాంటి డూప్ లేకుండా అద్భుతమైనటువంటి స్టంట్స్ చేశారు. టీజర్‌లో అంతా చూశారు కదా.

Also Read- Salaar Sculptures: ప్రభాస్ ‘సలార్’ శిల్పాలు వచ్చేశాయ్.. ఒక్కో శిల్పం ఖరీదు ఎంతంటే?

ఈ సినిమాలో పృథ్వి చాలా అద్భుతమైనటువంటి క్యారెక్టర్ చేశారు. ‘యానిమల్’ సినిమా ఎంత పేరు తెచ్చిందో, తెలుగులో నాకీ సినిమా అంత గుర్తింపు తెస్తుందని ఆయన మొదటి రోజు నుంచి చెప్పారు. ఈ సినిమాకి ఆయనే డబ్బింగ్ చెప్పారు. డబ్బింగ్ విషయంలో ఆయనని కాస్త టార్చర్ కూడా పెట్టాను. మా ప్రొడ్యూసర్స్ ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు. వాళ్లు నా సొంత మనుషులు. సినిమా అంతా పాజిటివ్ యాటిట్యూడ్‌తో చేయడం జరిగింది. ‘అతనొక్కడే’ సినిమా గుర్తుందా? 20 ఏళ్ల తర్వాత కూడా ఆ సినిమా గుర్తుంది. అలాగే ఈ సినిమా కూడా 20 ఏళ్ల పాటు గుర్తుండిపోతుంది. అందరికీ గుర్తుండిపోతుంది.

ప్రదీప్ ఈ సినిమాతో చాలా పెద్ద కమర్షియల్ డైరెక్టర్ కాబోతున్నాడు. ఎందుకంటే, అతని పనితనం అలా ఉంది. ప్రతి ఒక్కరినీ టార్చర్ పెట్టాడు. ఈ సినిమా గురించి ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నాను. మనకి ప్రాణం పోయడం కోసం తన ప్రాణాన్ని పణంగా పెట్టి మరి ఒక బిడ్డకు జన్మనిస్తుంది తల్లి. అలాంటి స్త్రీమూర్తులని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఆ బాధ్యత కోసం మనం ఎంత త్యాగం చేసినా సరిపోదు. అదే ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’.

Also Read- Arjun Son Of Vyjayanthi: వైజాగ్‌ను శాసించేది పోలీస్ బూట్లు, నల్ల కోట్లు కాదు.. కళ్యాణ్ రామ్ సినిమా టీజర్ ఎలా ఉందంటే?

ఈ కథలో చాలా సిన్సియారిటీ ఉంది. చాలా ఎమోషన్ ఉంది. చాలా కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అందుకే ఈ సినిమాను నేను ఓకే చేశాను. అమ్మ (విజయశాంతి)తో వర్క్ చేయడం మర్చిపోలేను. చిన్నప్పుడు ‘సూర్య IPS’ అనే షూటింగ్‌కు వెళ్లాను. అప్పుడు అమ్మ ఎలా చూసుకున్నారంటే.. తనే భోజనం తినిపించారు. ఐస్ క్రీమ్ కూడా తినిపించారు. అది వండర్‌ఫుల్ ఎక్స్‌పీరియెన్స్. ఒక తల్లి, ఒక బిడ్డ మధ్య ఎంత సిన్సియర్ ఎమోషన్ ఉంటుందో, ఎంత ప్రేమ ఉంటుందో.. ఈ సినిమా కూడా అంతే నిజాయితీగా ఉంటుంది’’ అని అన్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?