Mulugu Police: శీతాకాలం ప్రారంభమైనందున ఉదయం రాత్రి సమయంలో తీవ్ర పొగమంచు (ఫాగ్) ఏర్పడుతున్న నేపథ్యంలో వాహనదారులు రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు తప్పనిసరిగా తీసుకోవలసిన జాగ్రత్తలు, సూచనలు విడుదల చేశారు. శీతకాలం పొగమంచు కారణంగా ప్రమాదాలు జరగకుండా వాహనదారులు పాటించాల్సిన సూచనలు చేశారు ఫాగ్ లైట్లు, హెడ్ లైట్లు తప్పనిసరిగా ఆన్‌లోనే ఉంచాలన్నారు. వాహనాన్ని నెమ్మదిగా నడపాలి ఓవర్ స్పీడ్ చేయకూడదు తద్వారా వల్ల ప్రమాదాలు తగ్గుతాయని చెప్పారు. పొగమంచు కారణంగా వాహనాలు కనిపించకపోవచ్చు కావున ముందు వెళ్తున్న వాహనానికి కనీస సురక్షిత దూరం పాటించాలన్నారు. నాలుగు రోడ్ల పక్కనున్న మార్కింగ్ లైన్స్‌ను దాటకుండా నడపాలన్నారు.
Also Read: Mulugu SP: గుంపులుగా తిరిగితే తాటతీస్తా.. ములుగు జిల్లా ఎస్పీ వార్నింగ్!
ఇండికేటర్లు సరిగా పనిచేస్తున్నాయో ముందుగా చెక్ చేసుకోవాలి
ఇతర వాహనదారులను అప్రమత్తం చేయడానికి హరేన్ ను ఉపయోగించాలన్నారు. ఇండికేటర్లు సరిగా పనిచేస్తున్నాయో ముందుగా చెక్ చేసుకోవాలన్నారు. మూల మలుపుల వద్ద ముందస్తుగానే ఇండికేటర్స్ ను వాడాలని చెప్పారు. ఎక్కువ పొగమంచు ఉన్నప్పుడు హై బీమ్ ఉపయోగించవద్దు, అది ఎదురు వచ్చే వారికి విజిబిలిటీ తగ్గిస్తుందన్నారు. టైర్లు, బ్రేకులు, వైపర్లు ముందుగానే చెక్ చేసుకోవాలన్నారు. అవసరం లేకుండా రోడ్డు పక్కన వాహనాలు ఆపవద్దు. ఆపాల్సి వస్తే హెజర్డ్ లైట్లు ఆన్ చేయాలన్నారు. డ్రైవర్లు పూర్తిగా అప్రమంత్తముగా ఉండాలని సూచించారు. నిద్రలేమీతో గాని తాగిన మత్తులో గానీ డ్రైవింగ్ చేయవద్దు. ఉదయం పూట వాకింగ్ చేసేవాళ్ళు హైవేలపై వాకింగ్ చేయరాదు నిర్ణత మైదానలలో మాత్రమే వ్యాయామం చేసుకోవాలని వివరించారు.
రాత్రి 8 తర్వాత ప్రయాణాలు వద్దు
ప్రజలకు ఎస్ పి సూచనలు వింటర్ ఫాగ్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఉదయం 5 నుండి 8 గంటల మధ్య, రాత్రి 8 తర్వాత ప్రయాణాలు వద్దని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ప్రయాణం చేయాలని, కుటుంబ సభ్యులు ముఖ్యంగా పిల్లలు మరియు వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. “ప్రతి పౌరుడి ప్రాణ భద్రత మా ప్రాధాన్యత. పొగమంచు సమయంలో విజిబిలిటీ తగ్గడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున ప్రతి వాహనదారుడు సూచనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100 లేదా 112 నంబర్‌కు వెంటనే ఫిర్యాదు చేయగలరని ఎస్ పి తెలిపారు.
Also Read: Mulugu District News: నకిలీ మందులతో మోసం.. ఎట్టకేలకు గుట్టురట్టు చేసిన పోలీసులు..

