Mulugu SP: గుంపులుగా తిరిగితే తాటతీస్తా.. ఎస్పీ వార్నింగ్!
Mulugu SP ( image credit: swetcha reporter)
నార్త్ తెలంగాణ

Mulugu SP: గుంపులుగా తిరిగితే తాటతీస్తా.. ములుగు జిల్లా ఎస్పీ వార్నింగ్!

Mulugu SP: గ్రామ పంచాయతీ మొదటి విడత పోలింగ్ సందర్భంగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశామని ములుగు జిల్లా ఎస్పీ (Mulugu SP) సుధీర్ రాంనాథ్ కేకాన్ ఐపీఎస్ గారు అన్నారు. ములుగు జిల్లా పరిధిలో జరగబోయే మొదటి విడత గ్రామ పంచాయితీ ఎన్నికలు శాంతియుతంగా, నిష్పక్షపాతంగా సాగేందుకు విస్తృతమైన పోలీస్ బందోబస్త్ ఏర్పాటు, ఎన్నికల ప్రక్రియ సజావుగా కొనసాగేందుకు అవసరమైన అన్ని భద్రతా చర్యలు తీసుకున్నామని తెలిపారు. కంట్రోల్ రూమ్, క్విక్ రెస్పాన్స్ టీమ్స్, సమస్యత్మక పోలింగ్ కేంద్రాల వద్ద స్ట్రైకింగ్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్‌లు సిద్ధంగా ఉన్నాయని, పోలీస్ పికెట్‌లు, మొబైల్ ప్యాట్రోలింగ్ ఏర్పాటు చేశాం అని తెలిపారు.

నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం

గుంపులుగా తిరగడం, గొడవలకు, బెదిరింపులకు, దాడులకు పాల్పడడం, డబ్బు, మద్యం, బహుమతుల పంపిణీ, ఓటర్లను ప్రభావితం చేసే చర్యలకి పాల్పడడం నిబంధనలకు విరుద్ధం, ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు శాంతియుతంగా, దైర్యంగా స్వేచ్చయుత వాతావరణం లో తమ ఓటు హక్కు వినియోగించుటకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. ఎన్నికలను విజయవంతంగా నిర్వహించడంలో ప్రతి పోలీస్ అధికారి సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికల సమయంలో పోలీస్ అధికారులు గ్రామాల్లో నిరంతరం పెట్రోలింగ్ నిర్వహిస్తూ, పోలీస్ కేంద్రాలు, ఇతర ప్రాంతాల్లో గుంపులుగా లేకుండా జాగ్రత్తపడాలన్నారు.

Also Read: Mulugu SP Shabarish: 5S విధానం అమలు చేయాలి.. ములుగు ఎస్పీ కీలక ఆదేశాలు

పోలీస్ అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలి

ఓట్ల లెక్కింపు సమయంలో పోలీస్ అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఓట్ల లెక్కింపు సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తీసుకొవాల్సిన ముందస్తు బందోబస్తు చర్యలు చేయాలన్నారు పోలీంగ్ కేంద్రాలోకి ఓటర్లు వచ్చి వేళ్ళే మార్గాలలో వాహనాలు పార్కింగ్ లేకుండా చూసుకోవాలన్నారు. ఏదైన సమస్య తలెత్తినప్పుడు సంబంధిత అధికారులను సమచారం ఇవ్వడంతో పాటు అదనపు పోలీసు బలగాలను రప్పించుకోవాలన్నారు. మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో డీఎస్పీ -02, సీఐ-06, ఎస్ ఐ లు – 33, తో పాటు సుమారు 400 సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అని తెలియచేశారు.

Also Read: Mulugu District: శ్వాసకోశ సమస్యతో వెలితే .. ప్రెగ్నెన్సీ రిపోర్ట్ ఇచ్చిన ఆసుపత్రి సిబ్బంది.. ఎక్కడంటే..?

Just In

01

DekhLenge Saala Released: ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి ‘దేఖ్ లెంగే సాలా’ వచ్చేసింది.. పవర్ స్టార్ స్వాగ్ పీక్స్!

Uttam Kumar Reddy: పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టులపై కేంద్రానికి మంత్రి ఉత్తమ్ లేఖ

Bigg Boss9 Telugu: ఈ వారం ఎలిమినేషన్ గురించి క్లారిటీ ఇచ్చిన నాగార్జున.. ఒకరు కన్ఫామ్!

Sarpanch Elections: సర్పంచ్ బరిలో నిండు గర్భిణీ.. బాండ్ పేపర్ పై హామీలతో ప్రచారం..!

KTR: బీఆర్ఎస్ వెంటే ప్రజలు.. సర్పంచ్ ఎన్నికలే నిదర్శనం.. కేటీఆర్ ధీమా