Mulugu District: ములుగు జిల్లాలో RVM హస్పిటల్ లో సిబ్బంది నిర్లక్ష్యం తీవ్ర చర్చనీయాశంగా మారింది. హస్పిటల్ కి వచ్చిన రోగికి కనీసం టెస్టులు, స్కానింగ్ కూడా చేయకుండా వేరే వ్యక్తికి సంబందించిన టెస్టుల రిపోర్టుతో ప్రెగ్నెన్సీ స్కానింగ్ రిపోర్టు(Pregnancy scanning report)ను ఇచ్చారు. దీంతో అక్కడి సిబ్బంది ఎంతటి నిర్లక్ష్యంతొ ఉన్నారో అర్ధం చేసుకోవచ్చు.
వివరాల్లోకి వెలితే..
ములుగు(Mulugu) జిల్లా ప్రాంతానికి చెందిన కవిత(kavitha) అనే మహిళ శ్వాశ కోస సమస్యతో అదే హస్పిటల్లో చేర్చారు. అయితే డాక్టర్లు ఆమేను పరీక్షిచారు. అనంతరం ఆమేకు స్కానింగ్ చేయాలని డాక్టర్లు సూచించారు. డాక్టర్ల సూచన మేరకు కవిత కుటుంబ సభ్యులు ఆమేను స్కానింగ్ రూంకి తీసుకువచ్చారు. అయితే ఇంతలోనే స్కానింగ్ చేయక ముందే సదరు మహిళ కొమ్ము కవిత స్కానింగ్ రిపోర్టు వచ్చిందని ఆసుపత్రి సిబ్బంది ఓకరు కుటుంభ సబ్యులకు రిపోర్టును ఇచ్చారు. స్కానింగ్ జరగక ముందే రిపోర్టు ఎలా వచ్చిందని కుటుంభ సభ్యలు ఆశ్చర్యపోయారు. దీంతో వెంటనే సిబ్బంది ఇచ్చిన స్కానింగ్ రిపోర్టను కుటుంభ సభ్యలు పరిశీలించారు. దీంతో అసలు విషయం బయటపడింది.
Also Read: DGP Sivadhar Reddy: చేవెళ్ల బస్సు ప్రమాదం.. ఘటనాస్థలిని పరిశీలించిన డీజీపీ.. కీలక విషయాలు వెల్లడి
కుటుంభ సభ్యులతో చర్చలు
అయితే శ్వాసకోస సమస్యతో ఆసుపత్రికి వెల్లిన మహిళకు సంబందించిన రిపోర్టు కాకుండా.. ప్రెగ్నెన్సీ స్కానింగ్ రిపోర్టును సిబ్బంది ఇచ్చారు. దీంతో తమ రోగికి స్కానింగ్ చేయకుండానే.. వేరే వ్యక్తి రిపోర్టును ఇచ్చారని ఆస్పత్రి సిబ్బందిపై మహిళ కుటుంభ సభ్యులు నిలదీశారు. దీంతో తడబడిన సిబ్బంది పోరపాటున ఇలా జరిగిందని సిబ్బంది సమాదానం ఇచ్చారు. జరిగిన ఇ విషయాన్ని బయటికి చెప్పవద్దని ఆసుపత్రి సిబ్బంది కుటుంభ సభ్యలతో చర్చలు జరిపి ఓప్పించే ప్రయత్నం చేశారు. ఇలా జరిగినందుకుగాను దీనికి నష్ట పరిహరం కింద మల్లీ తిరిగి స్కానింగ్ తీస్తామరి సిబ్బంది తెలిపారు. దీంతో ఆగ్రహించిన కవిత కుటుంభ సభ్యులు రోగుల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతారా అంటూ ఆసుపత్రి సిబ్బందిపై మరియు రనిర్వాహకం పై అక్కడి స్ధానికులు తీవ్రంగా మండి పడుతున్నారు.
Also Read: AICC: జూబ్లీహిల్స్‌పై ఏఐసీసీ ఫోకస్.. చివరి వారం ప్రచారంపై ప్రత్యేక వ్యూహం!
