Mulugu District News [image credit ; Canava]
నార్త్ తెలంగాణ

Mulugu District News: నకిలీ మందులతో మోసం.. ఎట్టకేలకు గుట్టురట్టు చేసిన పోలీసులు..

ఏటూరునాగారం/మహబూబాబాద్ స్వేచ్ఛ: Mulugu District News: ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలో అనుమతులు లేకుండా ఓ ఇంట్లో నిల్వ చేసి విక్రయానికి సిద్ధంగా ఉంచిన బయోప్రొడక్ట్ మందులను పోలీస్, అగ్రికల్చర్ శాఖ అధికారులు గురువారం అర్ధరాత్రి పట్టుకున్నారు.6 లక్షల విలువ గల బయో మందులను స్వాధీనం చేసుకున్నారు.ఇందుకు సంబంధించిన వివరాలను శుక్రవారం ఏటూరు నాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ మీడియతో మాట్లాడుతు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం,ఎన్టీఆర్ జిల్లా, కందిచర్ల గ్రామానికి చెందిన రావూరి వెంకటేశ్వర్ రావు అనే వ్యక్తి ఏటూరునాగారం మండల కేంద్రంలోని ఆకులవారి ఘణపురం లో ఒక ఇంట్లో అద్దెకు ఉంటూ గత కొద్ది కాలంగా అనుమతులు లేకుండా బయో ప్రొడక్ట్ మందులు నిల్వ చేసి ఏటూరునాగారం మంగపేట, కన్నాయిగూడెం, వాజేడు, నూగూరు,వెంకటాపురం,చర్ల మండలాలకు వెళ్లి విక్రయిస్తున్నాడని.

Also Read: Diamond Hills Robbery case: లేడీ డాన్ కుమారులే అసలు కారకులు.. అసలేం ఏం చేశారంటే?

నమ్మదగిన సమాచారం మేరకు గురువారం ఆర్దరాత్రి సీఐ అనుమల శ్రీనివాస్ ఎస్సై తాజుద్దీన్, పోలీస్ సిబ్బంది, అగ్రికల్చర్ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించి 410 లీటర్ల ద్రవ పదార్ధలు 30 కేజీల ఘన పదార్థం గల బయో ప్రొడక్ట్ మందులను, ఓ వ్యానును పట్టుకున్నారు.నిందితుడిపై కేసు నమోదు చేశారు.

ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ రైతులను మోసం చేసే విధంగా నకిలీ విత్తనాలు, నకిలీ మందులు, అనుమతులు లేని బయో మందులు విక్రయిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే యువత ఆన్ లైన్ బెట్టింగ్ లకు పాల్పడి తమ బంగారు భవిష్యత్ నాశనం చేసుకోవద్దని సూచించారు. బెట్టింగులు చేసినట్లయితే ఉపేసి ఉపేక్షించేది లేదని అన్నారు.

స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?