తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: Diamond Hills Robbery case: కలకలం సృష్టించిన డైమండ్ హిల్స్ చోరీ కేసులోని నిందితులను ఫిలింనగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. గోల్కొండ ప్రాంతానికి చెందిన లేడీ డాన్ సనా కొడుకులే ఈ నేరానికి పాల్పడ్డట్టుగా సమాచారం. ఇటీవల డైమండ్ హిల్స్ కాలనీలోని ఓ ఇంట్లో దొంగలు పడి 34తులాల బంగారు నగలు, 4.5లక్షల నగదును తస్కరించి ఉడాయించిన విషయం తెలిసిందే.
ఈ మేరకు ఫిర్యాదు అందగా కేసులు నమోదు చేసిన ఫిలింనగర్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇందులో భాగంగా సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించినపుడు పలు కేసుల్లో నిందితురాలిగా ఉన్న లేడీ డాన్ సనా ఇద్దరు కొడుకులు ఈ నేరానికి పాల్పడినట్టుగా వెల్లడైంది. ఈ క్రమంలో పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. పోలీసులు ఒకటి రెండు రోజుల్లో అధికారికంగా వివరాలను వెల్లడించనున్నారు.
Also Read: TG on Tax Evasion: పన్నుల ఎగవేతపై సర్కార్ సీరియస్.. పెద్ద ప్లాన్ రెడీ.
మాజీ మేయర్ కొడుకుపై కేసులు
కరీంనగర్ మాజీ మేయర్ కొడుకుపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదయ్యాయి. పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. సునీల్ రావు బీఆర్ఎస్ పార్టీ తరపున కరీంనగర్ మేయర్ గా పని చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆ పార్టీని వీడి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కాగా, ఆయన కుమారుడు ప్రద్యుమ్న్ఈనెల 19న ఇద్దరు స్నేహితులతో కలిసి మద్యం సేవించి వేగంగా కారు నడుపుతూ జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 10లో ఫుట్ పాత్ ను ఢీకొట్టారు. సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా ప్రమాదం చేసింది ప్రద్యుమ్న్ అని నిర్ధారించుకున్న పోలీసులు అతనిపై కేసులు నమోదు చేశారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు