Warangal Police: డ్రగ్స్ రహిత సమాజమే మనందరి లక్ష్యమని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు. వరంగల్ పోలీస్ (Warangal Police) కమిషనరేట్ పరిధిలో మత్తు పదార్థాల నియంత్రణకై చేపట్టిన చర్యల్లో భాగంగా, మత్తు పదార్థాల వినియోగించే వారితో పాటు, వీటిని విక్రయాలకు పాల్పడే వారిని గుర్తించేందుకు, అలాగే యువత మత్తు పదార్థాలకు దూరంగా వుండాలని తెలిపే విధంగా డ్రగ్స్ కంట్రోల్ టీం అధ్వర్యంలో (SAY NO TO DRUGS) నినాదంతో రూపొందించిన ప్రచార గొడ పత్రికలను వరంగల్ పోలీస్ కమిషనర్ గురువారం అధికారులతో కలసి కమిషనరేట్ కార్యాలయములో అవిష్కరించారు.
Also Read: Warangal Police: నకిలీ రైతులపేర్లతో.. రూ. 2.10 కోట్ల నిధులు కాజేసిన 13 మంది అరెస్ట్.. ఎక్కడంటే?
డ్రగ్స్ రహిత సమాజంకై మీరు భాగస్వాములు కావాలి
అనంతరం పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ మత్తు పదార్థాల వినియోగంతో యువత భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని, యువత భవితవ్యాన్ని కాపాడుకోవడం మనందరి ప్రధాన కర్తవ్యమని, మత్తు పదార్థాల నియంత్రణలో ప్రజలు సైతం పరోక్షంగా తమ వంతు సహకారాన్ని అందించాల్సి వుంటుందని. ఇందుకోసం ఎవరైన మత్తు పదార్థాల విక్రయాలు, వినియోగాలకు పాల్పడితే తక్షణమే 8712584473, 8712685299 నంబర్లకు సమచారం అందించి డ్రగ్స్ రహిత సమాజంకై మీరు భాగస్వాములు కావాలని, సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా వుంచబడుతాయని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలియజేసారు. ఈ కార్యక్రమములో పరిపాలన విభాగం అదనపు డిపిపి రవి, స్పెషల్ బ్రాంచ్ ఏసిపి జితేందర్ రెడ్డి, ఆర్.ఐ శివకేశవులు, ఇన్స్‌స్పెక్టర్ సతీష్, ఆర్.ఎస్.ఐలు పూర్ణచందర్ రెడ్డి, మనోజ్ రెడ్డి,నాగరాజు, ర్యాపిడో సంస్థ ప్రతినిధులు దర్గారావు,సందీప్ పాల్గోన్నారు.

