Warangal Police( IMGAE credit: swetcha reporter)
నార్త్ తెలంగాణ

Warangal Police: గణేష్‌ శోభయాత్ర కోసం పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు .. వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ కీలక సూచనలు

Warangal Police: వరంగల్‌ పోలీస్‌ కమిషనరేటు పరిధిలోని సెంట్రల్‌, ఈస్ట్‌,వెస్ట్‌ జోన్ల పరిధిలోని అన్ని గణేష్‌ నిమజ్జనోత్సం(Ganesh immersion శోభయాత్ర సందర్భంగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌(Warangal Police Commissioner)తెలియజేసారు. గణేష్‌ నిమజ్జనోత్సవ శోభయాత్ర శాంతియుతంగా సజావుగా నిర్వహించేదుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, వరంగల్‌ కమిషనరేట్‌ పరిధిలోని మూడు జోన్ల పరిధిలో నలుగురు డిసిపిలు, ఇద్దరు అదనపు డిసిపిలు, 15 మంది ఏసిపిలు, 53 మంది ఇన్స్‌స్పెక్టర్లు, 70 మంది ఎస్‌.ఐలుతో పాటు ఏ.ఎస్‌.ఐ, హెడ్‌ కానిస్టేబుళ్ళు, కానిస్టేబుళ్ళు, హోంగార్డ్స్‌ తో కలుపుకొని మొత్తం 2100 మంది పోలీసులు బందోబస్తు విధులు నిర్వహిస్తున్నారని.

Also Read:SLBC Project: ఎస్ఎల్‌బీసీ పనులపై సీఎం కీలక వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..? 

ఇందులో ప్రత్యేకించి ట్రై సిటి పరిదిలో మొత్తం 1600 మందికి పైగా పోలీసులు విధులు నిర్వహిస్తున్నారని. శోభయాత్రతో పాటు నిరమజ్జనోత్సవం సజావు కోనసాగేందుకు పెద్ద సంఖ్యలో సిసి కెమెరాలు, డ్రోన్‌ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగిందని. వీటి ద్వారా కార్య క్రమ నిర్వహణపై అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం జరుగుతుందని. ముఖ్యంగా గణేష్‌ శోభయాత్ర నిర్వహించే మార్గంలో ఎలాంటి ట్రాఫిక్‌ అంతరాయణ కలగకుండా రేపటి నుండి ట్రాఫిక్‌ మళ్ళింపు కొనసాగించడంతో పాటు అన్ని ముఖ్యమైన జంక్షన్లతో పాటు ముఖ్యమైన మార్గాల్లో ట్రాఫిక్‌ సిబ్బంది నియమించడం జరిగిందని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ వెల్లడిరచారు.

పోలీసుల సూచనలు.. బానాసంచా కాల్చడం నిషేధం

శోభయాత్ర నిర్వహించే నిర్వహకులు సైతం పోలీసులను పాటించాల్సిందిగా పోలీస్‌ కమిషనర్‌ పలుసూచనలు చేస్తూ నిమజ్జన ఊరేగింపులో శాంతియుతంగా పాల్గొనాలని, నిర్వాహకులు నిమజ్జనం కోసం వాహనాలను ముందుగానే ఏర్పాటు చేసుకోవాలని, ఆడియో సిస్టమ్స్‌ నిర్ణీత స్థాయిలో వుయోగించాలని, డి.జేలు పూర్తిగా నిషేధమని, వాహనాలను ట్రాఫిక్‌ కు అంతరాయం కలగకుండా నడపాలని, వాహనాలను ప్రార్థన మందిరాల వద్ద నిలపరాదని, తెలిపారు.

ఫోన్‌ నెంబర్‌ 100 డయల్‌

శోభయాత్ర వేళ బానాసంచా కాల్చడం నిషేధమని, శోభయాత్ర కోనసాగే మార్గంలో విద్యుత్తు తీగలను గమనిస్తూ యాత్ర కోనసాగాలని, ముఖ్యంగా నిమజ్జనం ప్రాంతానికి చిన్నపిల్లలను తీసుక వెళ్ళకుండా జాగ్రత్త పడాకలని, అనుమానస్పద వ్యక్తులు, వస్తువులు కనిపించినప్పుడు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వలని , ఎటువంటి ‘‘ రూమర్స్‌ ‘‘ ( పుకార్ల) ను నమ్మరాదని, మద్యం సేవించి ఊరేగింపులో పాల్గొనడం తప్పు వారిపై కఠిన చర్యలు తీసుకోబడును. అత్యవసర సమయంలో సంప్రదించవలసిన ఫోన్‌ నెంబర్‌ 100 డయల్‌ చేయాలని. పోలీసులు సూచించిన నిబంధనలు పాటిస్తూ శోభయాత్ర, నిమజ్జనోత్సవాన్ని ప్రశాంతంగా నిర్వహించుకుందామని పోలీస్‌ కమిషనర్‌ పిలుపు నిచ్చారు.

 Also Read: Strange incident: హుండీ దోచేసిన వారికి.. చుక్కలు చూపించిన అమ్మవారు.. దెబ్బకు తిరిగిచ్చేసిన దొంగలు!

Just In

01

Coolie: ‘కూలీ’ మూవీ ‘చికిటు’ ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో రచ్చ రచ్చ!

JD Chakravarthy: ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ క్రెడిట్ నాదే..

Malkaajgiri Excise: డిఫెన్స్ మద్యం స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

Chiranjeevi Team: ‘స్పిరిట్’, ‘ది ప్యారడైజ్‌’ చిత్రాలలో చిరు.. క్లారిటీ ఇచ్చిన టీమ్!

GHMC: ఎంటమాలజీలో ఇష్టారాజ్యంగా జీతాల చెల్లింపులు.. చార్మినార్ జోన్ లో వెలుగు చూసిన అక్రమం