SLBC Project (imagecredit:twitter)
తెలంగాణ

SLBC Project: ఎస్ఎల్‌బీసీ పనులపై సీఎం కీలక వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

SLBC Project: ఎస్ఎల్బీసీ పనులు ఆగడానికి వీలు లేదని, 2027 డిసెంబరు 9 లోగా ఎట్టిపరిస్థితుల్లోనూ పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అధికారులను ఆదేశించారు. జూబ్లీహిల్స్ నివాసంలోని సీఎం నివాసంలో రాత్రి ఎస్ఎల్ బీసీ(SLBC) పనుల పునరుద్దరణ పైన నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumra Redddy), అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎస్ ఎల్ బీ సీ పనులు ఒక్క రోజు కూడా ఆలస్యం కావడానికి వీలు లేదని స్పష్టం చేశారు. ఎస్ఎల్బీసీ కేవలం నల్గొండ జిల్లా కే కాదు తెలంగాణ అత్యంత కీలకం అన్నారు. ఎలాంటి ఖర్చు లేకుండా నీళ్లు ఇవ్వడానికి ఎస్ ఎల్ బీ సీ లో అవకాశం ఉందన్నారు.

అంకితం చేయాలన్నదే లక్ష్యం

శ్రీశైలం నుంచి అక్కంపల్లి రిజర్వాయర్ వరకు ఉన్న సమస్యల పైన తక్షణమే సంచారం ఇవ్వాలని ఆదికారులను ఆదేశించారు. ఒక్క సమావేశం లోనే అన్ని సమస్యలకు పరిష్కారం అన్నారు. అటవీ శాఖ అనుమతులపైన ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. డిసెంబర్ 9 ,2027 న తెలంగాణ(Telangana) ప్రజలకు ఎస్ ఎల్ బీ సీ ని అంకితం చేయాలన్నదే లక్ష్యం అన్నారు. పనులకు గ్రీన్ ఛానల్ లో నిధులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. సొరంగం పనుల కోసం కాంట్రాక్టు సంస్థ జేపీ అసోసియేట్స్(JP Associates) అన్ని పరికరాలను సిద్ధం చేసుకోవాలని సూచించారు. కాంట్రాక్టు సంస్థ ఒక్క రోజు పనులు ఆలస్యం చేసినా ఒప్పుకోను అని ఖరాఖండిగా తేల్చి చెప్పారు. సొరంగం తొవ్వకం లో సింగరేణి నిపుణుల సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ఎస్ ఎల్ బీ సీ పనులకు నిరంతరాయం గా విద్యుత్ సరఫరా జరగాలన్నారు. సమావేశంలో నీటి పారుదల శాఖ గౌరవ సలహాదారు లెఫ్టినెంట్ జనరల్ హర్పాల్ సింగ్, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, ప్రభుత్వ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, కల్నల్ పరిక్షిత్ మెహ్రా, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Also Read: Electricity Department: గణేష్ నిమజ్జన ఏర్పాట్లలో విద్యుత్ శాఖ కీలక నిర్ణయం..?

మిగిలిన తొమ్మిది కిలోమీటర్ల సొరంగ మార్గం

ఎస్ఎల్బీసీ పునరుద్దరణ పనులకు అవసరమైన అన్ని అనుమతులు, నిర్ణయాలు తీసుకునేందుకు ఈ నెల 15 లోగా కేబినెట్ సమావేశం ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ని ఆదేశించారు. వెంటనే సంబంధిత విభాగాల అధికారుల స్థాయి సమావేశం ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. ఎస్ ఎల్ బీ సీ(SLBC) పనులకు గ్రీన్ ఛానల్ లో నిధులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం చెప్పారు. మొత్తం 44 కిలోమీటర్ల సొరంగమార్గానికి గాను ఇప్పటికే 35 కిలో మీటర్ల సొరంగం తవ్వడం పూర్తి అయ్యిందని మిగిలిన తొమ్మిది కిలోమీటర్ల సొరంగ మార్గం తవ్వడానికి గాను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించ బోతున్నట్లు ఈ సందర్భంగా పరీక్షిత్ మోహ్ర వివరించారు. ప్రతి నెల 178 మీటర్ల సొరంగం తవ్వడం లక్ష్యంగా పెట్టుకుని జనవరి 2028 నాటికి పూర్తి చేయనున్నట్లు తెలిపారు ప్రపంచంలో అత్యాధునిక సాంకేతికతో కూడిన హెలీ-బోర్న్ సర్వే నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారు. నేషనల్ జియో ఫిజికల్ రీసెర్చ్ ఇనిస్ట్యూట్(NGRI) ద్వారా ఈ సర్వే నిర్వహించాలని నిర్ణయించారు. దీంతో సొరంగం తవ్వకాల సమయంలో ముందుగానే ప్రమాదాలను పసిగట్టే వీలుంటుందని తెలిపారు.

Also Read: Villagers Steal Asphalt: వామ్మో ఇదేం దొంగతనంరా స్వామి.. ఏకంగా కొత్త రోడ్డునే లేపేశారు?

Just In

01

Coolie: ‘కూలీ’ మూవీ ‘చికిటు’ ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో రచ్చ రచ్చ!

JD Chakravarthy: ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ క్రెడిట్ నాదే..

Malkaajgiri Excise: డిఫెన్స్ మద్యం స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

Chiranjeevi Team: ‘స్పిరిట్’, ‘ది ప్యారడైజ్‌’ చిత్రాలలో చిరు.. క్లారిటీ ఇచ్చిన టీమ్!

GHMC: ఎంటమాలజీలో ఇష్టారాజ్యంగా జీతాల చెల్లింపులు.. చార్మినార్ జోన్ లో వెలుగు చూసిన అక్రమం