Warangal (image credit: swetcha reporter)
నార్త్ తెలంగాణ

Warangal: ఒంటరి మహిళలపై దాడి.. వరంగల్‌ పోలీస్‌ల సక్సెస్‌స్టోరీ!

Warangal: నిర్మానుష్య ప్రదేశాల్లో రోడ్లపై ఒంటరి మహిళలే లక్ష్యంగా చేసుకుని మహిళల మెడలో బంగారు గొలుసు ఎత్తుకు వెళుతున్న చైన్‌ స్నాచర్‌ వరంగల్‌ కమిషనరేట్‌ పోలీసులు ఆటకట్టించారు. నిందితుడిని కెయూసి, సిసిఎస్‌ పోలీసు(Police)లు సంయుక్తంగా కలిసి అరెస్టు చేసారు. అరెస్టుకు సంబందించి వరంగల్‌ పోలీస్‌(Police) కమిషనర్‌ సన్‌ ప్రీత్‌ సింగ్‌ వివరాలను వెల్లడించారు. హన్మకొండ జిల్లా(Hanmakonda District) ఎల్కతుర్తి మండలం దామెర ప్రాంతానికి చెందిన మంతుర్తి హరీష్‌(29), ప్రస్తుతం హన్మకొండ రెడ్డి(Hanmakonda Reddy) కాలనీలో అద్దె ఇంటిలో నివాసం వుంటున్న నిందితుడు డిగ్రీ వరకు చదువు పూర్తి చేసిన ఓ సిమెంట్‌ కంపెనీలో క్వాలిటీ టెక్నిషన్‌గా హైదరాబాద్‌లో పనిచేసేవాడు ఇదే క్రమములో మొదటగా ఈ ఏడాది ఇదే సిమెంట్‌ కంపెనీలో ఇంజనీర్‌గా పనిచేస్తున్న సహోఉద్యోగి ఇంటిలో బంగారు గోలుసు చోరీకి పాల్పడి దానిని స్థానిక మణిప్పురం గోల్డ్‌ లోన్‌ కంపెనీలో తాకట్టు పెట్టగా వచ్చిన డబ్బుతో నిందితుడు జల్సాలు చేసేడు.

 Also Read: Charla mandal: భద్రాద్రి జిల్లాలో దారుణం.. గిరిజన యువతిపై ఆటో డ్రైవర్ల..

ద్విచక్ర వాహనలు చోరీ

ఈ సంఘటలో నిందితుడుని స్థానిక నెరెడ్‌మెట్‌ పోలీసులు ఈ ఏడాది అరెస్టు చేసిన జైలుకు తరలించారు. బెయిల్‌పై విడుదలైన నిందితుడిలో ఏలాంటి మార్పు రాకపోగా తన జల్సాలకు అవసరమైన డబ్బు తన వద్ద లేకపోవడంతో నిర్మానుష్య ప్రదేశాల్లో ఒంటరిగా రొడ్డుపై వెళ్తున్న మహిళల మెడలో చైన్‌ స్నాచింగ్‌లకు పాల్పడి వాటిని అమ్మగా వచ్చిన డబ్బుతో జల్సాలు చేద్దామనుకున్న నిందితుడు ముందుగా చైన్‌ స్నాచింగ్‌ చేసేందుకు ద్విచక్ర వాహనాన్ని చోరీ చేసి వెళ్ళి చైన్‌ స్నాచింగ్‌లకు పాల్పడేవాడు. ఇదే రీతిలో నిందితుడు వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో మొత్తం పది చైన్‌ స్నాచింగ్‌లు, మూడు ద్విచక్ర వాహన చోరీలకు పాల్పడ్డాడు. ఇందులో కెయూసి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మూడు, రాయపర్తి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో రెండు, అలాగే సుబేదారి, కాజీపేట, హసన్‌పర్తి, కమలాపూర్‌, కరీంనగర్‌ జిల్లాలోని చిగురుమామిడి పోలీస్‌ స్టేషన్ల పరిధిలో ఒకటి చోప్పున చైన్‌ స్నాచింగ్‌ చోరీలకు పాల్పడగా, హన్మకొండ, హసన్‌పర్తి, సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ పోలీస్‌ స్టేషన్ల(Husnabad Police Stations) పరిధిలో నిందితుడు మూడు ద్విచక్ర వాహన చోరీలకు పాల్పడటం జరిగింది.

ప్రత్యేక బృందాలతో దర్యాప్తు

ఈ వరుస చైన్‌ స్నాచింగ్‌ చోరీలపై అప్రమత్తమైన పోలీసులు క్రైమ్స్‌, హన్మకొండ ఏసిపిల అధ్వర్యంలో ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టారు. పోలీసులకు అందుబాటులో వున్న టెక్నాలజీని వినియోగించుకోని నిందితుడుని గుర్తించిన పోలీసులు పక్కా సమచారంతో  ఉదయం పోలీసులు యాదవ్‌నగర్‌ క్రాస్‌ రోడ్డు వద్ద వాహన కెయూసి, సిసిఎస్‌ పోలీసులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో చోరీ చేసిన బంగారు గోలుసులను విక్రయించేందుకు అనుమానస్పదంగా చోరీ చేసిన ద్విచక్ర వాహనంపై వస్తున్న నిందితుడుని రొడ్డుపై తనిఖీలు చేస్తున్న పోలీసులను చూసి తప్పించుకొని పారిపోతున్న నిందితుడుని పోలీసులు పట్టుకొని తనిఖీ చేయగా నిందితుడి వద్ద బంగారు గొలుసును గుర్తించిన పోలీసులు నిందితుడిని పోలీసులు అదుపులో తీసుకొని విచారించగా నిందితుడు పాల్పడిన చైన్‌ స్నాచింగ్‌, ద్విచక్ర వాహన చోరీలకు పాల్పడినట్టు అంగీకరించాడు.

237గ్రాముల బంగారు

నిందితుడు ఇచ్చిన సమాచారంతో అతను నివాసం వుంటున్న అద్దె ఇంటి నుండి పోలీసులు మిగితా చోరీ సోత్తును స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసిన నిందితుడి నుండి సూమారు 23లక్షల 50వేల రూపాయల విలువ గల 237గ్రాముల బంగారు పుస్తెల తాళ్ళు, గొలుసులు, మూడు ద్విచక్ర వాహనాలు, పదివేల రూపాయల నగదు, ఒక సెల్‌ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడుని పట్టుకొవడంలో ప్రతిభ కబరిచిన క్రైమ్స్‌ డిసిపి గుణశేకర్‌, క్రైమ్స్‌ ఏసిపి సదయ్య, హన్మకొండ ఏసిపి నర్సింహరావు, కెయూసి, సిసిఎస్‌ ఇన్స్‌స్పెక్టర్లు రవికుమార్‌, రాఘవేందర్‌, ఏఏఓ సల్మాన్‌ పాషా, సిసిఎస్‌ ఎస్‌.ఐ లు రాజ్‌కుమార్‌, శివకుమార్‌, హెడ్‌కానిస్టేబుళ్ళు అంజయ్య, జంపయ్య, కానిస్టేబుళ్ళు మధుకర్‌, చంద్రశేకర్‌, రాములు, నగేష్‌లతో కెయూసి పోలీస్‌ స్టేషన్‌ సిబ్బందిని పోలీస్‌ కమిషనర్‌ అభినందించారు.

 Also Read: Gadwal Town: ఇళ్ల మధ్యనే కల్లు విక్రయాలు.. పట్టించుకోని ఎక్సైజ్ శాఖ అధికారులు

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు