Gadwal Town: కల్లుకు బానిసైన ప్రజలకు అందుబాటులో ఉండేందుకు యథేచ్ఛగా కల్లు దుకాణాలు వెలుస్తున్నాయి. గద్వాల పట్టణంలోని జమ్మిచెడు 4 వ వార్డులో ఒక కల్లు కాంపౌండ్ వల్ల ఆ వార్డు ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.. గత కొంత కాలంగా ఇల్ల మద్యనే కల్లు తయారీ కేంద్రం నిర్వహిస్తున్నారు. అక్కడ నుండి తొలగించాలని గత కొన్ని నెలల నుండి నాలుగో వార్డు ప్రజలు కోరుతున్నా..అక్కడ కల్లు దుకాణం నిర్వహించే వ్యక్తి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాడని వార్డు ప్రజలు తెలిపారు.
Also Read: Mee Seva New Service: మీ సేవ పరిధిలోకి కొత్త సేవలు.. నిమిషాలలో ఈ సర్టిఫికెట్ జారీ
కాగ ప్రస్తుతం అక్కడే వార్డు ప్రజల సహకారంతో శివాలయం (స్కందేశ్వర ఆలయం) ఏర్ఫాటుకు సంకల్పించారు..త్వరితగతిన శివాలయం ఏర్పాటుతో పాటు నిత్యం శివునికి మహిళలు పెద్దఎత్తున పూజలు నిర్వహిస్తున్నారు.అయితే దేవుని దర్శనానికి వెళ్ళిన వారికి పక్కనే ఈ కల్లు సీసాలు మరియు కాంపౌండ్ దర్శనమిస్తుండంతో మహిళలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు..ఇప్పటికైన అక్కడినుండి కల్లు కాంపౌండ్ ని తొలగించాలని నాలుగో వార్డు ప్రజలు కోరుతున్నారు…
ఎక్సైజ్ శాఖ దృష్టి సారించాలి
జిల్లా కేంద్రంలో ఉన్న ఎక్సైజ్ కార్యాలయానికి సమీపంలోనే యథేచ్ఛగా జమ్మిచెడు లో కల్లు దుకాణం నిర్వహిస్తున్నా ఎక్సైజ్ శాఖ అధికారులు దృష్టి సారించకపోవడం శోచనీయమని కాలనీవాసులు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు కాలనీని సందర్శించి శివాలయం తోపాటు ఎల్ల మధ్య ఉన్న కళ్ళు దుకాణాన్ని తరలించాలని వార్డు ప్రజలు కోరుతున్నారు.
Also Read:Jogulamba Gadwal: గద్వాల జిల్లాలో ప్రైవేట్ స్కూల్‌ల దుర్మార్గాలు.. ఫీజుల కోసం విద్యార్థులపై దాడులు