Wanaparthy Police( iMAGE credit: swetcha reporter)
నార్త్ తెలంగాణ

Wanaparthy Police: వనపర్తిలో పోలీస్ విభాగం ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ ప్రారంభం

Wanaparthy Police: వనపర్తి మండలం రాజపేట గ్రామ శివారులో వనపర్తి పోలీస్ శాఖ సౌజన్యంతో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్ ప్రారంభోత్సవానికి రాష్ట్ర పోలీస్ హౌసింగ్ మేనేజింగ్ డైరెక్టర్ , ఐజి రమేష్ రెడ్డి(IG Ramesh Reddy) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, స్తానిక శాసన సభ్యులు తూడి మేఘా రెడ్డి, జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ తో కలిసి పెట్రోల్ బంకు ను ప్రారంభోత్సవం చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రజలకు పోలీసులపై విశ్వసనీయత పెరిగిందని అన్నారు. వనపర్తి జిల్లాలో పోలీస్ (Wanaparthy district Police)విభాగం ద్వారా పెట్రోల్ బంకు ఏర్పాటుకు ప్రతిపాదనలు ఇస్తే జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి , స్తానిక శాసన సభ్యులు వేగంగా స్పందించి అనతి కాలంలోనే అన్ని అనుమతులు ఇవ్వడంతో షరవేగంగా కేవలం 4 నెలల వ్యవధిలో పెట్రోల్ బంక్ ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు.

 Also Read: Mahabubabad District: యువకుడి పై ఆత్మహత్యా యత్నం.. పట్టించుకోని అధికారులు

మత్స్యశాఖ తరపున 47 కోట్ల

అలాగే ఈ ప్రాంతంలో భవిష్యత్తులో బైపాస్ రోడ్డు, మదనపురం రైల్వే నుంచి వనపర్తి వరకు కొత్త క్యారిడార్ నాలుగు లైన్ల రోడ్లను నిర్మిస్తే వాణిజ్యపరంగా అభివృద్ధి చెంది మరిన్ని సంస్థలు ఏర్పాటు అవుతాయని తద్వారా నిరుద్యోగులకు ఉపాధి దొరుకుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం మత్స్యశాఖ తరపున 47 కోట్లతో వనపర్తి జిల్లాకు ఎక్స్ పోర్ట్ ఓరియెంటెడ్ యూనిట్ మంజూరు అయిందని తెలిసిందని, అది కూడా నెలకొల్పితే ఈ ప్రాంతం వాణిజ్యపరంగా బాగా అభివృద్ధి చెందుతుందన్నారు. పోలీసుల మీద పెరుగుతున్న నమ్మకానికి అనువుగా పెట్రోల్ పంపు నిర్వహణలో పారదర్శకత, నాణ్యతా ప్రమాణాలు పాటించి ప్రజల ఆదరణ మరింత పొందుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు.

సమస్యలను పరిష్కరిస్తాం 

అనంతరం వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘరెడ్డి మాట్లాడుతూ పోలీసులు ప్రజలకు అండగా నిలబడి వారి సమస్యలను పరిష్కరిస్తారన్నారు. పోలీస్ విభాగం పై ప్రజలకి మంచి నమ్మకం ఉండటంతో పట్టణ శివారులో పెట్రోల్ బంకు ఏర్పాటు చేయించడం జరిగిందన్నారు. పెట్రోల్ బంకుల్లో నాణ్యత ప్రమాణాలను ఖచ్చితంగా పాటిస్తారనే నమ్మకం ప్రజలకు ఉంటుందని తెలిపారు. అలాగే రాబోవు రోజుల్లో కొత్తకోట, వనపర్తి క్యారీడర్ ఏర్పాటు కోసం చేసిన ప్రతిపాదనలను ఆర్ అండ్ బి మంత్రికి ఇవ్వడం జరిగింది అన్నారు.

పెట్రోల్ బంక్ ఏర్పాటు కీలక పరిణామం

జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ జిల్లాలో ఏర్పాటుచేసిన పోలీస్ పెట్రోల్ బంక్ లో క్వాలిటీ, క్వాంటిటీ పారదర్శకంగా ఉంటుందని అన్నారు. అందుకు అనుగుణంగా నాణ్యత ప్రమాణాలు పెంచితే మరింతగా పెట్రోల్ వినియోగం జరుగుతుందని అన్నారు. జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ప్రత్యేక చొరవ తీసుకొని కొద్ది నెలలోనే పెట్రోల్ బంక్ ఏర్పాటు చేయడం కీలక పరిణామం అన్నారు. ఎస్పీ రావుల గిరిధర్ తో పాటు వారి సిబ్బందిని అభినందించారు. త్వరలోనే అంతే వేగవంతంగా మహిళ సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటుచేసే పెట్రోల్ బంకులను పూర్తిచేయాలని ఐఓసీఎల్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఐ ఓ సి ఎల్ అధికారులు సుమిత్ర, శరణ్య, జిల్లా మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీపీ కిచ్చారెడ్డి, డి.ఎస్.పి వెంకటేశ్వర్లు, సిఐలు, ఎస్సైలు,తదితరులు పాల్గొన్నారు.

 Also Read: Srinivas Goud: స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ సత్తా చాటాల్సిందే: శ్రీనివాస్ గౌడ్

Just In

01

CCI Cotton Procurement: పత్తి కొనుగోళ్లలో అవకతవకలు జరగొద్దు.. పినపాక ఎమ్మెల్యే

Kavitha Janam Bata: కేసీఆర్‌కు ఆ అవసరం లేదు.. నిజామాబాద్ ప్రెస్‌మీట్‌లో కవిత ఆసక్తికర వ్యాఖ్యలు

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?