Srinivas Goud (imagecredit:swetcha)
నార్త్ తెలంగాణ

Srinivas Goud: స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ సత్తా చాటాల్సిందే: శ్రీనివాస్ గౌడ్

Srinivas Goud: అచ్చంపేటలో బీఆర్ఎస్(BRS) నాయకులు కలిసికట్టుగా పని చేయాలని, రాబోయే స్థానిక ఎన్నిక(Local Elections)ల్లో అత్యధిక సంఖ్యలో జడ్పిటిసి(ZPTC), ఎంపీపీ(MPTC), సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకుందామని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్(SrinivasGoud), బీఆర్ఎస్ నియోజకవర్గ ఇంఛార్జ్ మర్రి జనార్థన్ రెడ్డి(Marri Janardhan Reddy) పిలుపునిచ్చారు. లింగాల మండల కేంద్రంలో జరిగిన బీఆర్ఎస్(BRS) పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం వారు మాట్లాడారు.

Also Read: Gaddam Prasad Kumar: మహిళల ఆర్థిక అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం.. గడ్డం ప్రసాద్ కీలక వ్యాఖ్యలు

మాజీ మంత్రి మాట్లాడుతూ..

తెలంగాణకు కేసీఆర్(KCR) పాలననే శ్రీరామరక్ష అని, గ్రామాల్లో ప్రతి ఒక్కరిని చైతన్యం చేయాలన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రూపు రాజకీయాలు లేకుండా సమన్వయంతో పార్టీ కోసం కష్టపడి పనిచేయాలన్నారు. పార్టీలో వ్యక్తులు వస్తుంటారు పోతుంటారు, పార్టీ మాత్రం శాశ్వతంగా ఉంటుందన్నారు. పార్టీను కాపాడే శక్తి కార్యకర్తలకు మాత్రమే వుంటుందని అచ్చంపేట(Achampeta) పార్టీ శ్రేణులు బలమైన సంకేతం ఇచ్చారన్నారు. అందరూ సమన్వయంతో వుండండి, ప్రలోభాలకు లొంగకుండా పార్టీ కోసం నిబద్ధత పని చేయండని, పార్టీలో మంచి గుర్తింపు ఉంటుందన్నారు.

మర్రి జనార్థన్ రెడ్డి మాట్లాడుతూ.. సమన్వయకర్తగా ప్రతి కార్యకర్తకు అందుబాటులో ఉంటానని, ప్రతి గ్రామ పార్టీ నాయకులను, కార్యకర్తలను కలుస్తానని, ఏ సమస్య ఉన్న నా దృష్టికి తీసుకురావాలన్నారు. తిరిగి అచ్చంపేటలో బీఆర్ఎస్ జెండా ఎగరవేయాలని ఆయన పిలుపునిచ్చారు

Also Read: Students Protest: మా సార్ మాకు కావాలి.. నిరసనకు దిగిన విద్యార్థులు.

Just In

01

Vande Bharat Sleeper Train: కళ్లు చెదిరే సౌకర్యాలతో.. వందే భారత్ స్లీపర్ రైలు.. పండగే పండగ!

Mahabubabad District: ఆ కార్యాలయంలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తం.. పట్టించుకోని అధికారులు

OG Movie BGM: ‘ఓజీ’ కోసం ప్రాణం పెడుతున్న థమన్.. ఆస్కార్ రేంజ్‌లో మ్యూజిక్

All India Prison Duty Meet 2025: తెలంగాణలో ఆలిండియా ప్రిజన్​ డ్యూటీ మీట్.. ఎప్పుడంటే..?

Viral Video: వింత ఆక్సిడెంట్.. నడి రోడ్డు మీద రెండు బైక్స్ కొట్టుకున్నాయి.. దెయ్యాలా పనే అంటున్న నెటిజన్లు