Students Protest( IMAGE credit: swetcha reporter)
నార్త్ తెలంగాణ

Students Protest: మా సార్ మాకు కావాలి.. నిరసనకు దిగిన విద్యార్థులు

Students Protest: విద్యార్థుల ప్రగతి కోసం పాటు పడుతున్న మా సార్ మాకే కావాలని జనగామ జిల్లా(Jangaon District) స్టేషన్ ఘన్ పూర్ మండల కేంద్రంలోని గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాల విద్యార్థులు శనివారం మధ్యాహ్న భోజనాన్ని బహిష్కరించి ధర్నాకు దిగారు. విద్యార్థులు, అధికారులు తెలిపిన వీరాల్లోకి వెళ్తే… మండల కేంద్రంలోని గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలలో సీనియర్ అసిస్టెంట్ గా ఆరేళ్లు పని చేసిన ధరావత్ రాజు బదిలీపై వెళ్లి 2022లో అడిషనల్ ఫుల్ చార్జ్ హెచ్ఎంగా బదిలీపై వచ్చారు.

 Also Read: Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?

అప్పటినుండి విద్యార్థుల యోగక్షేమాలతో పాటు ప్రగతికి కృషి చేస్తున్నారు. విధులు సక్రమంగా నిర్వహించని సిబ్బందిని బదిలీ చేయించాడు. దీంతో కక్ష కట్టిన కొందరు ఉపాధ్యాయులు హెచ్ఎంపై అసత్య ఆరోపణలతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఉన్నతాధికారులు హెచ్ఎం ధరావత్ రాజును మరో స్కూల్ కు పంపించినట్లు తెలియడంతో విద్యార్థులు పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. విషయం తెలుసుకున్న స్థానిక ఆర్డిఓ డిఎస్ వెంకన్న, తాసిల్దార్ వెంకటేశ్వర్లు, ఎస్సై వినయ్ కుమార్, డిటిడిఓ లు ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడించి విద్యార్థులకు నచ్చజెప్పి ధర్నాను విరమింప చేశారు.

 Also Read: Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

హుజూరాబాద్‌లో మండల పరిషత్ ఎన్నికల ముసాయిదా జాబితా విడుదల

మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల (MPTC) ఎన్నికల కోసం ఓటర్ల జాబితా, పోలింగ్ స్టేషన్ల ముసాయిదా జాబితాను శనివారం విడుదల చేశారు. హుజూరాబాద్‌లోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ సునీత ఈ జాబితాలను విడుదల చేశారు. ​రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన సర్క్యులర్ నెం. 128/TSEC-PR/2025, Dt.30.08.2025 ప్రకారం ఈ ప్రక్రియ చేపట్టారు. ఈ ముసాయిదా జాబితాలపై అభ్యంతరాలు, సూచనలు స్వీకరించడానికి అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశం సెప్టెంబర్ 8, 2025, సోమవారం ఉదయం హుజూరాబాద్‌లోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జరుగుతుందని మండల అభివృద్ధి అధికారి సునీత తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ వేణుగోపాల్, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ తదితరులు పాల్గొన్నారు.

 Also Read: BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Just In

01

CCI Cotton Procurement: పత్తి కొనుగోళ్లలో అవకతవకలు జరగొద్దు.. పినపాక ఎమ్మెల్యే

Kavitha Janam Bata: కేసీఆర్‌కు ఆ అవసరం లేదు.. నిజామాబాద్ ప్రెస్‌మీట్‌లో కవిత ఆసక్తికర వ్యాఖ్యలు

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?