Mahabubabad District: అకారణంగా తమపై దాడికి దిగి ఇంటి వద్దకు వచ్చి గేటును విరగకొట్టేందుకు ప్రయత్నించిన వారిపై ఫిర్యాదు చేస్తే ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని బాధితుడు హెచ్ ఆర్ నాయక్(HR Nayak) ఆవేదన వ్యక్తం చేశాడు. వివరాల్లోకి వెళితే… శనివారం వినాయక చవితి నిమజ్జన కార్యక్రమంలో భాగంగా బిబి గూడెం మాజీ సర్పంచ్ లతా రాజు తమ వినాయక మండపం వద్దకు వచ్చి కావాలనే ట్రాక్టర్లను అడ్డుపెట్టి తమ వినాయకుడిని నిమజ్జన కార్యక్రమానికి తీసుకెళ్లకుండా అడ్డుకుంటూ అకారణంగా దాడి చేసేందుకు యత్నించిన వారిపై కేసు నమోదు చేయాలని చివ్వెంలా పోలీసులను హెచ్ఆర్ నాయక్ కోరారు.
మాజీ సర్పంచ్ లతా రాజు
వినాయక నిమజ్జనంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోవద్దనే ఉద్దేశంతో చాలా ఓపిక పట్టి ఊరుకున్నామని హెచ్ ఆర్ నాయక్ తెలిపారు. ఈ మేరకు సోమవారం బిబిగూడెంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో హెచ్ఆర్ నాయక్ మాట్లాడాడు. మాజీ సర్పంచ్ లతా రాజు కావాలనే తమపై దాడికి ప్రయత్నించారని చెప్పారు. భూ వివాదాల కారణంగానే కావాలనే తమపై దాడి చేసి ఇబ్బందులకు గురి చేయాలని కక్షపెంచుకున్నారని తెలిపారు. గొడవలు ఎందుకులే అనే మేమంతా ఊరుకుంటే లతా రాజు తమ అనుచరులతో గొడ్డలి, కత్తులతో రాత్రి వేళల్లో మా ఇంటి గేటు వద్దకు వచ్చి కిరాయి గుండాలతో దాడి చేసేందుకు తీవ్రయత్నం చేశారని వివరించారు.
ఆ కారణంగా దాడికి దిగి..
చివ్వెంలా పోలీస్ స్టేషన్లో(Chivvenla Police Station) ఫిర్యాదు చేసిన తమకు రక్షణగా ఉండాల్సిన పోలీసులు లతా రాజులపై చర్యలు తీసుకోకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. చివ్వెంలా పోలీస్ స్టేషన్లో చర్యలు తీసుకోకపోతే తాము జిల్లా ఎస్పీ నరసింహని కలిసి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఆ కారణంగా దాడికి దిగిన లతా రాజులతో తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని, ఈ విషయంలో జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు స్పందించి సంబంధిత వ్యక్తులపై చట్టరీత్యా కఠిన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా లతా రాజు, వారి అనుచరులు, కిరాయి గుండాలపై తగిన చర్యలు తీసుకొని మా కుటుంబానికి పూర్తి రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసుల దేనని హెచ్ఆర్ నాయక్ కోరారు.
Also Read; Ganesh Immersion: వెరీ గుడ్ ఆఫీసర్స్, స్టాఫ్.. సీఎం రేవంత్ అభినందనలు.. ఎందుకంటే?