Viral News: ఎక్కడ చూసిన ప్లాస్టిక్ వినియోగం విచ్చల విడిగా పెరిగి పర్యావరణం కలుషితమై వాతావరణ మార్పులు సంభవించి అనేక దుష్పరిణామాలు చూస్తున్నాం.. ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో మానవ మనుగడే కష్టమవుతుందని పర్యావరణాన్ని పరిరక్షిద్దాం ప్లాస్టిక్ వాడవద్దు.. భూమాతను నాశనం చేయవద్దని దండం పెడుతున్నాం.. మొక్కలు పెంచాలి పచ్చదనం కాపాడాలని.. పెళ్లికి వచ్చిన అతిథులకు సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పని చేస్తున్న నవ వధూవరులు దండం పెడుతూ చేస్తున్న విజ్ఞప్తి ఇది. ప్లాస్టిక్ స్థానంలో సహజసిద్ధమైన వస్త్ర బ్యాగులను వినియోగించాలని, ఇంటి పరిసరాల్లో మొక్కలు నాటి పచ్చదనం పెంచాలని వాళ్లు విజ్ఞప్తి చేశారు. వచ్చిన అతిథులకు రిటర్న్ గిఫ్ట్ గా జ్యూట్ బ్యాగులు, మొక్కలు ఉచితంగా పంపిణీ చేశారు.
పర్యావరణ పరిరక్షణ కోసం వివాహ వేడుకల్లో వినూత్న ప్రయోగం
వరంగల్ విద్యానగర్ కు చెందిన రిటైర్డ్ సింగరేణి ఉద్యోగి గుండపు రవీందర్ కుమారుడైన గుండపు సాయిచందు, హనుమకొండ జులైవాడ ప్రాంతానికి చెందిన సల్ల సంపత్ కుమార్ కుమార్తె ప్రీతి.. ఇద్దరు హైదరాబాదులో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పని చేస్తున్నారు. తమ వివాహ రోజు ప్రపంచానికి ఒక మంచి సందేశాన్ని ఇవ్వాలని లక్ష్యంగా.. ప్రపంచ పర్యావరణ దినోత్సవ రోజు వివాహం జరపాలని నిర్ణయించుకున్నారు. ఈ వివాహం గురువారం ఉదయం హనుమకొండలో.. బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా జరిగింది.
Also Read: Pawan Kalyan: ఎమోషనల్ అయిన పవన్ కళ్యాణ్.. టార్గెట్ ఫిక్స్!
పర్యావరణ పరిరక్షణ కోసం వినూత్న రీతిలో వివాహా వేడుకలు చేసుకున్నారు. పెళ్లికి వచ్చిన అతిథులకు అందరికీ జ్యూట్ బ్యాగులతో పాటు మొక్కలు పంపిణీ చేశారు. అలాగే వివాహ వేడుక అంతా ప్లాస్టిక్ లేకుండా సాగింది. ప్లాస్టిక్ కప్పులు, ప్లాస్టిక్ ఫ్లెక్సీలు, ప్లాస్టిక్ ప్లేట్ల స్థానంలో.. పర్యావరణానికి ఏమాత్రం హాని కలిగించని విస్తరాకులు, పేపర్ గ్లాసులు క్లాత్ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. నవ దంపతులు చేసిన కృషిని స్థానిక ప్రజా ప్రతి నిధులు పెళ్లికి వచ్చిన అతిథులు ప్రశంసించారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ నవ దంపతుల కృషిని ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్లాస్టిక్ అంతమందించేందుకు ప్రతిపరుడు తమ బాధ్యతగా ముందుకు రావాలని మంత్రి ప్రజలను కోరారు.
మొక్కలు బహుమతిగా ఇచ్చి వివాహ ఆహ్వానం
వివాహం నిశ్చయమైన తర్వాత పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అంటూ శుభ పత్రికల్లో పేర్కొన్న నవ దంపతులు బంధుమిత్రులను వివాహానికి ఆహ్వానించేందుకు శుభలేఖతోపాటు ఇంటికి ఒక మొక్కను అందజేశారు. మొక్కలు నాటి సంరక్షించడంతోపాటు మా వివాహానికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించాలని వినూత్నంగా వివాహానికి ఆహ్వానించడం వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
పర్యావరణ శాఖ మంత్రి అభినందనలు
పర్యావరణ పరిరక్షణ కోసం నవ దంపతులు తీసుకున్న నిర్ణయాన్ని ప్లాస్టిక్ వినియోగం లేకుండా వివాహం చేసుకోవడం, వివాహానికి వచ్చిన వారికి మొక్కలను బహుకరించడం అభినందనీయమని రాష్ట్ర పర్యావరణ, అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ నూతన దంపతులను, వారికి స్పూర్తిగా నిలిచిన ప్రముఖ సామాజిక వేత్త సుంకరి ప్రశాంత్ అభినందించారు వివాహ వేడుకలకు హాజరైన మంత్రి కొండ సురేఖ నవ దంపతులను ఆశీర్వదించి వారు చేస్తున్న ప్రయత్నాన్ని అభినందించి వీరు చేస్తున్న ప్రయత్నాన్ని అందరూ ఆచరించి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని పిలుపునిచ్చారు.
Also Read: Abhay Patil: స్వరం మార్చిన బీజేపీ.. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గా అభయ్ పాటిల్?