Abhay Patil9 image credit: twitter)
Politics

Abhay Patil: స్వరం మార్చిన బీజేపీ.. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గా అభయ్ పాటిల్?

Abhay Patil: బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ అంశంపై రాష్ట్ర బీజేపీ ఎట్టకేలకు తన స్వరం మార్చింది. గతంలో అభయ్ పాటిల్‌ను కేవలం సలహాలు, సూచనల మేరకే ఆహ్వానిస్తున్నామని రాష్ట్ర నాయకత్వం స్పష్టం చేసింది. తాజాగా కేంద్ర మంత్రి, పార్టీ రాష్ట్ర  అధ్యక్షుడు కిషన్ రెడ్డి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇ‌న్‌ఛార్జ్‌గా ఆయన్ను పేర్కొన్నారు. అయితే, మౌఖికంగా ఇది జరుగుతున్నా పార్టీ కార్యక్రమాల్లో మాత్రం ఆయన్ను ఎమ్మెల్యేగానే పేర్కొంటుండడం శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే గతంలో ఇన్‌ఛార్జ్ విషయంలో పార్టీలో గొడవ జరిగింది.

చివరకు పార్టీ ఓకే చేయడంతో ఆ చర్చకు బ్రేక్ పడినా శ్రేణులకు మరో చిక్కు వచ్చి పడింది. ఎందుకంటే పాటిల్‌ను మౌఖికంగా ఇన్‌ఛార్జ్‌గా చెబుతున్నా కార్యక్రమాల్లో మాత్రం పేర్కొనకపోవడంతో నాయకులు, కార్యకర్తలు ఆయన్ను కలవాలా వద్దా అనే డైలమాలో పడ్డారు.

పాటిల్‌పై తీవ్ర వ్యతిరేకత!

అభయ్ పాటిల్ అంటే పార్టీలో ఎవరికీ గిట్టడం లేదనే ప్రచారం జరుగుతోంది. ముక్కు సూటి తనం ఆయన నైజం కావడంతో కొట్టినట్లుగా మాట్లాడడం వల్ల పలువురు నేతలు ఆయన్ను అంగీకరించడం లేదని సమాచారం. ఈ నేపథ్యంలో ఆయన్ను క్యాడర్ ఎవరైనా కలిస్తే రాష్ట్ర నేతలకు దూరమయ్యే అవకాశముందనే భయంతో అంతా గప్ చుప్‌గా ఉంటున్నారు.

‘‘కరవమంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం’’ అన్నట్లుగా నేతల పరిస్థితి మారింది. తెలంగాణకు అభయ్ పాటిల్‌ను కేటాయించన నాటి నుంచి పార్టీలో ఇదే సీన్ కొనసాగుతున్నది. అయినా ఆయన అవేమీ పట్టించుకోకుండా సైలెంట్‌గా వచ్చి తనపని తాను చేసుకుంటూ పోతున్నారు. గత పార్లమెంట్ ఎన్నికల సమయంలో అభయ్ పాటిల్‌ను హైకమాండ్ తెలంగాణకు కేటాయించింది. ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 8 లోక్ సభ స్థానాల్లో పార్టీ కూడా గెలిచింది.

 Also Read: Chenab Rail Bridge: దేశ ప్రజలకు గుర్తుండిపోయే రోజు.. వరల్డ్‌లోనే ఎత్తైన వంతెన ప్రారంభం

ముక్కుసూటి మనిషి.. అదే పెద్ద సమస్య

పాటిల్ కర్ణాటకకు చెందిన ఎమ్మెల్యే. ముక్కుసూటి మనిషి అని ఆయనకు పేరుంది. ఈ కారణంగానే రాష్​ట్ర నాయకత్వానికి, ఆయనకు మధ్య పొసగడం లేదని తెలుస్తోంది. ఎందుకంటే గత పార్లమెంట్ ఎన్నికలకు ఇన్‌ఛార్జ్‌గా తెలంగాణలో పనిచేసిన ఈయన గ్రౌండ్ లెవల్‌లో మైక్రో అబ్జర్వేషన్ చేశారు. ఆయన తీరు చాలా మంది నేతలకు అప్పట్లో నిద్ర పట్టనివ్వలేదు. ఆయన మీటింగ్‌కు వస్తున్నారంటే ఎవరైనా సరే జంకాల్సిందే. ఎవరో ఏమో అనుకుంటారని అస్సలు అనుకోరు. ఆయన మీటింగ్‌కు సమయానికి రాకుంటే ఎంత పెద్ద నేత అయినా సరే గేట్ బంద్ చేసి మరీ హాజరైన వారితోనే కొనసాగిస్తారనే పేరుంది. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఇక్కడి నేతలు పలువురు ఇలాంటి ఇబ్బందులే ఎదుర్కొన్నారు. దీంతో ఆయన సమవేశం అంటే జంకాల్సిన పరిస్థితికి వచ్చింది.

ప్రతి ఒక్కరూ తమకు ఇచ్చిన సభ్యత్వాల టార్గెట్‌ను పూర్తిచేయాలి 

సమయానికి ఉండాలనే అలర్ట్ మొదలైంది. సభ్యత్వ నమోదు ఇన్‌ఛార్జ్‌గా సైతం ఈయన రాష్ట్రంలో పర్యటించారు. ఆ సమయంలోనూ బీజేపీలో తాను ఫలానా వ్యక్తి శిష్యుడిని అని, తనను ఎవరేం చేస్తారనే ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దని తనదైన శైలిలో చురకలంటించారు. తాను ఎమ్మెల్యే అని, ఎంపీ అని భేషజాలకు పోకుండా ప్రతి ఒక్కరూ తమకు ఇచ్చిన సభ్యత్వాల టార్గెట్‌ను పూర్తిచేయాల్సిందేనని నొక్కి చెప్పారు. లేదంటే పదవులు పోతాయని హెచ్చరించారు.

ఈ కారణంగానే పాటిల్‌ను రాష్ట్ర ఇన్‌ఛార్జ్‌గా స్టేట్ యూనిట్ యాక్సప్ట్ చేసినా, కార్యక్రమాల్లో మాత్రం ఎమ్మెల్యేగానే పేర్కొంటుండం చర్చనీయాంశంగా మారింది. ఆయన మాత్రం ఇదేం పట్టించుకోకుండా ప్రధాని మోదీ 11 ఏండ్ల పాలనపై పలు జిల్లాల్లో పర్యటిస్తున్నారు.

 Also Read: Minister Sithakka: అమ్మాయిల స్వీయ రక్షణకు.. బాలికా రక్షక టీంలు!

Just In

01

CM Revanth Reddy: దేశంలోనే భాద్‌షా.. జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు