Chenab Rail Bridge: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే ఆర్చి బ్రిడ్జి దేశంలో అందుబాటులోకి వచ్చింది. జమ్ముకశ్మీర్ లోని చినాబ్ నదిపై నిర్మించిన ఈ వంతెనను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. అనంతరం వంతెనపై జాతీయ జెండాను ఊపుతూ అంజి బ్రిడ్జిని దేశానికి అంకితం చేశారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ పాల్గొన్నారు.
ఇంజనీర్లపై మోదీ ప్రశంసలు
చినాబ్ నదిపై నిర్మించిన అంజి బ్రిడ్జి ప్రారంభోత్సవానికి ముందు ప్రధాని మోదీ వంతెనను పరిశీలించారు. అపై బ్రిడ్జిని నిర్మించిన ఇంజినీర్లను కలుసుకొని మాట్లాడారు. ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే ఆర్చి బ్రిడ్జిని నిర్మించినందుకు వారిని అభినందించారు. అయితే పహల్గాం ఉగ్రదాడి తర్వాత ప్రధాని మోదీ జమ్మూకశ్మీర్ లో పర్యటించడం ఇదే తొలిసారి. వంతెన ప్రారంభోత్సం అనంతరం ఆయన కట్ ఢాలో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్నారు. కాశ్మీర్ లోని ఉధంపూర్ – శ్రీనగర్ – బారాముల్లా రైల్వే లింక్ (USBRL)లో భాగంగా కేంద్రం ఈ వంతెనను నిర్మించింది. చినాబ్ నదికి 359 మీటర్ల ఎత్తులో దీనిని నిర్మించారు.
#WATCH | J&K: Prime Minister Narendra Modi waves the Tiranga as he inaugurates Chenab bridge – the world’s highest railway arch bridge.#KashmirOnTrack
(Video: DD) pic.twitter.com/xfBnSRUQV5
— ANI (@ANI) June 6, 2025
Also Read: Elon musk on Trump: ట్రంప్‌పై ఎలాన్ మస్క్ బిగ్ బాంబ్.. షేక్ అవుతున్న ప్రపంచ దేశాలు!
బ్రిడ్జి మరిన్ని ప్రత్యేకతలు ఇవే!
చినాబ్ నదిపై నిర్మించిన అంజీ రైల్వే బ్రిడ్జ్ (కేబుల్ వంతెన) 1,315 మీటర్ల పొడవు కలిగి ఉంది. పారిస్ లోని ప్రఖ్యాత ఈఫిల్ టవర్ తో పోలిస్తే దీని ఎత్తు ఇంకా 30 మీటర్లు అధికం కావడం విశేషం. ఈ బ్రిడ్జ్ నిర్మాణానికి కేంద్రం దాదాపు రూ. 1,486 కోట్లు ఖర్చు చేసింది. 2002లో అటల్ బిహారీ వాజ్‌పేయీ హయాంలో ఈ ప్రాజెక్ట్‌కు రూపకల్పన జరగడం గమనార్హం. దాదాపు 23 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం ఈ బ్రిడ్జ్.. కాశ్మీర్ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. బాంబు పేలుళ్లు, భూకంపాలు, వరదలను సైతం తట్టుకునేలా దీన్ని రూపొందించారు. 120 ఏళ్ల వరకూ ఈ వంతెన చెక్కు చెదరదని ఇంజనీర్లు చెబుతున్నారు.