Elon musk on Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మధ్య తలెత్తిన విభేదాలు రోజు రోజుకు మరింత ముదురుతున్నాయి. రిపబ్లికన్ ట్యాక్స్ బిల్లు (Republican Tax Bill)ను మస్క్ వ్యతిరేకించినప్పటికీ నుంచి వీరిమధ్య క్లాష్ మెుదలైంది. దీంతో ఇరువురు ఒకరిపై ఒకరు పోటాపోటీగా మాటల యుద్ధానికి దిగుతున్నారు. ట్రంప్ ను పదవిలో నుంచి దించి ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ను ప్రెసిడెంట్ చేయాలంటూ మస్క్ చేసిన వ్యాఖ్యలు యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేశాయి. ఈ క్రమంలోనే తాజాగా ఆయన ట్రంప్ పై సంచలన ఆరోపణలు చేశారు. ఎక్స్ లో ఆయన పెట్టిన పోస్ట్ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చర్చకు తావిస్తోంది.
మస్క్ ఏమన్నారంటే?
ప్రముఖ బిలీయనీర్ ఎలాన్ మస్క్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ఎక్స్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికాను షేక్ చేసిన లైంగిక కుంభకోణం నిందితుడు జెఫ్రీ ఎప్ స్టైన్ (Jeffrey Epstein)తో ట్రంప్ సు సంబంధాలు ఉన్నాయని మస్క్ ఆరోపించారు. అంతేకాదు అతిపెద్ద బాంబు పేల్చాల్సిన సమయం ఆసన్నమైందంటూ ఎక్స్ లో రాసుకొచ్చారు. ఎప్ స్టైన్ తో ఉన్న రిలేషన్స్ వల్లే దర్యాప్తులో వెల్లడైన విషయాలను ట్రంప్ ఇప్పటివరకూ బహిరంగ పరచలేదని మస్క్ పేర్కొన్నారు. భవిష్యత్తులో నిజా నిజాలు బయటపడతాయని మస్క్ అభిప్రాయపడ్డారు.
Time to drop the really big bomb:@realDonaldTrump is in the Epstein files. That is the real reason they have not been made public.
Have a nice day, DJT!
— Elon Musk (@elonmusk) June 5, 2025
2019లో అనుమానస్పద మృతి
అమెరికాలోని అతిపెద్ద లైంగిక కుంభకోణంలో నిందితుడైన ఎప్ స్టైన్ 2019లో హఠాత్తుగా జైల్లోనే మరణించాడు. అతడికి క్లింటన్, ట్రంప్, ప్రిన్ ఆండ్రూ వంటి రాజకీయ ప్రముఖులతో సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే జెఫ్రీ కేసుకు సంబంధించిన ఫైల్స్ ను బయటపెట్టాలని పెద్ద ఎత్తున డిమాండ్ వచ్చింది. అయితే ఫైల్స్ బయటపడినా తనకు ఎలాంటి ఇబ్బంది లేదని అప్పట్లోనే ట్రంప్ చెప్పుకొచ్చారు. ఎప్ స్టైన్ తో తనకు ఎలాంటి సంబంధం లేదని ఓ మీటింగ్ లో స్పష్టం చేశారు.
Also Read: CM Revanth Reddy: ప్రజలకు గుడ్ న్యూస్.. ప్రతీ నెలా రెండుసార్లు.. సీఎం కీలక నిర్ణయం
జెఫ్రీ ఎప్‌స్టైన్ చేసిన తప్పేంటి?
14-17 ఏళ్ల వయస్సు గల మైనర్ బాలికలను రిక్రూట్ చేసుకొని వారిని లైంగిక పనులకు ఉపయోగించాడని జెఫ్రీ ఎప్‌స్టీన్ పై ఆరోపణలు ఉన్నాయి. 2008లో ఓ కేసులో నేరం అంగీకరించడంతో అతడికి జైలు శిక్ష సైతం పడింది. తక్కువ శిక్షతో బయటకు వచ్చిన జెఫ్రీ.. అదే వృత్తిని మళ్లీ కొనసాగించాడు. ఈ నేపథ్యంలో 2019లో అతడు తీవ్ర లైంగిక ట్రాఫికింగ్ ఆరోపణలతో అరెస్ట్ అయ్యాడు. మైనర్ బాలికలను ధనవంతులైన స్నేహితులకు, రాజకీయ ప్రముఖులకు జెఫ్రీ అందించినట్లు అతడిపై అభియోగాలు ఉన్నాయి. డొనాల్డ్ ట్రంప్, జెఫ్రీ ఎప్‌స్టీన్ మధ్య 1980-2000 మధ్య మంచి వ్యాపార సంబంధాలు ఉన్నట్లు అమెరికన్ మీడియా సంస్థలు గతంలోనే పేర్కొన్నాయి.