Akhil Zainab Ravdjee Wedding: అక్కినేని ఇంట మరోమారు పెళ్లి బాజాలు మోగాయి. నాగార్జున తనయుడు చిన్న కుమారుడు, టాలీవుడ్ హీరో అఖిల్ అక్కినేని ఓ ఇంటివాడు అయ్యాడు. తాను ఎంతగానో ప్రేమిస్తున్న జైనా రావ్జీ (Zainab Ravdjee)ని ఇవాళ తెల్లవారుజామున ఓ శుభముహోర్తాన పెళ్లాడాడు. జూబ్లీహిల్స్ లోని నాగార్జున ఇంట్లో తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో వీరి వివాహం జరిగింది. అతికొద్ది మంది ప్రముఖులు, కుటుంబ సభ్యుల సమక్షంలో అఖిల్.. జైనాబ్ కు తాళి కట్టారు.
హాజరైన మెగా ఫ్యామిలీ
అఖిల్, జైనాబ్ వివాహానికి మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. భార్య సురేఖతో పాటు, తనయుడు రామ్ చరణ్ దంపతులు వివాహ వేడుకలో పాల్గొన్నారు. వీరితో పాటు కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా హాజరయ్యారు. సోదరుడు నాగచైతన్య, అతడి భార్య శోభిత సైతం వివాహంలో సందడి చేశారు. అలాగే దగ్గుబాటి ఫ్యామిలీ కూడా అటెండ్ అయినట్టు తెలుస్తుంది. వెంకటేష్, రానా, సురేష్ బాబు వంటివారు కూడా ఈ పెళ్ళి వేడుకలో పాల్గొన్నట్లు తెలుస్తోంది.
Global Star @AlwaysRamCharan and @upasanakonidela graced the wedding celebrations of @AkhilAkkineni8.#AkhilWedding #AkhilAkkineni #RamCharan pic.twitter.com/NwRVptFdeA
— Suresh PRO (@SureshPRO_) June 6, 2025
The Son of King Nagarjuna Akhil Akkineni Marriage vibes started just now……. pic.twitter.com/Ltxw6iuxB9
— NagaKiran Akkineni (@NagaKiran60) June 5, 2025
తమ్ముడి పెళ్లిలో చైతూ ధూమ్ ధామ్
అయితే తన కుమారుడి వివాహాన్ని నాగార్జున ఓ ప్రైవేటు సెర్మనీగా నిర్వహించడం గమనార్హం. మీడియా ప్రతినిధులకు కవరేజీ కోసం అనుమతి ఇవ్వలేదు. ఇదిలా ఉంటే అక్కినేని వివాహానికి సంబంధించిన కొన్ని ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతుంది. ముఖ్యంగా నాగ చైతన్యకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట తెగ హల్ చల్ చేస్తోంది. బరాత్ కార్యక్రమంలో నాగచైతన్య డ్యాన్స్ చేసిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.
జూన్ 8న రిసెప్షన్
అయితే ఈ పెళ్లికి సంబంధించిన ఫొటోలు అధికారికంగా బయటకు రావాల్సి ఉంది. త్వరలోనే నాగార్జున పెళ్లి ఫొటోలను పంచుకునే అవకాశమున్నట్లు తెలుస్తోంది. కాగా.. జూన్ 8 ఆదివారం అన్నపూర్ణ స్టూడియోలో అఖిల్ మ్యారేజ్ కు సంబంధించి రిసెప్షన్ జరగనుంది. దీనికి టాలీవుడ్ నుంచి పలువురు స్టార్స్, బడా రాజకీయ నాయకులు, ప్రముఖ వ్యాపారవేత్తలు హాజరయ్యే ఛాన్స్ ఉంది.