Uttam Kumar Reddy ( IMAGE credit: swetcha reporter)
నార్త్ తెలంగాణ

Uttam Kumar Reddy: ఆ డబ్బులను జిల్లా గ్రంధాలయ సంస్థకు ఇవ్వండి.. మంత్రి సంచలన వ్యాఖ్యలు

Uttam Kumar Reddy: నన్ను కలవడానికి వచ్చే ప్రజాప్రతినిధులు, అధికారులు, వివిధ విభాగాలకు చెందిన వారు పూల బోకేలు, శాలువాలు తీసుకురావద్దు’ అని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) సూచించారు. ఆ డబ్బులను జిల్లా గ్రంధాలయ సంస్థకు ఇవ్వాలని నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మంచి పనికి శ్రీకారం చుడుతున్నట్లు మంత్రి తెలిపారు. సూర్యాపేట పట్టణంలో జిల్లా గ్రంధాలయ కేంద్రంలో రూ.1.5 కోట్లతో నూతన భవన నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ భావితరాలకు మంచి విద్యను అందజేసేందుకు అన్ని రకాల మౌలిక వసతులు ఏర్పాటు చేసేందుకు అన్ని విధాలుగా సహకరిస్తామన్నారు.

 Also Read: Mee Seva New Service: మీ సేవ పరిధిలోకి కొత్త సేవలు.. నిమిషాలలో ఈ సర్టిఫికెట్ జారీ

పేదల విద్యాభివృద్ధి కోసం..
జిల్లా గ్రంధాలయ సంస్థకు రూ.1.5 కోటితో నూతన భవనం, రూ.1.0 కోటితో మౌళిక వసతులకు ఇప్పటికే మంజూరు చేశానని అదనంగా మరో కోటి రూపాయిలు ఎస్డీఎఫ్ నిధుల నుంచి మంజూరు చేస్తాననని, ఈ పనులు 6 నెలలో పూర్తి చేయాలన్నారు. సమాజంలో మార్పు కొరకు పేద గిరిజన విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం సైదా నాయక్ నిర్వహించే గ్రంథాలయానికి రూ.10 లక్షలు మంజూరు చేశారు. పెన్ పహాడ్, తుంగతుర్తి, మోతే, గరిడేపల్లి, పెన్ పహాడ్‌లలో గ్రంధాలయాల నిర్మాణానికి, కోదాడ, హుజూర్ నగర్‌(Huzur Nagar)లో అదనపు గదుల నిర్మాణానికి ప్రతిపాదనలు తీసుకొస్తే సాయంత్రం లోపు మంజూరు చేస్తానని, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు ఏం కావాలన్నా వ్యక్తిగతంగా సహాయం చేస్తానని, విద్యార్థులు ఆహ్లాదకర వాతావరణంలో మంచిగా చదువుకొని ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని మంత్రి ఆకాక్షించారు. రాత్రిపూట గ్రంథాలయాలు ఎక్కువ సేపు పని చేసేలా అదనంగా అవుట్ సోర్సింగ్ సిబ్బందిని నియమించుకునేందుకు నిధులు మంజూరు చేస్తానని ఉత్తమ్ తెలిపారు.

 Also  Read: Auto Drivers Struggle: ఉచిత బస్సు ప్రయాణం.. మహాలక్ష్మితో ఆటో డ్రైవర్లు దివాలా

Just In

01

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?