Mahabubabad (IMAGE credit: swetcha reporter)
నార్త్ తెలంగాణ

Mahabubabad:స్నేహితుడి కుటుంబానికి అండ‌గా ఆర్థిక సహాయం.. మేమంతా ఉన్నాం!

Mahabubabad: దోస్త్ మేర దోస్త్ తూహై మేరీ జాన్ వాస్తవంరా దోస్త్ నువ్వే నా ప్రాణం అనే పాటకు నిర్వచ నం అయ్యారు. ఆ స్నేహితులు ఎప్పు డో 30 ఏండ్ల కింద కలసి చదువుకు న్నారు. కానీ ఆనాటి స్నేహాన్ని ఇప్పటికి మరువలేదు. ఆ మిత్రులను చూస్తే స్నేహమంటే ఇదేరా అనిపిస్తుంది. వివరాల్లోకి వెళితే..మంగపేట మండలం రమణక్కపేట గ్రామానికి చెందిన వీర్ల రామచందర్రావు మృతి చెందాగా, అతనితో పాటు కలసి చదువుకున్న 1987-88 పదో తరగతి బ్యాచ్ చెందిన చిన్న నాటి స్నేహితులు అందరు కలసి కుటుంబ పెద్దను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్నారు. దీంతో తోటి స్నేహితుని కుటుంబానికి అండగా మేమున్నామంటూ మృతునితో 10 తరగతి వరకు చదివిన అందరూ కలసి రూ.50, 000/ ఆర్థిక సహాయం చేసి తోటి స్నేహితుని కుటుంబానికి అండగా నిలిచి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు.

 Also Read: Meena: ఎవరు విడాకులు తీసుకున్నా.. పెళ్లి నాతో చేసేవారు.. సీనియర్ హీరోయిన్ కామెంట్స్

కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం.. సీనియర్ కాంగ్రెస్ నాయకులు నాసిరెడ్డి 

కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని ఆపన్న సమయంలో వారికి అండగా ఉంటామని సీనియర్ కాంగ్రెస్ నాయకులు, జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ మెంబర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి అన్నారు.  అకినేపల్లి మల్లారం ఎస్టి కాలనీ గ్రామ నిరుపేద గిరిజన కుటుంబానికి చెందిన పరిషక రాజు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆక్సిజన్ అందక అవస్థలు పడుతున్న విషయాన్ని తెలుసుకున్న నాసిరెడ్డి సాంబశి వరెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క ఆదేశాల మేరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడాకుల అశోక్ సూచన మేరకు స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి పరిషిక రాజు ఇంటికి వెళ్లి బాధితుడిని పరామర్శించారు.

మెరుగైన వైద్యం కోసం మంత్రి సీతక్క సహకారం

అనంతరం ఆక్సిజన్ సిలిండర్ కొనుగోలు నిమిత్తం రూ.ఆరువేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. మెరుగైన వైద్యం కోసం మంత్రి సీతక్క సహకారంతో బాధితుడిని, వారి కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని సాంబశివరెడ్డి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు నాసిరెడ్డి నాగిరెడ్డి, ములుగు మార్కెట్ కమిటీ డైరెక్టర్ లక్కీ వెంకన్న, కటుకూరు శేషయ్య, బ్లాక్ కాంగ్రెస్ నాయకులు ధూళిపాల బాలకృష్ణ, తొండపు సంజీవరెడ్డి, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ మోహినుద్దీన్, చెట్టుపల్లి రాజు, రవి స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

 Also Read: Collector Harichandana: పక్కా ప్రణాళికతో హెల్త్ క్యాంప్‌లు నిర్వహించాలి: కలెక్టర్ హరిచందన దాసరి

రహదారులపై తిరిగే పశువుల కోసం మునిసిపల్ అధికారుల చర్యలు

గత కొన్ని ఏళ్లుగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని పలు రహదారులపై పశువులు సంచరిస్తున్నాయి. రహదారులపై వ్యాపారులు, కూరగాయల వ్యాపారులు వేసిన వ్యర్ధాలను, ప్లాస్టిక్ కవర్లను తింటూ అనారోగ్యం బారిన పడుతున్నాయి. అంతేకాకుండా విపరీతమైన వేగంతో పలు వాహనదారులు పశువులను ఢీకొడుతున్నారు. ఇటీవలే ఓ ఘటనలో కారు డ్రైవర్ పశువును ఢీ కొడితే మృత్యువాత చెందింది. దీంతో బిజెపి జిల్లా కార్యదర్శి దారా ఇందు భారతి మున్సిపల్ కమిషనర్, సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పశువులను రహదారులపై తిరుగుతుంటే యజమానులు పట్టించుకోకపోవడంతో ఎందుకు చర్యలు తీసుకోరని నిలదీశారు.

రహదారులపై విచ్చలవిడిగా తిరుగుతూ పశువులు

దీంతో మహబూబాబాద్ మున్సిపల్ కమిషనర్ టి.రాజేశ్వర్ ఒక పత్రిక ప్రకటనను విడుదల చేశారు. మహబూబాబాద్ మున్సిపల్ కేంద్రం లోని రహదారులపై విచ్చలవిడిగా తిరుగుతూ పశువులు, ఆవులు వాహనదారులకు, ప్రయాణికులకు ఇబ్బందులు కలిగిస్తున్నాయని పత్రిక ప్రకటనలో పేర్కొన్నారు. పశువుల యజమానులు ఐదు రోజుల లోపు రహదారులపై సంచరిస్తున్న పశువులను తమ తమ ఇళ్లలోకి, లేదంటే పశువులకు ఏర్పాటు చేసిన షెడ్డులోకి తరలించకుంటే మున్సిపాలిటీ అధికారులు పశువులను స్వాధీనం చేసుకుంటారని స్పష్టం చేశారు. ఐదు రోజులు దాటాక పశువులను స్వాధీనం చేసుకున్న తర్వాత పూర్తి బాధ్యత పురపాలక సంఘం బాధ్యులు మాత్రమే చూసుకుంటారని వెల్లడించారు.

 Also Read: Collector Harichandana: పక్కా ప్రణాళికతో హెల్త్ క్యాంప్‌లు నిర్వహించాలి: కలెక్టర్ హరిచందన దాసరి

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!