Collector Harichandana (imagecredit:swetcha)
హైదరాబాద్

Collector Harichandana: పక్కా ప్రణాళికతో హెల్త్ క్యాంప్‌లు నిర్వహించాలి: కలెక్టర్ హరిచందన దాసరి

Collector Harichandana: హైదరాబాద్ జిల్లాలో ఈ నెల 17 నుండి వచ్చే నెల 2 వ తేదీ వరకు నిర్వహించనున్న ఆరోగ్య మహిళా శక్తివంతమైన కుటుంబం ( స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్) కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ హరిచందన దాస(Collector Harichandana Dasari)రి వైద్యాధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆరోగ్య మహిళా శక్తివంతమైన కుటుంబ కార్యక్రమంలో ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ ద్వారకానాథ్ రెడ్డి, సెక్రెటరీ డాక్టర్ అశోక్ కుమార్ లతో కలసి ఆమె పాల్గొన్నారు.

ఒక స్పెషాలిటీ క్యాంపు

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ క్యాంపుల నిర్వహణ షెడ్యూల్ ను సిద్ధం చేసి, ప్రణాళిక ప్రకారం ప్రతిరోజు ఒక స్పెషాలిటీ క్యాంపు, ఒక మెగా క్యాంపు నిర్వహించాలని ఆమె వైద్యాధికారులకు సూచించారు. అలాగే ఈ క్యాంపుల నిర్వహణలో 14 రకాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందాలని, ప్రజల భాగస్వామ్యంతో కలిసి పని చేయాలని ఆమె సూచించారు. ఈ నెల 17 నుండి అక్టోబర్ 2 వరకు పని దినాల్లో 12 రోజులు ప్రతి యూపీహెచ్ సీ లలో స్పెషలిస్ట్ క్యాంపులు నిర్వహించాలని ఆమె సూచించారు.

Also Read: Jeevana Saphalya Awards: అట్టహాసంగా పొన్నం సత్తయ్య జీవన సాఫల్య పురస్కారం!

మెరుగైన వైద్య సేవలు

అదే విధంగా యూపీహెచ్ సీలలో గైనకాలజీ సర్వీసెస్(Gynecology Services), పిడియాట్రిక్ సర్వీసెస్(Pediatric Services), ఈఎన్ టీ(ENT), డెంటల్(DENTAL), టీబీ(TB), డెర్మటాలజీ(Dermatology), న్యూట్రిషన్(Nutrition), సైక్రో యాట్రిస్ట్(Psychiatrist), అప్తాలామిక్ తదితర మెరుగైన వైద్య సేవలు అందాలని ఆమె సూచించారు. అలాగే వచ్చే 17న తేదీన ముందుగా క్యాంపును అమీర్ పేట(Ameerpet)లో మంత్రుల చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్ ఓ డాక్టర్ వెంకటి, డీటీసీఓ డాక్టర్ చల్లా దేవి, ఇంచార్జ్ డీసీహెచ్ ఎస్ శ్రీనివాసరావు, గాంధీ ఆసుపత్రి, ఉస్మానియా ఆసుపత్రి, సరోజినీ దేవి కంటి ఆసుపత్రి సూపరింటెండెంట్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ సంక్షేమ అధికారులు, వివిధ విభాగాల వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.

Also Read: Mahesh Kumar Goud: క్రీడల అభివృద్ధిపై సీఎం ప్రత్యేక ఫోకస్.. రూ.200 కోట్లు విడుదల

Just In

01

Anupama Parameswaran: అనుపమపై అసభ్యకర పోస్ట్‌లు పెట్టిన వ్యక్తిని పట్టేశారట!

Sreeleela: శ్రీలీల సపోర్ట్‌‌తో.. ప్రియదర్శి, ఆనందిల ‘పెళ్లి షురూ’

Janhvi Kapoor: మళ్లీ అందాలేనా? ఈసారైనా పెర్ఫార్మెన్స్‌తో మెప్పిస్తుందా?

Shiva Re Release: జెన్-జి‌ని మెప్పించే కంటెంట్‌ ‘శివ’లో ఏముంది? ఎందుకు ఈ సినిమా చూడాలి?

Andhra King Taluka: ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ సాంగ్ అప్డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే?