JEE Mains Results: జేఈఈ మెయిన్స్ లో రాజన్ పల్లి ఆదివాసి ఆణిముత్యం మెరిసింది. ఆల్ ఇండియా కేటగిరి ఎస్టీ కోటాలో ఆమే మూడవ ర్యాంక్ సాధించి మానుకోట పేరు నిలబెట్టింది. సిఆర్ఎల్ ర్యాంకు 16 హౌరా అనిపించింది. దేశవ్యాప్తంగా లక్షలాదిమంది విద్యార్థులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్న జేఈఈ మెయిన్ ఫలితాలు వచ్చేసాయి. ఈ ఫలితాలలో మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలానికి చెందిన గిరిజన అమ్మాయి తన ప్రతిభను చాటుకుంది. గూడూరు మండలంలోని రాజనపల్లి గ్రామానికి చెందిన గట్టి వెంకటేశ్వర్లు, గట్టి పద్మ ల కుమార్తె గట్టి మౌల్యశ్రీ జేఈఈ మెయిన్స్ లో 99.87% తో ఎస్టి కోటాలో మూడవ ర్యాంకు సాధించింది.
Also Read: Ganesh Chaturthi 2025: మర్రి ఊడలతో వినాయకుడు.. అక్కడికి తండోపతండాలుగా వస్తున్న జనం
గిరిజన ప్రాంతాల్లో పుట్టి..
తల్లితండ్రులు వ్యవసాయం వృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. తల్లితండ్రుల కష్టాన్ని చూసిన మౌల్యశ్రీ తమ కలను నెరవేర్చాలనే లక్ష్యంతో చదువుపై మక్కువను పెంచుకుంది. తాను అనుకున్న లక్ష్యానికి చేరువైంది. కోయ (గిరిజన) కులంలో పుట్టి కోయగూడెంలో పెరిగిన ఆడపిల్లకు చదువు ఏమిటి అని కొంతమంది అంటున్న కూడా అవేమీ పట్టించుకోకుండా తను అనుకున్న లక్ష్యం కోసం కృషి చేస్తుంది మౌల్యశ్రీ, చదువుకు పేదరికం అడ్డు కాదని నిరూపించిన గిరిజన ముద్దుబిడ్డ గట్టి మౌల్యశ్రీ .. దీంతో తమ గ్రామస్తులు మౌల్యశ్రీకి హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. తాను అనుకున్న లక్ష్యాన్ని చురుకున్నందుకు నాకు ఎంతగానో సంతోషంగా ఉందని ఆమే తెలిపింది.
Also Read: Virat Kohli – Pujara: పుజారా రిటైర్మెంట్‌పై తొలిసారి స్పందించిన విరాట్ కోహ్లీ