Ganesh Chaturthi 2025: మరి కొద్దీ గంటల్లో మనం ఎంతగానో ఎదురుచూస్తున్న పండుగ రాబోతుంది. ప్రపంచవ్యాప్తంగా భక్తులు వినాయకచవితి పండుగను జరుపుకోనున్నారు. ఈ ఏడాది గణేషుడికి బాగా ఇష్టమైన బుధవారం రోజున పూజలు అందుకోనున్నాడు. అయితే, తెలుగు రాష్ట్రాల్లో గత ఐదు రోజుల నుంచి బొమ్మలను తీసుకెళ్తూ సందడీ వాతావరణం నెలకొంది. ఇక ఇదే క్రమంలో ఓ వినాయకుడు అందర్నీ ఆకట్టుకుంటున్నాడు. మరి, ఆ ప్రత్యేకత ఏంటో ఇక్కడ చూద్దాం..
Also Read: Coolie Collections: బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న సౌత్ సినిమా.. ఆ కలెక్షన్స్ మామూలుగా లేవుగా..
ఇక్కడ వినాయకుడి విగ్రహం మర్రి చెట్టు ఊడలతో తయారు చేశారు. దీనిని చూసేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. 2025 లో భక్తులు పోటాపోటీగా బొమ్మలను నిలబెడుతున్నారు. ఈ విగ్రహాన్ని తయారు చేసిన కళాకారుడు చెప్పుకోవాలి. ప్రకృతి సౌందర్యంతో అలంకరించబడి, మర్రి చెట్టు ఊడలతో ప్రత్యేకంగా ఆకర్షణీయంగా ఉంది. ఈ అలంకరణ కారణంగా, ఈ వినాయకుడి దర్శనం కోసం స్థానికులతో పాటు దూరప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి సెల్ఫీలను తీసుకుంటున్నారు. ఈ విగ్రహం అమీర్పేట్ లో వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.
Also Read: Swathi Murder Case: ఇంకా దొరకని స్వాతి శరీర భాగాలు.. మొండాన్ని తీసుకెళ్లబోమన్న కుటుంబీకులు