Swetcha Effect: తొలుత మేకల తండా ఆశ్రమ పాఠశాలలో ఓ విద్యార్థిని అపెండిసైటిస్ ఆపరేషన్ చేయించుకొని అనారోగ్యం బారిన పడిన విద్యార్థినీని పాఠశాల నుంచి తీసి పంపించి వేశారు. ఆమె తల్లి కాళ్ళ వేళ్ళ పడ్డ ఆ ప్రిన్సిపల్ కనికరించలేదు. అనారోగ్యం ఉందని తెలిసిన స్పందించలేదు. పాఠశాలలో చదువుతున్న విద్యార్థినికి సర్టిఫికెట్ ఇచ్చి హాస్టల్ నుంచి నిర్మొహమాటంగా పంపించి వేశారు. అనారోగ్యంలో ఉన్న విద్యార్థిని పట్ల అమానుషంగా ప్రవర్తించిన పాఠశాల హెడ్మాస్టర్… మరో ఘటనలో తన దుర్బుద్ధిని బయట పెట్టుకున్నారు. ఉద్యోగం ఒకరిది… విధులు మరొకరివి ఆ తర్వాత మేకల తండా గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో జరిగిన మరో ఘటనపై స్వేచ్ఛ ప్రత్యేకంగా ప్రచురించింది.
Also Read: Crime News: డ్రగ్స్ దందాలో హవాలా వ్యాపారులు.. చిట్టా విప్పిన ఈగల్ టీమ్!
స్వేచ్ఛ కళ్ళకు కట్టినట్టుగా ప్రచురితం
పాఠశాలలో ఉపాధ్యాయుడికి బదులుగా మరొక ప్రైవేటు వ్యక్తిని పాఠశాల హెడ్మాస్టర్ నియమించి, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని స్వేచ్ఛ కళ్ళకు కట్టినట్టుగా ప్రచురించింది. పాఠశాల లో ఎస్ జి టి ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న తార్య అనే వ్యక్తి ఏడాది క్రితం అనారోగ్యం పాలయ్యాడు. పాఠశాలలో ఎస్జీటీకి బదులుగా ఓ వర్కర్ గా పనిచేస్తున్న కూతురుతో విద్యార్థులకు క్లాసులు చెప్పిస్తున్న విషయాన్ని స్వేచ్ఛ ద్వారా స్పష్టం చేసింది. ఒక ప్రభుత్వ ఉద్యోగి అనారోగ్యంతో ఉంటే అతను సెలవు తీసుకోవాలి కానీ, వేరే వ్యక్తిని పనిలో పెట్టడంపై పలువురు విమర్శలు చేసిన విషయాన్ని స్వేచ్ఛ కథనంలో స్పష్టం చేసింది. నిరుపేద గిరిజన బాలికను హెడ్మాస్టర్ టిసి ఇచ్చి ఇంటికి పంపించారు. మరి అదే నిబంధన ఎస్జిటి ఉపాధ్యాయుడికి ఎందుకు వర్తింప చేయలేదు కూడా స్వేచ్ఛలో ప్రత్యేకంగా ప్రచురించింది.
అమానుష ఘటన పై విచారణ
దీంతో కారేపల్లి మండలంలోని మేకలతండా గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాల (Ashram school) లో ఐటీడీఏ అధికారులు విచారణ నిర్వహించారు. స్వేచ్ఛ ప్రచురించిన వరస కథనాలకు స్పందించిన డిప్యూటీ డైరెక్టర్ విజయలక్ష్మి ఏటీడీఓ ను విచారణకు ఆదేశించారు. డిడి ఆదేశాల మేరకు ఏటిడిఓ భారతీదేవి మేకలతండా ఆశ్రమ స్కూల్లో విచారణ నిర్వహించారు. ఉన్నతాధికారులకు తెలియకుండా ఎస్జిటి ఉపాధ్యాయుడు తార్య బదులు మరొక ప్రైవేటు వ్యక్తి పనిచేయటంపై వివరాలు సేకరించారు. అనారోగ్యం కారణంతో 9వ తరగతి చదివే నిత్యశ్రీ కి టీసీ ఇచ్చి పంపిన అమానుష ఘటన పై కూడా విచారణ చేపట్టారు. విధులు సక్రమంగా నిర్వహించకుండా ఆటోలో ఉపాధ్యాయులను తీసుకురావడం తీసుకు వెళ్ళడం పై కూడా విచారణ నిర్వహించారు. ఏటీడీవో భారతీదేవి చేపట్టిన విచారణ నివేదికను ఐటీడీఏ పీవో కు సమర్పిస్తామని డిప్యూటీ డైరెక్టర్ విజయలక్ష్మి తెలిపారు.
Also Read: KTR: గ్రూప్-1 అవకతవకలపై.. జ్యూడిషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలి.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు