Maoist Leaders: కర్రెగుట్టల్లో మావోయిస్టు అగ్రనేతలు
Maoist Leaders ( image Caredt: swetcha reporter
నార్త్ తెలంగాణ

Maoist Leaders: కర్రెగుట్టల్లో మావోయిస్టు అగ్రనేతలు.. సేఫ్ జోన్ అనుకునే ములుగు అటవీ ప్రాంతంలోకి!

Maoist Leaders: మావోయిస్టు పార్టీ అతలాకుతలం అయిన తర్వాత ఎక్కడ తలదాచుకోవాలో కూడా తెలియని పరిస్థితిలో ఆ పార్టీలో పనిచేస్తున్న ప్రస్తుత అగ్రనేతలకు అర్థం కాకుండా పోయింది. ఓవైపు మహారాష్ట్రలోని గడ్చిరోలి ప్రాంతంలో విస్తృత కూంబింగ్ లు, ఎన్కౌంటర్లు, లొంగుబాటుల పర్వం, అదేవిధంగా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్, దంతే వాడ, నారాయణపూర్, సుక్మ జిల్లాలతోపాటు మావోయిస్టులకు స్వర్గధామంగా ఉన్న అబూజ్ మడ్ ప్రాంతంలో కూడా కేంద్ర, ఛత్తీస్‌గఢ్ భద్రతా బలగాలు కూంబింగ్ లు నిర్వహిస్తూ దండకారణ్య ప్రాంతాలన్నింటిని జల్లెడ పడుతున్నారు. ఎదురు పడిన మావోయిస్టులను ఎన్కౌంటర్లలో మట్టు పెడుతున్నారు. కొంతమంది భద్రతా బలగాలు దాటికి తట్టుకోలేక లొంగిపోతున్నారు. మరోవైపు అగ్రనేతలు సైతం మావోయిస్టు పార్టీలో విభేదాల కారణంగా పోలీసుల ఎదుట ఆయుధాలతో సహా సరెండర్ అవుతున్నారు.

Also Read: Maoist Leader Sujatha Surrenders: పోలీసుల ఎదుట మావోయిస్టు అగ్రనేత సుజాత లొంగుబాటు!

తాజాగా మోస్ట్ వాంటెడ్ హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత

తాజాగా కేంద్ర ప్రభుత్వానికి మోస్ట్ వాంటెడ్ మావోయిస్టుగా ఉన్న హిడ్మా, అతని అంగరక్షకుడు టెక్ శంకర్ సహా 13 మంది ఎన్కౌంటర్లలో మృతి చెందాక, మావోయిస్టు పార్టీ అతలాకుతలమైపోయింది. ఆ తర్వాత చత్తీస్గడ్ రాష్ట్రంలో బర్సి దేవా కొంతమంది మావోయిస్టులకు ట్రైనింగ్ ఇస్తున్న వీడియో వైరల్ కావడంతో మళ్లీ కలకలం రేపింది. ఆ తర్వాత మావోయిస్టు పార్టీ కొంత స్తబ్దుగా ఉండిపోయింది.

సేఫ్ జోన్ అనుకునే ములుగు అటవీ ప్రాంతంలోకి

కర్రెగుట్టల ప్రాంతంలో ములుగు అటవీ ప్రాంతానికి ఆనుకొని ఉన్న ప్రదేశంలో ప్రస్తుత మావోయిస్టు అగ్ర నేతలు దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి, దామోదర్ అలియాస్ బడే చొక్కా రావు, దండకారణ్య స్పెషల్ జోన్ మొదటి కమాండర్ గా వ్యవహరిస్తున్న బర్శి దేవా ఉన్నట్లు వార్త ప్రసారాల ద్వారా తెలుస్తోంది. అయితే గోదావరి పరివాహక ప్రాంతాలు సేఫ్ జోన్ అనుకోని వచ్చారా…? లేదంటే హిడ్మా ఎన్కౌంటర్ కు ప్రతీకారం తీర్చుకునేందుకు వచ్చారా..? లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో కూంబింగ్ లు లేవని వచ్చారా..? ఇవన్నీ కాకపోతే తెలంగాణ రాష్ట్రంలో పీస్ ఫుల్ వాతావరణం ఉన్న నేపథ్యంలో లొంగిపోయేందుకు వచ్చారా..? అనే ప్రశ్నలు మెదళ్లను తొలుస్తున్నాయి. చత్తీస్గడ్ రాష్ట్రంలోని భద్రత బలగాలు తెలుగు రాష్ట్రాలకు చెందిన మావోయిస్టులు ఎవరు కూడా ఇక్కడ లేరని వెల్లడించడం. ప్రస్తుతం వార్తా ప్రసారాల ద్వారా దేవ్జీ, దామోదర్, బర్సి దేవా ఇక్కడే ఉన్నారా..! అనేందుకు బలం చేకూరుతుంది.

Also Read: Maoists Killed: బీజాపూర్ దంతేవాడ అటవీలో భారీ ఎన్కౌంటర్‌.. 20 మందికి చేరిన మావోయిస్టు మృతుల సంఖ్య!

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?