Maoists Killed: బీజాపూర్ దంతేవాడ సమీపంలో ఉదయం నుంచి ఇప్పటివరకు ఎదురు కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. 20 మంది మావోయిస్టు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. ఈ ఎన్కౌంటర్ లో ఎక్కువ మంది మావోయిస్టులు మృతి చెందే అవకాశం ఉన్నట్లుగా పోలీసు వర్గాల ద్వారా తెలుస్తోంది. ఉదయం అయిదుగురు ఎన్కౌంటర్లో మృతిచెందగా, రాత్రి 8 గంటల సమయం వరకు 12 మంది మావోయిస్టులు మృతి చెందినట్లుగా పోలీస్ అధికార వర్గాలు వెల్లడించాయి.
ఉదయం నుంచి ఇప్పటివరకు ఎదురు కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. గ్రేహౌండ్ పోలీసులు, సిఆర్పిఎఫ్ కోబ్రా దళాలు, డిస్టిక్ రిజర్వ్ గార్డ్, స్పెషల్ టాస్క్ ఫోర్స్ బృందాలు మావోయిస్టు దళాలపై విరుచుకుపడుతున్నాయి. దీంతో నిన్న ఉదయం 5 మంది ముత్తుల సంఖ్య కాగా, ఇప్పటివరకు మావోయిస్టు మృతుల సంఖ్య 20 కి చేరుకుంది. ఇంకా ఎక్కువ మంది మృతి చెందే అవకాశం ఉన్నట్లుగా అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి.
Also Read: Maoists: తెలంగాణ.. ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని నల్లమలలో మావోయిస్టుల సమావేశం!
మావోయిస్టులను మట్టు పెట్టడమే కేంద్ర ప్రభుత్వా లక్ష్యం
ఓవైపు మూడు రాష్ట్రాల (మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, చత్తీస్గడ్) ఎం ఎం సి కార్యదర్శి అనంత్ పేరిట ఆయుధాల విరమణ చేస్తామని ఓ లేఖ విడుదల చేశారు. లేఖలో సారాంశం ఫిబ్రవరి 15, 2026 వరకు మాకు సమయం ఇస్తే ఆయుధ విరమణ చేస్తామని ప్రకటన వెల్లడించారు. కానీ, కేంద్ర ప్రభుత్వం ఆ లేఖను ఏమాత్రం పట్టించుకోలేదు. సరి కదా లొంగిపోతారా లేదంటే ఎన్కౌంటర్లో పోతారా అనే వార్నింగ్ లు జారీ చేశారు.
అటు మావోయిస్టులకు ప్రాణ నష్టం
ఖచ్చితంగా మావోయిస్టులు ఆయుధాలు సమర్పించి పోలీసుల ఎదుట లొంగిపోవాలని హుకుం జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే బీజాపూర్… దంతేవాడ మధ్య గంగలూరు అటవీ ప్రాంతంలో నిన్నటి నుంచి ఎదురు కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో 20 మంది మావోయిస్టులు, ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. అటు మావోయిస్టులకు ప్రాణ నష్టం ఎక్కువగానే ఉండొచ్చని అధికార వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు మావోయిస్టుల ఎదురుకాల్పుల్లో జవాన్లు సైతం గాయాలపాలు అయినట్లుగా సమాచారం.
Also Read: Maoists Killed: మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ.. ఏడాది కాలంలో 357 మంది మృతి
