Maoists in Karregutta(image credit:X)
నార్త్ తెలంగాణ

Maoists in Karregutta: కర్రెగుట్ట ప్రాంత గ్రామాల్లో టెన్షన్ టెన్షన్.. హిడ్మా, దేవా లే టార్గెట్!

Maoists in Karregutta: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నుంచి అత్యధిక స్థాయిలో తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ప్రాంతం కర్రెగుట్టలకు చేరుకున్న మావోలను పూర్తిస్థాయిలో మట్టు పెట్టేందుకే రెండు బేస్ క్యాంపులను భద్రతా దళాలు ఏర్పాటు చేశాయి. తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ప్రాంతం వెంకటాపురం మండలానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న కర్రే గుట్టల ప్రాంతంలో ఒకటి, అటు నుంచి ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో కర్రెగుట్టల ప్రాంతానికి సమీపంలో మరో బేస్ క్యాంపు భద్రతా దళాలు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.

మావోయిస్టులకు స్వర్గధామంగా మారిన కర్రెగుట్టల ప్రాంతంలో ఉన్న వారందరినీ మట్టు పెట్టాలంటే భద్రతా బలగాలకు మరింత సమయం పడుతుందనే ఆలోచన కాబోలు.. రెండు బేస్ క్యాంపులను ఏర్పాటు చేసుకున్నారు కావచ్చు.

నేవి, డ్రోన్స్, జిపిఎస్ ల సాయంతో మావోల గుహ గుర్తింపు

గత ఒక వారం రోజులుగా కర్రెగుట్టల ప్రాంతం వద్ద మొహరించిన కేంద్రభద్రతా బలగాలు ఎట్టకేలకు కర్రెగుట్టల ప్రాంతంలో మావోలు ఏర్పాటు చేసుకున్న ఓ గుహను నేవీ, డ్రోన్స్, జిపిఎస్ ల సాయంతో గుర్తించినట్లుగా సమాచారం. అయితే భద్రతా దళాలు అక్కడికి చేరుకునే సమయానికి తల దాచుకున్న మావోయిస్టులు చాకచక్యంగా తప్పించుకున్నట్లు తెలుస్తుంది. ఈ కర్రెగుట్టల ప్రాంతంలో ఇంకా మరిన్ని గుహలు ఉన్నట్లు భద్రతా బలగాలు అంచనా వేస్తున్నాయి.

తగ్గేదే లేదంటున్న మావోయిస్టులు.. బలగాలకు చిక్కకుండా మరో ప్రాంతానికి

మావోయిస్టులు ఎన్నో వేలమంది భద్రతా బలగాలు కర్రే గుట్టల ప్రాంతం వద్ద మొహరించి కూంబింగ్ నిర్వహిస్తున్న తగ్గేదే లేదు అన్నట్లుగా తప్పించుకు తిరుగుతున్నారు. పైనుంచి హెలికాప్టర్లలో భద్రతా బలగాలు మావోల ఆచూకీ వెతుకుతుంటే… గుహల్లో ఉన్న మావోలు భద్రతా బలగాల రాకను చూసి తప్పించుకున్నట్లుగానే తెలుస్తోంది.

Also read: Samantha: మాతాజీగా సమంత.. సీరియల్స్ దెయ్యాలను వదిలిస్తుందా?

గుహ నుంచి సేఫ్ గా హిడ్మా ఎస్కేప్

ఎన్నో రకాల ప్రయోగాలు చేసి మావోయిస్టులు ఉన్న గుహను గుర్తిస్తే అక్కడి నుంచి మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు హిడ్మా సేఫ్ గా ఎస్కేప్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎన్నో ఘటనల్లో భద్రతా బలగాలకు మావోయిస్టులకు జరిగిన ఎదురుకాల్పుల్లో హిడ్మా మృతి చెందినట్లు ప్రచారం జరిగింది. అయినప్పటికీ హిడ్మా చిక్కడు దొరకడు అన్నట్లుగానే కేంద్ర రాష్ట్ర భద్రత బలగాలకు సవాల్ గా మారాడు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ నిర్వహిస్తున్న ఆపరేషన్ కగార్ లో భాగంగా వెంకటాపురం మండలానికి సరిహద్దులో ఉన్న కర్రెగుట్టల ప్రాంతంలోనూ హిడ్మా తన చురుకుదనం, తెలివితో ఇట్టే తప్పించుకున్నట్టు ప్రచారం సాగుతోంది.

హిడ్మా, దేవ లే టార్గెట్‌గా భద్రతా బలగాలు

ఛత్తీస్‌గఢ్ తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన కర్రెగుట్టల్లో భారీగా కేంద్ర ప్రభుత్వ భద్రతా బలగాలు మోస్ట్ వాంటెడ్ హిడ్మా, అతి ముఖ్యమైన దేవ లే టార్గెట్‌గా భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరి చాకచక్యంతోనే మావోయిస్టులకు భద్రత కలుగుతుందని అనుమానం సైతం చర్చగా మారింది.

ప్రెషర్ బాంబు పేలి గాయపడిన జవాన్.. వడదెబ్బకు మరింత మంది అస్వస్థత

ఆపరేషన్ కర్రెగుట్టల ప్రాంతంలో భద్రత బలగాలకు ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. మావోయిస్టుల ఆచూకీ కోసం భారీ స్థాయిలో నిర్వహించిన కూంబింగ్ లో భద్రతా బలగాలకు చుక్కెదురు అవుతూనే ఉంది. ఒకవైపు వడదెబ్బతో అస్వస్థతకు గురవుతున్న జవాన్లు, మరోవైపు కర్రెగుట్టల ప్రాంతంలో మావోయిస్టులు అమర్చిన ల్యాండ్ మైండ్స్ తొలగించే సమయంలోనూ ప్రమాదాలు ఎదురవుతూనే ఉన్నాయి. దీంతో జవాన్లను ప్రత్యేక హెలికాప్టర్ల ద్వారా ఆసుపత్రులకు తరలించి చికిత్స అందించాల్సిన ఆవశ్యకత నెలకొంటుంది.

Also read: Suryapet Police: ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం.. సదరు వ్యక్తి అరెస్ట్!

భారీ సొరంగాలు భద్రత బలగాలకు సవాల్

కర్రెగుట్టల ప్రాంతంలో మావోయిస్టులు ఎంచుకున్న భారీ స్వరంగాలు భద్రతా బగాలకు సవాల్ గా మారాయి. ఇప్పటికే వివిధ నూతన సాంకేతిక టెక్నాలజీతో ఓ గుహను భద్రతా బలగాలు గుర్తిస్తే అందులో మావోయిస్టులు కనిపించకపోవడంతో విస్తు పోయారు. దాదాపు కర్రెగుట్టలు 200 ఎకరాల్లో విస్తరించి ఉన్నాయని ఈ నేపథ్యంలోనే మావోయిస్టులు పూర్తిస్థాయిలో తలదాచుకునేందుకు అన్ని రకాల వసతుల కారణంగా ఈ ప్రాంతాన్ని పెంచుకున్నట్లుగా తెలుస్తోంది.

ఇప్పటికే 38 మంది మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో మృత్యువాత చెందారని ప్రచారం సాగుతోంది. అయితే ఈ వార్తకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ హోం శాఖ అధికారులు, భద్రతా బలగాలు వెల్లడించకపోవడం గమనార్హం. నిత్యం కర్రెగుట్టల ప్రాంతంలో నాలుగు హెలికాప్టర్లతో పహారకాస్తు, అనారోగ్యానికి గురైన జవాన్లను ఆసుపత్రులకు తరలిస్తున్నారు. అయితే కర్రెగుట్టల ప్రాంతం లో నిత్యం ప్రెషర్ బాంబులు పేలుతుండడంతో సమీప ఆదివాసి గ్రామాల ప్రజల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది.

మధ్యస్థ భారత దండకారణ్యంలో ఆపరేషన్ కగార్ ను నిలిపివేయాలి

గిరిజన సామాజిక వేదిక రాష్ట్ర అధ్యక్షుడు గుగులోత్ కిషన్ నాయక్

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మద్యస్థ భారత దండకారణ్యంలో నిర్వహిస్తున్న ఆపరేషన్ కగార్ లో భాగంగా కర్రెగుట్టల ప్రాంతంలో కేంద్ర భద్రత బలగాలు నిర్వహిస్తున్న కూంబింగ్లను వెంటనే నిలిపివేయాలని దళిత, గిరిజన, ప్రజా, మహిళా సంఘాలతో పాటు గిరిజన సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుగులోత్ కిషన్ నాయక్ డిమాండ్ చేశారు.

Also read: Road Accident: తండ్రికి గిఫ్ట్ అంటూ వెళ్లిన కూతురు.. చివరికి ఏమైందంటే!

ఆదివారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ సెంటర్లో ఆయా సంఘాల నాయకులతో కలిసి కర్రిగుట్టల ఆపరేషన్కు నిరసనగా ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కిషన్ నాయక్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఖనిజ సంపదను కార్పొరేట్ సంస్థలకు దోచి పెట్టేందుకే దండకారణ్యంలో ఉన్న ఆదివాసులను ఆపరేషన్ పేరుతో హననం చేస్తున్నారని ఆరోపించారు.

వేలాదిమంది కేంద్ర బలగాలని దింపి అమాయక ఆదివాసులపై అమానుష దాడులు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. అటవీ సంపదను కొల్లగొట్టి కార్పొరేట్ సంస్థలు కట్టబెట్టాలని కేంద్ర ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తుందని విమర్శించారు. మావోయిస్టులను ఏరివేస్తే అటవీ, ఖనిజ సంపదను కార్పోరేట్ వ్యవస్థలకు దోచి పెట్టాలనే కుట్రతో వేలాదిమంది భద్రతా బలగాలను మోహరించి ఎన్కౌంటర్లు చేయాలని చూస్తుందన్నారు.

ఆదివాసీ ప్రాంతంలో ఉన్న పీసా, 1/70, 5, 6 షెడ్యూల్ ఆదివాసుల హక్కుల చట్టం నిబంధనలకు తూట్లు పొడిచి అరాచక చర్యలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దిగుతున్నాయని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో గుగ్గిళ్ళ పీరయ్య వట్టం ఉపేందర్, పిల్లి సుధాకర్, ఎండి రజియా, కత్తుల రేణుక, సోమరపు ఐలయ్య, భూక్య సత్యనారాయణ, చిల్లగొల్ల వెంకన్న బానోత్ మోహన్ నాయక్ ఉన్నారు.

Just In

01

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ