Samantha in Subham Movie
ఎంటర్‌టైన్మెంట్

Samantha: మాతాజీగా సమంత.. సీరియల్స్ దెయ్యాలను వదిలిస్తుందా?

Samantha: సమంత టాలీవుడ్‌లో సినిమాలు చేయడం లేదని మొన్నీ మధ్య వరకు వార్తలు వైరల్ అయ్యాయి. ఆ వార్తలకు చెక్ పెడుతూ.. సమంత ఓ సినిమాలో చేస్తుందని అంటున్నారు. అలాగే ఆమె నిర్మాతగా మారి ట్రా లా లా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ స్థాపించి, తొలి ప్రయత్నంగా ‘శుభం’ అనే టైటిల్‌తో సినిమా చేస్తున్నారు. మే 9న విడుదలకు సిద్ధమైన ఈ చిత్ర ట్రైలర్‌ని తాజాగా విజయ్ దేవరకొండ సోషల్ మీడియా వేదికగా విడుదల చేసి, యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం టీమ్ అంతా ఈ చిత్ర ప్రమోషన్స్‌లో బిజీబిజీగా గడుపుతున్నారు. తాజాగా విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ విషయానికి వస్తే..

Also Read- Game Changer: కర్ణుడి చావుకి కారణాలు అనేకం.. ‘గేమ్ ఛేంజర్’ ఫ్లాప్‌కి కూడా అంతే!

ముగ్గురు స్నేహితులు కూర్చుని మాట్లాడుకుంటున్న సీన్‌తో ట్రైలర్ ప్రారంభమైంది. అందులో ముగ్గురూ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చినప్పుడు భార్యని కాఫీ అని ఎలా అడుగుతావ్? అని ప్రశ్నించగా.. ఒక్కొక్కరు ఒక్కోలా ఆన్సర్ ఇచ్చారు. అందులో కాస్త సాఫ్ట్ మ్యాన్ మాత్రం మిగతా ఇద్దరినీ.. భార్య విషయంలో ఇలా ఉన్నారేంట్రా? అని ముఖం మీదే చెప్పేస్తాడు. కట్ చేస్తే, సాఫ్ట్ మ్యాన్ చెప్పుకున్న అతను పెళ్లి చేసుకుని, శోభనం గదిలో భార్యని ఓ పాట పాడమని అంటాడు. అందుకు ఆమె సిగ్గువుతుంది అని మెలికలు తిరిగిపోతుంటుంది. కళ్లు మూసుకుంటాడు.. ఇంతలో టీవీలో సీరియల్ ప్లే అవుతుంటే, శోభనం గదిలో మంచం మీద ఉండాల్సిన భార్య టీవీ ముందు కూర్చుని సీరియల్ చూస్తూ ఉంటుంది.

ఆ సీరియల్‌ వస్తున్న టీవీకి అడ్డంగా నిలబడినా ఆమెలో నో ఛేంజ్.. అంతే, టీవీ కట్టేయగానే.. అప్పటి వరకు సీరియల్ చూస్తున్న ఆమెను సీరియల్ దెయ్యం ఆవహిస్తుంది. సీరియల్ ఆగకూడదు అని ఒక్కసారిగా ఆమె అరిచిన అరుపుకు.. భయపడి చస్తాడు భర్త. ఇలా ఆ ఊరిలో ఆడవాళ్లు అందరూ సీరియల్స్ టైమ్‌లో మారిపోవడంతో, మగాళ్లు అందరూ ఒక చోట చేరి ఏదైనా ఉపాయం ఆలోచించాలని అనుకుంటారు. ఒక రకంగా నిజమైన కథ అని రివీల్ చేస్తూ.. ఇంత జరుగుతున్నా ఒక్కరన్నా బయటపెట్టరా? అంటూ ఊరిలోని మగాళ్లు అందరూ పరుగులు తీస్తుంటారు. కొన్ని భయానక సీన్ల అనంతరం.. మాతా, ఇప్పుడు మా అందరికీ ఏం జరగబోతుంది అని ఓ మగాడు అడుగుతుండగా.. మాతాజీగా సమంత పవర్‌ఫుల్ ఎంట్రీ ఇచ్చారు.

Also Read- Balakrishna: బాలయ్య గొప్ప మనసు.. ఇలాంటి వీడియోలు మాత్రం ఎవరికీ కనిపించవ్!

చేతులతో సంజ్ఞలు చేస్తూ.. సమంత యాక్టింగ్ ఇరగదీసింది. దెయ్యాలను వదిలించే మాతాజీగా పర్ఫెక్ట్‌గా సూటయింది. అంటే, ఇప్పుడు ఊర్లో ఉన్న మగాళ్లందరూ పోతారా? అని అడిగినప్పుడు సమంత చూసిన చూపు ఏదైతే ఉందో.. అది చాలు ఈ సినిమాకు అని ఫిక్స్ అయిపోవచ్చు. ఓవరాల్‌గా అయితే నవ్వులు పూయిస్తూ.. హర్రర్ అంశాలతో భయపెట్టేశారు. హాస్యం, హర్రర్, ఉత్కంఠ, ఎమోషన్స్ అన్నింటి మిశ్రమంగా ఈ సినిమా రూపుదిద్దుకుందనే విషయాన్ని ట్రైలర్‌తో తెలియజేశారు మేకర్స్. సమంత ఈ సీరియల్ దెయ్యాలను ఎలా వదిలించింది? అసలు సీరియల్స్ చూసే వాళ్లు ఎందుకు అంత అగ్రెసివ్ దెయ్యాలుగా మారుతున్నారనేది తెలియాలంటే మాత్రం మే 9న వస్తున్న ఈ సినిమా చూడాల్సందే అంటున్నారు మేకర్స్. ప్రస్తుం ఈ ట్రైలర్ టాప్‌లో ట్రెండ్ అవుతోంది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్