Balakrishna: బాలయ్య గొప్ప మనసు ఇలా ఉంటుంది
Balakrishna and Lavanya Lakshmi
ఎంటర్‌టైన్‌మెంట్

Balakrishna: బాలయ్య గొప్ప మనసు.. ఇలాంటి వీడియోలు మాత్రం ఎవరికీ కనిపించవ్!

Balakrishna: నందమూరి నటసింహం బాలయ్య (Natasimham Nandamuri Balayya) పై ఎక్కువ ట్రోలింగ్స్ జరుగుతుంటాయి. ఆయన ఏమన్నా, ఏదేదో రాసేసి కాంట్రవర్సీ చేస్తుంటారు. ఫ్యాన్స్‌ని కొడతారని, పబ్లిక్ ఫంక్షన్‌లో ఆడవాళ్లని అసభ్యకరంగా మాట్లాడతాడని, క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువని.. ఇలా ఏది పడితే అది రాసి ఆయనని కించపరచాలని చూస్తుంటారు. కానీ, బాలయ్య చేసే మంచి పనులు మాత్రం ఎవరూ చెప్పరు? ఎవరూ చూపించరు. అందుకే ఫ్యాన్స్ సోషల్ మీడియాలో యాంటీ ఫ్యాన్స్‌తో గొడవలు పడుతుంటారు. తమ హీరోని ఎవరైనా మాట అంటే అస్సలు సహించరు. తాజాగా బాలయ్య చేసిన ఓ మంచి పనిని పోస్ట్ చేసిన ఫ్యాన్స్.. ఇలాంటి వీడియోలు మాత్రం ఎవరికీ కనిపించవ్ అంటూ, తమ హీరో గొప్పతనాన్ని చాటి చెప్పారు.

Also Read- Yamudu: యమపాశంతో బ్యూటీని కట్టి పడేసిన ‘యముడు’.. కొత్త పోస్టర్ చూశారా!

పదో తరగతి ఫలితాల్లో సత్తా చాటిన తూర్పుగోదావరి జిల్లా అన్నదేవరపేటకు చెందిన దివ్యాంగురాలు లావణ్య లక్ష్మికి బాలయ్య ఫోన్ చేసి అభినందించారు. దివ్యాంగురాలైన లావణ్య లక్ష్మి (Lavanya Lakshmi), పదో తరగతిలో మంచి మార్కులు తెచ్చుకున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఎందరికో స్ఫూర్తిగా నిలిచిందని కొనియాడారు. బాలయ్య అంతే. భోళా శంకరుడు. ఏదైనా ముఖం మీదే మాట్లాడతారు. దాపరికాలు ఉండవు. అందుకే కొందరికి ఆయన నచ్చడు. తన గురించి, ఎవరు ఏమనుకున్నా ఐ డోంట్ కేర్ అని దూసుకెళ్లిపోతుంటారు. తనకు నచ్చింది ఏదైనా చేయకుండా ఉండరు. నచ్చని విషయాల జోలికి పోరు. అదే బాలయ్యలోని గొప్పతనం. తాజాగా దివ్యాంగురాలు లావణ్య లక్ష్మికి ఫోన్ చేసిన బాలయ్య..

‘‘చాలా సంతోషంగా ఉందమ్మా.. చాలా గర్వంగా ఉంది. 345 మార్కులు రావడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. మనుషుల్ని దేవుడు ఎన్నెన్నో రకాలుగా పుట్టిస్తాడు. నమ్మకముండాలి. నీకేమీ లోటు లేదు. భగవంతుడికి ఒక ఛాలెంజ్ విసిరి, ఈ ఘనత సాధించినందుకు చాలా గర్వంగా ఉంది చెల్లెమ్మ’ అంటూ ఎంతో ఆప్యాయంగా పలకరించడంతో ఆ దివ్యాంగురాలు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు. దీంతో ఫ్యాన్స్ ఇది కదా బాలయ్య అంటే, ఇలాంటి పాజిటివ్ విషయాలను మాత్రం ఎవరూ పట్టించుకోరు. అయినా ఎవరో పట్టించుకోవాలని మా బాలయ్య ఏమీ చేయరు? అంటూ వారికి వారే సర్దిచెప్పుకుంటున్నారు.

Also Read- King Nagarjuna: ఉగ్రవాదులతో నాగార్జునకు సంబంధం? ఆధారాలతో నా అన్వేష్ సంచలన వీడియో!

బాలయ్య ఫోన్ చేయడంపై లావణ్య లక్ష్మి మాట్లాడుతూ..‘‘నన్ను అభినందించిన బాలకృష్ణ సార్‌కి థ్యాంక్స్. నేను ఈ రోజు వికలాంగురాలిని అనే కాదు, బాగున్న వాళ్లని కూడా డిస్కరేజ్ చేసే వారు ఎక్కువయ్యారు. వీలైతే ఎంకరేజ్ చేయండి. అంతేకానీ, దయచేసి డిస్కరేజ్ చేయవద్దు’’ అని చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మాధ్యమాలలో బాగా వైరల్ అవుతుంది. ఈ వీడియోను బాలయ్య ఫ్యాన్స్ షేర్ చేస్తూ.. ఇదిరా మా బాలయ్య.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..