Naa Anvesh Sensational comments on Nagarjuna
ఎంటర్‌టైన్మెంట్

King Nagarjuna: ఉగ్రవాదులతో నాగార్జునకు సంబంధం? ఆధారాలతో నా అన్వేష్ సంచలన వీడియో!

King Nagarjuna: ఉగ్రవాదులతో నాగార్జునకు సంబంధం ఉంది అంటూ నా అన్వేష్ ఓ సంచలన వీడియోని పోస్ట్ చేశారు. ఆధారాలతో సహా బయటపెడుతున్నానంటూ ఆయన చేసిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇందులో నాగార్జునకు డైరెక్ట్‌గా అన్వేష్ కొన్ని ప్రశ్నలను సంధించారు. బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌కు స్టార్డమ్ ఇచ్చి, సమాజాన్ని నాశనం చేయమని వదులుతున్నారంటూ.. ఈ వీడియోలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. అసలీ వీడియోలో అన్వేష్ ఏమన్నారంటే..

‘‘బిగ్ బాస్ షో నుంచి 50 మంది కంటెస్టెంట్స్ ఉగ్రవాద సంస్థలకు సంబంధించి బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేశారు. ఆధారాలు అన్నీ బయటపెట్టాను. దీనికి పూర్తి బాధ్యత, కర్త, కర్మ, క్రియ ఆ షో హోస్ట్ నాగార్జునే. అందుకని నాగార్జునను నేను ప్రశ్నించాలని అనుకుంటున్నాను. నేను ఆ షో ని ఏమని అనడం లేదు. ఒక స్కూల్‌లో విద్యార్థి తప్పుచేస్తే, బాధ్యత తీసుకోవాల్సింది టీచర్. అదే స్కూల్ అంతా తప్పు చేస్తే, అప్పుడు బాధ్యత తీసుకోవాల్సింది ప్రిన్స్‌పాల్. ఇక్కడ టీచర్, ప్రిన్సిపాల్ నాగార్జున. దీనికి మీరు ఏం సమాధానం చెబుతారు? ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? ఒక్కటి కూడా ఇక్కడ (భారత్‌లో) రిజిస్టర్ అయింది కాదు, అన్నీ ఉగ్రవాద సంస్థలకు సంబంధించినవే. టాటా, అంబానీ వంటి వాళ్ల ప్రొడక్ట్స్ చేస్తున్నారంటే, ఓకే అని అనుకోవచ్చు.

Also Read- Serial Actress: ఫుడ్ వద్దు.. సిగ్గులేకుండా లవర్‌‌తో ముద్దు, బెడ్ కావాలంటోన్న సీరియల్ నటి!

కానీ చదువుకున్న వాళ్లు, అన్నీ తెలిసిన వారు కూడా, బెట్టింగ్ యాప్స్ ఓనర్ ఎవరో కూడా తెలియకుండా ప్రమోట్ చేయడం ఏంటి? అని నేను ప్రశ్నిస్తున్నాను. తిండికి తిఖానా లేని వారిని సెలక్ట్ చేసి, వారిని షో కి తీసుకువచ్చి స్టార్‌డమ్ ఇచ్చి.. సమాజం మీదకి వదులుతున్నారు. ఇది ఎంత వరకు న్యాయం అని అడుగుతున్నాను. నాకు ఇప్పటికీ తెలియడం లేదు.. 2024లో తెలంగాణలో బెట్టింగ్ యాప్స్ కారణంగా 1000కి పైగా చనిపోయారు. నేను ఒక అసిస్టెంట్‌ని పెట్టుకుని అలా చనిపోయిన ప్రతి ఫ్యామిలీ ఇంటికి వెళ్లి మాట్లాడిస్తున్నాను. వాళ్ల బాధ వింటే మీకు అర్థమవుతుంది. మీకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారికి ఏదైనా అయితే మీరూ, అమల మేడమ్ బాధపడతారు కదా. సేమ్ అదే విధంగా అమాయక ప్రజలు ఏడుస్తున్నారు సార్. ఒక్కసారి వారి బాధను వినండి.

మీకు గ్రౌండ్ రిపోర్ట్ తెలియదు. చనిపోయిన కుటుంబాలు ఏవైతే ఉన్నాయో, వారి దగ్గరకు వెళ్లి ఒక్కసారి అడగండి. దాదాపు 50 మంది బిగ్ బాస్ కంటెస్టెంట్స్ సార్. ఒక్కొక్కరు ఈ షో నుంచి వచ్చాక అది కొనుక్కున్నాను, ఇది కొనుక్కున్నాను.. అని చెబుతున్నారు. ఎలా సార్? వారికి అవన్నీ ఎలా వచ్చాయి? బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్లే. బిగ్ బాస్ షో నుంచి వచ్చిన పర్సన్ చెబుతున్నాడని, వారు ప్రమోట్ చేస్తున్న లింక్‌ని నొక్కి బుక్కయిపోతున్నారు. చివరకి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. బెట్టింగ్ యాప్స్ వల్ల చనిపోయి, ఎక్కడ పరువు పోతుందో అని లవ్ కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడని వాళ్ల ఫ్యామిలీలు చెప్పుకుంటున్నాయి.

నాకు ఇప్పటి వరకు ఈ వీడియోలతో రూ. 45 లక్షలు వచ్చాయి. ఈ బెట్టింగ్ యాప్స్ కారణంగా చనిపోయిన ఓ 20 కుటుంబాలకు తలో రూ. 2 లక్షలు ఇవ్వాలని ఓ అసిస్టెంట్‌ని పెట్టుకుని ఎంక్వైరీ చేయిస్తున్నాను. నా వంతు సాయం రూ. 2 లక్షలు మాత్రమే ఇవ్వగలను సార్. అంతకు మించి ఇవ్వలేను. మీరు ఏమైనా అన్నపూర్ణ స్టూడియో అమ్మేసి బెట్టింగ్ బాధితులకు ఇస్తారా? ఇవ్వలేరు. రైతు బిడ్డ అని చెప్పుకున్న ప్రశాంత్ గురించి నేను ముందే చెప్పాను. ఇలా ఒక్కరు కాదు.. దాదాపు 50 మంది.. ఉగ్రవాద సంస్థలకు చెందిన బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేస్తున్నారు. ఎవడు ఎలా చస్తే నాకెందుకు, నాకు కావాల్సింది డబ్బే అనేలా ప్రవర్తిస్తున్నారు. దీనికంతటికీ కారణం వారికి మీరిస్తున్న స్టార్డమే.

Also Read- Samuthirakani: బర్త్‌డే స్పెషల్‌గా ‘కాంత’ నుంచి ఫస్ట్ లుక్.. వేరే లెవల్ అంతే!

చివరిగా ఒక మాట చెబుతున్నాను.. మీ నాన్నగారి గురించి మీకు తెలియకపోవచ్చు. చెబుతున్నాను వినండి. కళామతల్లికి ఒక కన్ను ఎన్టీఆర్ అయితే, ఇంకో కన్ను నాగేశ్వరరావు. ఎన్టీఆర్‌కు రాజకీయాల పరంగా మచ్చ వచ్చిందేమో కానీ, ఏ మచ్చలేకుండా బతికారు ఏఎన్నార్. అలాంటి గొప్ప మనిషి కడుపున పుట్టిన మీరు, ఎందుకు పాపాలు చేస్తున్నారు. సమాజానికి మీరు ఏమిస్తున్నారనేది ఇక్కడ ఇంపార్టెంట్. రాబోయే బిగ్ బాస్ సీజన్‌కి అయినా సమాజానికి ఉపయోగపడే వారిని తీసుకోండి. లాయర్లు ఎవరూ ఈ విషయంపై దృష్టి పెట్టలేదు. పెడితే, ఈ బెట్టింగ్ యాప్ బాధితులకు మీ అన్నపూర్ణ స్టూడియో అమ్మి, మీరే న్యాయం చేయాల్సి వస్తుంది. ఇకనైనా జాగ్రత్తగా వ్యవహరించండి’’ అంటూ బిగ్ బాస్ హోస్ట్ కింగ్ నాగార్జునపై నా అన్వేష్ సంచలన ఆరోపణలు చేశారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు