Bhupalpally: భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
Bhupalpally (imagecredit:swetcha)
నార్త్ తెలంగాణ

Bhupalpally: భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత.. పోలీసుల లాఠీ ఛార్జీ?

Bhupalpally: భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసుల లాఠీ ఛార్జీ చేశారు. కృష్ణ కాలనీలో మున్సిపల్ కార్మికుడు బెల్లం రాజయ్య చెట్లు కటింగ్ చేస్తూ అనుమానాస్పద మృతి చెందాడు. మున్సిపల్ పరిధి కాకుండా సింగరేణి పరిధిలో చెట్లు నరకడానికి రాజయ్యను ఒక్కడినే పంపించిన అధికారులు సింగరేణి పరిధిలో చెట్లు కట్ చేయడానికి చాలా మంది కార్మికులు ఉన్నప్పటికీ రాజయ్య ఒక్కడితోనే పంపడం ఏంటని కుటుంబ సభ్యుల ఆందోళన దిగారు. మృతదేహంతో పాటు జిల్లా కలెక్టర్ కార్యాలయం లోపలికి దూసుకెళ్లి కుటుంబ సభ్యుల ఆందోళన చేశారు. మృతికి గల కారణాలు చెప్పాలని.. నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

మున్సిపల్ కార్మికుడు మృతి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ వద్ద శనివారం పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మున్సిపల్ కార్మికుడు మృతి పై అనుమానం వ్యక్తం చేస్తూ మృతిని బంధువులు, తోటి కార్మికులు కలెక్టరేట్ వద్ద ఆందోళనకు దిగారు. వారి ఆందోళనలతో పరిస్థితి ఉదృతంగా మారడం తో పోలీసులు లాఠీలు చూపించారు. స్థాయినికులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రంలోని కృష్ణ కాలనీలో మున్సిపల్ కార్మికుడు బెల్లం రాజయ్య చెట్లు కటింగ్ చేస్తూ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మున్సిపల్ పరిధి కాకుండా సింగరేణి పరిధిలో చెట్లు నరకడానికి రాజయ్యను ఒక్కడినే పంపించిన అధికారుల తీరుపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని బంధువులు, తోటి కార్మికులు ఆరోపించారు.

Also Read: Champion First Single: రోషన్ ‘ఛాంపియన్’ సినిమా మొదటి సింగిల్ డేట్ ఫిక్స్.. ఈ ప్రోమో చూశారా..

నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్

సింగరేణి పరిధిలో చెట్లు కట్ చేయడానికి చాలా మంది కార్మికులు ఉన్నప్పటికీ రాజయ్య ఒక్కడితోనే పంపడం ఏంటని కుటుంబ సభ్యుల ఆందోళన చేశారు. మృతదేహంతో జిల్లా కలెక్టర్ కార్యాలయం లోపలికి దూసుకెళ్లి కుటుంబ సభ్యుల ఆందోళన చేశారు. మృతికి గల కారణాలు చెప్పాలని.. నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆందోళనకారులు కలెక్టరేట్లోకి చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నస్తున్న సమయంలో వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువురి మధ్య తోపులాట చోటు చేసుకుంది. పరిస్థితి అదుపు తప్పుతుండడంతో ఆందోళన చేస్తున్న వారిపై పోలీసుల లాఠీ ఛార్జీ చేశారు. ఆందోళన చేపట్టిన వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ తరలించారు.

Also Read: Bigg Boss Telugu 9: అందరూ ఒక్కరికే సపోర్ట్ చేస్తారా అంటూ రీతూ ఫైర్.. అడ్డంగా దొరికేసిన తనూజ!

Just In

01

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..

Sree Vishnu: శాకాహార ప్రియులందరికీ హీరో శ్రీ విష్ణు సజెషన్ ఇదే..

Crime News: జైలు నుంచి ఇటీవలే విడుదల.. అంతలోనే చంపేశారు.. దారుణ ప్రతీకార హత్య