Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో 76వ రోజైన (Bigg Boss Telugu Season 9 Day 76) శనివారం హౌస్‌లో కెప్టెన్సీ టాస్క్ నడుస్తోంది. శనివారం అనగానే కింగ్ నాగార్జున (King Nagarjuna) సందడి ఉంటుందనే విషయం తెలియంది కాదు. అంతకంటే ముందు, ఏం జరిగిందో కింగ్ నాగార్జున ఈ రోజు మన టీవీలో చూపిస్తారు. శుక్రవారం కెప్టెన్సీ టాస్క్ నిమిత్తం బిగ్ బాస్ ఇచ్చిన కండీషన్ ప్రకారం ఈ వారం కెప్టెన్‌గా ఉండేందుకు తనూజకు ఛాన్స్ లేకుండా పోయింది. ఈ వారం కెప్టెన్ అయ్యేందుకు అర్హత లేదని, హౌస్‌లోని ఆరుగురు సభ్యులు ఆమెకు ఓటు వేయడంతో, తనూజ (Thanuja) తన కెప్టెన్సీని కోల్పోయింది. అలాగే ఈ వారం కెప్టెన్‌గా పోటీ చేసేందుకు కూడా ఆమెకు అవకాశం లేదు. ఆ తర్వాత హౌస్‌లోని వారందరినీ రెండు టీమ్‌లుగా విభజించి, ఆడించిన టాస్క్‌లో సుమన్ శెట్టి (Suman Shetty), రీతూ (Rithu) మాత్రమే కెప్టెన్ రేసులో ఉన్నారు. వీరిద్దరికీ మధ్య ఓ టాస్క్ పెట్టిన బిగ్ బాస్, ఎవరు గెలిస్తే వారే ఈ వారం కెప్టెన్ అని చెప్పారు. అందుకు సంబంధించిన ప్రోమోని తాజాగా బిగ్ బాస్ టీమ్ విడుదల చేసింది. ఇందులో..
కొన్ని అడుగుల దూరం
శనివారం సుమన్, రీతూల మధ్య జరిగిన టాస్క్‌ను చూపిస్తున్నారు. ‘రీతూ, సుమన్.. మీరిద్దరూ కెప్టెన్ అవడానికి కొన్ని అడుగుల దూరంలో ఉన్నారు. అదే నేను మీకు ఇవ్వబోయే టాస్క్ కూడా. కొన్ని అడుగుల దూరం’.. అని బిగ్ బాస్ చెప్పగానే టాస్క్ మొదలైంది. ఇందులో గాలమేసి కొన్ని మెట్ల ఆకారాలలో ఉన్న బాక్సులను పడేయాలి. ఆ బాక్సులను మెట్లకు అనుగుణంగా అమర్చాలి. అన్నీ సక్రమంగా ఎవరైతే అమరుస్తారో వాళ్లే విన్నర్.. అనేలా జరిగిన ఈ టాస్క్‌కు తనూజ సంచాలక్‌గా ఉంది. సుమన్ శెట్టి అన్ని మెట్ల బాక్సులను నింపి కెప్టెన్ జెండా పట్టుకున్న తర్వాత అసలైన గేమ్ మొదలైంది.
Also Read- Ramanaidu Studios: జిహెచ్ఎమ్‌సీ నోటీసులపై రామానాయుడు స్టూడియోస్ రియాక్షన్ ఇదే..
అడ్డంగా బుక్కయిన తనూజ
సుమన్ శెట్టి లాస్ట్ మెట్టుకు బాక్స్‌ను సరిగా సెట్ చేయలేదు. అయినా తనూజ.. ఓకే అంటూ అతన్ని పంపించింది. మిగతా అందరూ ఈ టాస్క్‌లో సుమన్ శెట్టికి సపోర్ట్ చేయగా, ఫైనల్‌గా సుమన్ శెట్టి కెప్టెన్ జెండా పట్టుకుని నిలబడగానే.. లాస్ట్ మెట్టు మీద బాక్స్ సరిగా సెట్ చేయలేదంటూ పవన్ ఆర్గ్యూ చేశాడు. ఈ విషయంలో తనూజ అతనిపై ఫైర్ అయింది. సుమన్ శెట్టి లాస్ట్ మెట్టుకి బాక్సుని సెట్ చేస్తుండగా అయిపోయింది వెళ్లి పైకి ఎక్కు అని తనూజనే పంపించింది. కానీ ఆ బాక్సు సరిగా సెట్ కాలేదంటూ మళ్లీ దింపి, సెట్ చేయించింది. మళ్లీ సుమన్ ఓడిపోయాడని చెబుతుంది. దీంతో కళ్యాణ్ కూడా తనూజతో వాదించాడు. నువ్వే కదా.. అయిపోయింది వెళ్లి ఎక్కు అని అంది? అని కళ్యాణ్ అనడంతో.. మరో వైపు కెప్టెన్ జెండా పట్టుకుని నిలబడిన రీతూ హర్టయింది. అందరూ ఒక్కరికే సపోర్ట్ చేస్తారా? అంటూ ఫైర్ అవుతుంది. ఫైనల్‌గా విన్నర్ ఎవరనేది ఈ ప్రోమోలో చెప్పలేదు కానీ, రీతూనే ఈ వారం కెప్టెన్ అయినట్లుగా తెలుస్తోంది. అందుకు కారణం మాత్రం తనూజానే. ఈ వారం నామినేషన్స్ నుంచి రీతూని కాపాడింది, అలాగే ఈ వారం రీతూని కెప్టెన్‌ని చేసింది తనూజానే కావడంతో.. ఆమె అడ్డంగా బుక్కయిందనే చెప్పుకోవాలి.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
