TG High Court: దేవరయంజాల్ భూముల దేవాదాయ శాఖపై హైకోర్టు
TG High Court ( image CREDit: twitter)
నార్త్ తెలంగాణ

TG High Court: దేవరయంజాల్ భూముల విషయంలో.. దేవాదాయ శాఖపై హైకోర్టు ఆగ్రహం!

TG High Court: మల్కాజిగిరి జిల్లా, శామీర్‌పేట మండలం, దేవరయంజాల్‌ గ్రామంలోని శ్రీసీతారామ స్వామి ఆలయానికి చెందిన భూముల రక్షణలో దేవాదాయ శాఖ కనబరుస్తున్న అలసత్వంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆలయ భూములకు సంబంధించిన హక్కులపై హైకోర్టులో దాఖలైన 54 పిటిషన్లపై జస్టిస్ జూకంటి అనిల్ కుమార్ విచారణ జరిపారు. ఆలయానికి చెందిన 1,521.13 ఎకరాల భూమికి సంబంధించి 1925–26 నుంచి ఈ నెల 26 వరకు ఉన్న ఒరిజినల్ రికార్డులతో కోర్టుకు హాజరు కావాలంటూ దేవాదాయ శాఖ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేసింది.

Also Read: TG High Court: స్థానిక ఎన్నికలపై విచారణను వాయిదా వేసిన కోర్టు!

ఆ అంశాలను హైకోర్టు దృష్టి

విచారణ సందర్భంగా, పిటిషనర్ల వద్ద హక్కులకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు లేవని ప్రభుత్వం తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. అయితే, దేవరయంజాల్ భూములకు సంబంధించి 2015లో సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులు ఉన్నా, ఆ అంశాలను హైకోర్టు దృష్టికి ఎందుకు తీసుకురాలేదని న్యాయమూర్తి దేవాదాయ శాఖపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వీటన్నింటిపై స్పష్టత ఇవ్వడానికి ఒరిజినల్ రికార్డులను సమర్పించకపోతే తదుపరి చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హైకోర్టు కమిషనర్‌ను హెచ్చరించింది.

Also Read: TG High Court: సిగాచీ పేలుళ్ల బాధితులపై హైకోర్టు కీలక ప్రశ్న.. కౌంటర్ దాఖలు చేయాలని న్యాయస్థానం ఆదేశం!

సిగాచి’ ప్రమాద దర్యాప్తుపై అసంతృప్తి.. పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

సిగాచి పరిశ్రమలో జరిగిన ఘోర పేలుడుపై పోలీసులు జరుపుతున్న దర్యాప్తు తీరు మీద హైకోర్టు గురువారం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కొంతకాలం క్రితం జరిగిన ఈ పేలుడులో 54 మంది కార్మికులు మృతి చెందగా, 33 మంది గాయపడ్డారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ, బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ప్రమాదం జరిగి నాలుగు నెలలు గడిచినా దర్యాప్తు మందకోడిగా జరుగుతోందని, ఇంతవరకు ఎవ్వరినీ అరెస్ట్ చేయలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు.

రూ.25 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు పరిహారం

దీనికి ప్రభుత్వ తరఫు అదనపు అడ్వకేట్ జనరల్ స్పందిస్తూ, ఇప్పటివరకు 237 మంది సాక్షులను విచారించినట్టు తెలిపారు. చనిపోయిన వారి కుటుంబాలకు రూ.25 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు పరిహారం అందించినట్టు తెలిపారు. నిపుణుల కమిటీ నివేదిక ప్రభుత్వ పరిశీలనలో ఉందని చెబుతూ, రెండు వారాల గడువు కోరారు. అయితే, గురువారం జరిగిన విచారణలో పోలీసుల దర్యాప్తు తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

దర్యాప్తు కొనసాగుతోందని చెప్పడమేంటి?

జరిగింది సాధారణ ప్రమాదం కాదు, 54 మంది కార్మికులు చనిపోయారు! దీనిపై ఇంకా దర్యాప్తు కొనసాగుతోందని చెప్పడమేంటి?’ అని ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించారు. 237 మంది సాక్షులను విచారించినా పురోగతి లేదా? అని అడిగారు. ఇంత పెద్ద ప్రమాదంపై విచారణకు డీఎస్పీని నియమించడం ఏంటని ప్రశ్నించారు. ఇప్పటివరకు పోలీసులు జరిపిన దర్యాప్తుపై సమగ్ర నివేదిక ఇవ్వాలని, తదుపరి విచారణకు దర్యాప్తు అధికారి హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది. అనంతరం విచారణను మార్చి 9కి వాయిదా వేసింది.

Also Read:TG High Court: హైడ్రా కమిషనర్‌పై హైకోర్టు సీరియస్.. విచారణకు హాజరుకాకపోతే..

Just In

01

Substandard Bridge: నాసిరకం బ్రిడ్జిను నిర్మిస్తున్న కాంట్రాక్టర్.. బయటపడ్డ బండారం.. ఫొటో ఇదిగో

Political News: ఇవి బురద రాజకీయాలు.. వైసీపీ, బీఆర్ఎస్‌లపై టీడీపీ ఎంపీ ఫైర్

Cheen Tapak Dum Dum: సమంత క్లాప్‌తో మొదలైన ‘చీన్ టపాక్‌ డుం డుం’.. వివరాలివే!

BRS Complaint on CM: సీఎంపై చర్యలు తీసుకోండి.. డీజీపీ కార్యాలయంలో బీఆర్ఎస్ ఫిర్యాదు

Anaganaga Oka Raju: సెంచరీ కొట్టేసిన రాజుగారు.. నిర్మాత పంట పండిందిపో!