Damodar Raja Narasimha ( imagecredit: swetcha reporter)
నార్త్ తెలంగాణ

Damodar Raja Narasimha: పోలీస్ కుటుంబాలను కాపాడుకోవడం మన అందరి బాధ్యత : మంత్రి మంత్రి దామోదర రాజనర్సింహ

Damodar Raja Narasimha: సంగారెడ్డి జిల్లా పోలీస్, (IMA, NMJ cancer institute hyd) సంయుక్త ఆధ్వర్యంలో జిల్లా కేంద్రం లోని PSR గార్డెన్ లో జిల్లా పోలీసు కుటుంబాల కోసం ఏర్పాటు చేసిన (comprehensive health camp)ను రాష్ట్ర వైద్య, అరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహా (Damodar Raja Narasimha) ప్రారంభించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమం లో మంత్రి మాట్లాడారు . పోలీసులను వారి కుటుంబాలను కాపాడుకోవడం మన బాధ్యత అన్నారు . ప్రభుత్వం సమాజ భాద్యత తో ప్రజల ఆరోగ్యం , విద్య , వైద్యం కు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు . పోలీసు కుటుంబాల కోసం (comprehensive health camp) ను నిర్వహించటం చక్కని ఆలోచన అన్నారు .

 Also Read: Damodar Raja Narasimha: ఎస్సీ వర్గీకరణతో సామాజిక న్యాయం.. అన్ని సముచిత వర్గాలకు విద్యావకాశాలు.. మంత్రి కీలక వ్యాఖ్యలు

ప్రభుత్వ ఆసుపత్రులలో కార్పొరేట్ వైద్యం అందించడమే మా ప్రభుత్వ లక్ష్యం

13 రకాల వైద్య నిపుణులైన డాక్టర్ లు ఈ హెల్త్ క్యాంప్ లో పాల్గొంటున్నారన్నారు. గ్రామీణ ప్రాంతం నుండి పట్టణ ప్రాంతాల వరకు ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేస్తున్నామన్నారు. సామాన్యుడికి భారం కాకుండా అందరికీ అందుబాటులో ప్రభుత్వ ఆసుపత్రులలో కార్పొరేట్ వైద్యం అందించడమే మా ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రిదామోదర రాజనర్సింహ ప్రతి రోజు డయాలసిస్ రోగుల సంఖ్య పెరుగుతుందన్నారు. రాష్ట్రంలో 160 డయాలసిస్ కేంద్రాలు ఉన్నాయన్నారు . ప్రతి 30 కిలోమీటర్ ల పరిధి లో డయాలసిస్ సెంటర్ ల ఏర్పాటు కు మరో 80 కేంద్రాలను ఏర్పాటు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందని మంత్రి వెల్లడించారు . త్వరలో 80 ట్రామా సెంటర్స్ కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు . హై వే లపై ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్ లను గుర్తించి గోల్డెన్ అవర్ ను దృష్టిలో పెట్టుకొని అక్కడ ట్రామా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు.

డయాలిసిస్ సెంటర్స్ లను ఏర్పాటు

ప్రతి జిల్లాలో డే కేర్ క్యాన్సర్ సెంటర్ ను ఏర్పాటు చేసి కీమో థెరపీ అందిస్తున్నామన్నారు. సంగారెడ్డి జిల్లాలో మెడికల్ కాలేజీ , 500 beded ప్రభుత్వ ఆసుపత్రి , అందోల్ లో నర్సింగ్ కాలేజీ , సంగారెడ్డి లో పారామెడికల్ కాలేజీ , క్రిటికల్ కేర్ బ్లాక్ , 5 న్యూ PHC లను , 3 new PHC బిల్డింగ్ లను ప్రారంభించామన్నారు . జిల్లాలో వాట్పల్లి లో CHC , తెల్లాపూర్ లో (UPHC) లను ఏర్పాటు చేశామన్నారు . పఠాన్ చెరువు , నారాయణ ఖేడ్ ఏరియా ఆసుపత్రులలో , cHC సదాశివపేట లో డయాలిసిస్ సెంటర్స్ లను ఏర్పాటు చేశామన్నారు . వీటితో పాటు మరో 3 సబ్ హెల్త్ సెంటర్స్ లను మంజూరు చేశామన్నారు . ఈ సందర్బంగా హెల్త్ క్యాంపు లో ఏర్పాటు చేసిన అన్ని విభాగాలను పరిశీలించారు . కియోస్క్ ద్వారా మంత్రి BP చెక్ చేసుకున్నారు. ఈ కార్యక్రమం లో TGIIC చేర్మన్ నిర్మల జగ్గారెడ్డి,కలెక్టర్,పి ప్రావీణ్య,ఎస్పీ పరితోష్ పంకజ్., ప్రముఖ వైద్యులు డా కిరణ్ కుమార్ , IMA జిల్లా అధ్యక్షులు డా రాజు గౌడ్ , సెక్రటరీ డా ఆనంద్ , డా శ్రీధర్ , డా శ్రీహరి లు , జిల్లా పోలీస్ అధికారులు , వారి కుటుంబాల సభ్యులు పాల్గొన్నారు .

 Also Read: Damodara Raja Narasimha: సీజనల్ వ్యాధులు నియంత్రణపై ఫోకస్.. మంత్రి రాజనర్సింహా

Just In

01

NIMS Hospital: నిమ్స్ ఆసుపత్రిలో అక్రమ నియామకాలు.. శాంతి కుమారి కమిటీ రిపోర్ట్‌లో సంచలనాలు..?

Twitter toxicity: సినిమాలపై ట్విటర్‌లో ఎందుకు నెగిటివిటీ పెరుగుతుంది?.. ట్విటర్ టాక్సిక్ అయిపోయిందా?

Ashanna: మావోయిస్టు పార్టీ ఆరోపణలను ఖండించిన ఆశన్న

Viral Video: అయ్యప్ప మాల దీక్షను తీసుకుని మద్యం సేవించిన స్వామి.. వీడియో వైరల్

Ramchandra Rao: జూబ్లీహిల్స్‌లో రెండు రాష్ట్రాల నేతలు కలిసి పని చేస్తాం..?