Damodara Raja Narasimha (imagecredit:swetcha)
తెలంగాణ

Damodara Raja Narasimha: సీజనల్ వ్యాధులు నియంత్రణపై ఫోకస్.. మంత్రి రాజనర్సింహా

Damodara Raja Narasimha: డెంగ్యూ, ప్లేట్ లెట్స్ పేరిట దోపిడికి పాల్పడుతున్న ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులపై తీవ్రమైన చర్యలు ఉంటాయని హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహా(Min Damodara Raja Narasimha) హెచ్చరించారు. దీనిపై ప్రత్యేకంగా అధికారులు దృష్టి పెట్టాలని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్‌కు ఆదేశించారు. అమాయకులు, పేద ప్రజలను మోసం చేస్తే ఊరుకునేది లేదన్నారు. ఆయన సీజనల్ వ్యాధుల నివారణ, నియత్రణపై హైదరాబాద్(Hyderabad) లోని ఆరోగ్య శ్రీ కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష చేశారు. రాష్ట్రంలో మే నెల నుంచే వర్షాలు ప్రారంభమయ్యాయని, వాతావరణంలో వచ్చిన ఈ మార్పుల వల్ల మే, జూన్ నుంచే అక్కడక్కడ సీజనల్ వ్యాధులు మొదలయ్యాయని అధికారులు మంత్రికి వివరించారు.

యాంటిలార్వల్ ఆపరేషన్‌
గతేడాదితో పోలిస్తే ఈసారి చాలా జిల్లాల్లో డెంగీ కేసులు తక్కువగా నమోదయ్యాయని, గ్రేటర్ హైదరాబాద్‌లో స్వల్పంగా కేసులు పెరిగాయని తెలిపారు‌.19 జిల్లాల్లో పది కంటే తక్కువ కేసులు నమోదవగా, మిగిలిన జిల్లాల్లో పదికంటే ఎక్కువ కేసులు నమోదయ్యాయన్నారు. గతేడాదితో పోలిస్తే టైఫాయిడ్(Typhoid) కేసులు చాలా తక్కువగా నమోదయ్యాయన్నారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ కేసులు ఎక్కువగా నమోదవుతున్న జిల్లాలు, గ్రేటర్ హైదరాబాద్‌లో యాంటిలార్వల్ ఆపరేషన్‌(Antilarval Operation)ను విస్తృతం చేయాలన్నారు. వ్యాధుల తీవ్రత ఎక్కువగా ఉన్న జీహెచ్‌ఎంసీ(GHMC) జోన్లకు స్పెషల్ ఆఫీసర్లను నియమించాలని జీహెచ్‌ఎంసీ అధికారులను ఆదేశించారు. సీజనల్ వ్యాధుల నియంత్రణపై కలెక్టర్లతో రివ్యూ చేయాలని హెల్త్ సెక్రటరీకి మంత్రి సూచించారు.

Also Read: TVK Vijay: సీఎం అభ్యర్థి ప్రకటన.. బీజేపీతో పొత్తుపై విజయ్ సంచలన నిర్ణయం

ప్రతి సోమవారం నివేదిక
ట్రైబల్ ఏరియాలపై ఎక్కువగా ఫోకస్ చేయాలని, ఐటీడీఏ(ITDA) పీవో(PO)లతో సమన్వయం చేసుకోవాలన్నారు. క్షేత్రస్థాయిలో పనిచేసే వైద్య సిబ్బంది ఇంటింటి సర్వే చేసి, ప్రజలకు అవగాహన కల్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు‌. కేసులు ఎక్కువగా నమోదవుతున్న జిల్లాల్లో ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు పర్యటించాలని మంత్రి ఆదేశించారు. సీజనల్ వ్యాధుల బారిన పడిన పేషెంట్లకు చికిత్స అందించేందుకు హాస్పిటళ్లలో అవసరమైన అన్ని వసతులతో సిద్ధంగా ఉండాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

అన్ని హాస్పిటల్స్‌లో అవసరమైన అన్నిరకాల మెడిసిన్‌ను అందుబాటులో ఉంచుకోవాలని మంత్రి సూచించారు. సీజనల్ వ్యాధులపై ప్రతి సోమవారం నివేదిక ఇవ్వాలని మంత్రి ఆదేశించారు. ఈ‌ సమావేశంలో హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగ్తు, పబ్లిక్ హెల్త్‌ డైరెక్టర్ రవిందర్ నాయక్, మెడికల్‌ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నరేంద్ర కుమార్, వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్, మెడికల్ కార్పొరేషన్ ఎండీ ఫణీంద్ర రెడ్డి, జీహెచ్‌ఎంసీ అడిషనల్ కమిషనర్ రఘు ప్రసాద్, పబ్లిక్‌హెల్త్ అడిషనల్ డైరెక్టర్ అమర్ సింగ్ నాయల్, జాయిట్ డైరెక్టర్ శివబాలాజీ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Also Read: Congress Party: లైన్ క్రాస్ అయితే వేటు.. జూబ్లీ హిల్స్‌పై ఏఐసీసీ స్టడీ

 

 

Just In

01

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?