Congress Party (imagecredit:swetcha)
Politics

Congress Party: లైన్ క్రాస్ అయితే వేటు.. జూబ్లీ హిల్స్‌పై ఏఐసీసీ స్టడీ

Congress Party: కాంగ్రెస్ పార్టీ అఫైర్స్ కమిటీలో కీలక అంశాలపై డిస్కషన్ జరిగింది. ప్రధానంగా పార్టీ సంస్థాగత నిర్మాణం, స్థానిక సంస్థల ఎన్నికలు(Local Body Elections), నామినేటెడ్ పదవులపై సుదీర్ఘంగా చర్చజరిగింది. పీసీసీ అధ్యక్షుడు అధ్యక్షతన జరిగిన ఈ మీటింగ్ కు ముఖ్య అతిథితులుగా ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే(AICC President Mallikarjuna Kharge), ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్(KC Venugopal), ఏ‌‌ఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జీ మీనాక్షి(Meenakshi), సీఎం రేవంత్(CM Revanth Reddy) రెడ్డిలు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాలన, పబ్లిక్ పల్స్ పై ఖర్గే చర్చించారు. పార్టీ, ప్రభుత్వ పథకాలపై జనాలు ఏమనుకుంటున్నారు? అనే అంశంపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికలపై సుదీర్ఘంగా చర్చించారు.

లోకల్ బాడీ ఎన్నికల బాధ్యతలంతా స్వయంగా మంత్రులే మానిటరింగ్ చేయాల్సి ఉంటుందని ఖర్గే సూచించారు. “అసెంబ్లీ ఎన్నికల సమయంలో క్షేత్రస్థాయి కార్యకర్తలు మీ కోసం పనిచేశారు. ఇప్పుడు వాళ్ల విజయం కోసం పనిచేయాల్సిందే” అంటూ ప్రత్యేకంగా ఖర్గే మంత్రులకు సూచించారు. ఎప్పటికప్పుడు పబ్లిక్ పల్స్ పై సర్వేలు తీయించాలని, ఆ రిపోర్టులు అనాలసిస్ చేసుకుంటూ నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని ఖర్గే నేతలకు వివరించారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలంగా ఉన్నప్పుడే, ఎక్కువ కాలం అధికారాన్ని పొందేందుకు సులువుగా మారుతుందని ఏఐసీసీ చీఫ్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే గ్రౌండ్ నేతల విజయాన్ని మంత్రులు మోయాల్సిందేనని నొక్కి చెప్పారు.

జూబ్లీహిల్స్ పై సీరియస్?
ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల స్థానంలో కచ్చితంగా కాంగ్రెస్(Congress) గెలవాల్సిందేనని ఖర్గే ఆదేశించారు. ఇందుకోసం రేసులోని అభ్యర్ధులపై పలు రకాలుగా సర్వేలు చేయించాలని సూచించారు. పార్టీ, వ్యక్తిగత మైలేజ్ అత్యధికంగా కలిగిన వారికే టిక్కెట్ కేటాయిస్తామని చెప్పారు. ప్రజలతో మమేకమై ఉన్న నేతనే ఎంపిక చేస్తామని ఖర్గే తేల్చి చెప్పారు. ఇప్పటికే ఏఐసీసీ(AICC) ఆధ్వర్వంలో ఓ దఫా స్టడీ జరిగిందని, త్వరలో మరోసారి నిర్వహించే ఛాన్స్ ఉన్నట్లు వెల్లడించారు. టిక్కెట్ల కోసం నేతలు వైరుధ్యం పెంచుకోకుండా సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉన్నదని వెల్లడించారు.

Aso Read: Jr NTR: ఎన్టీఆర్ ను నాలుగు సార్లు రిజెక్ట్ చేసింది.. ఎవరైతే నాకేంటి అంటున్న స్టార్ హీరోయిన్?

ఎమ్మెల్యేల పనితీరు పూర్
కొంతమంది ఎమ్మెల్యేలు, నేతల వ్యవహార శైలిపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీలో క్రమశిక్షణకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న నేతలపై ఆయన సీరియస్‌ హెచ్చరికలు చేశారు. కొంతమంది ఎమ్మెల్యేలు గ్రూపులు కడుతూ పార్టీ విలువల్ని దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. ఈవిధమైన హిడెన్ రాజకీయాలపై ఏఐసీసీ(AICC) ఎట్టి పరిస్థితుల్లో భయపడదని నొక్కి చెప్పారు. పార్టీ అభివృద్ధికి విరుద్ధంగా ఎవరు పనిచేసినా ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే సహించమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక పదవులు వచ్చాయని గర్వించకుండా, ప్రజల విశ్వసాన్ని పొందేలా చర్యలు తీసుకోవాలన్నారు. పార్టీ కేడర్ మధ్య ఎవరూ అపోహలు, ఆందోళనలు సృష్టించినా ఊరుకునేది లేదన్నారు. ప్రజలకు ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు చేరవేయడంలో పార్టీ శ్రేణులు కీలక పాత్ర పోషించాలన్నారు. 2029 ఎన్నికల దృష్ట్యా యువత, సామాజిక వర్గాలను ఆకర్షించేందుకు కార్యాచరణ రూపొందించాలన్నారు.

పదవుల జాతర
ఇప్పటికే పదవులు పొందిన నేతలు మరింత ఫోకస్ పెడుతూ పనిచేయాలని ఖర్గే ఆదేశించారు. దీంతో పాటు స్టేట్, డిస్ట్రిక్ట్ స్థాయిలలో మిగిలిన నామినేటెడ్ పదవులనూ త్వరగా భర్తీ చేయాలని ఆయన సూచించారు. కార్పొరేషన్ చైర్మన్లు, మార్కెట్ కమిటీలు, కార్పొరేషన్ డైరెక్టర్లు, ఆలయ పాలకమండలీలు తదితర పోస్టులను త్వరగా భర్తీ చేయాలని ఖర్గే సూచించారు. వెంటనే ఓ జాబితాను తయారు చేయాలని ఆదేశించారు. ఇక గత ప్రభుత్వం ఆధ్వర్యంలో పెట్టిన అక్రమ కేసులను రద్దు చేయాలని ఖర్గే సీఎంకు సూచించినట్లు తెలిసింది.

Also Read: Telangana: తెలంగాణ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి ప్లాన్!

 

Just In

01

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు