Swetcha Special story ( IMAGE credit: swetcha reporter)
నార్త్ తెలంగాణ

Swetcha Special story: కోట్ల విలువ చేసే భూములు హాం ఫట్.. విచ్చల విడిగా అనుమతులిచ్చిన అధికారులు

Swetcha Special story: గ్రేటర్ వరంగల్ లో అక్రమార్కుల హవా కొనసాగుతుంది. కోట్ల విలువ చేసే భూములు అన్యాక్రాంతం అవుతున్న ఆ భూములను కాపాడాల్సిన అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితి విచారించి నిర్మాణ అనుమతులు ఇవ్వాల్సిన అధికారులు అందినకాడికి దండుకుని కండ్లు మూసుకుని అన్ని అనుమతులు ఇస్తున్నారు. పలువురు అధికారులు, రాజకీయ పెద్దల అండతో రెచ్చిపోతున్న అక్రమార్కులు ఖాళీ భూములుకనబడితే చాలు గద్దల్లా వాలిపోతున్నారు. అందులో ప్రభుత్వ భూములు(Government lands) అయితే పలహారంగా పంచుకుంటున్నారు. హనుమకొండ(Hanumakonda) లోని విలువైన ఎస్ఆర్ఎస్పి కాలువ భూములు విచ్చలవిడిగా అన్యాక్రాంతం అవుతున్నా పుట్టలమ్మ చెరువు భూములు మాయం అవుతున్న పట్టించుకున్న నాధుడే లేకుండా పోవడం దీనికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. అధికారాల పట్టింపు లేనితనం, నేతల అండతో రెచ్చిపోయి గ్రేటర్ వరంగల్‌(Warangal)లో కబ్జాలకు గురి అవుతున్న కోట్ల రూపాయల విలువైన ఎస్ఆర్ఎస్పి కాలువ, పుట్టలమ్మ చెరువు భూములపై స్వేచ్ఛ ప్రత్యేక కథనం…

 Also Read: Mee Seva New Service: మీ సేవ పరిధిలోకి కొత్త సేవలు.. నిమిషాలలో ఈ సర్టిఫికెట్ జారీ

కాలువే మిగులుతుంది…

కరీంనగర్(Karimnagar) ఎల్.ఏం.డి ద్వారా వరంగల్(Warangal) సహా పలు జిల్లాలకు సాగునీరు అందించేందుకు 1978 లో అప్పటి తెలుగు దేశం ప్రభుత్వం కాకతీయ కెనాల్ నిర్మించింది. ఎస్సారెస్పీ కెనాల్, నిర్వహణ కోసం కార్యాలయాల నిర్మాణం కోసం చింతగట్టు, భీమారం ,పలువేల్పుల గ్రామాల పరిధిలో ప్రభుత్వం భూసేకరణ చేపట్టింది. భూములు(Lands) కోల్పోయిన రైతుల(Farmers)కు నష్ట పరిహారం చెల్లించి కెనాల్ నిర్మాణం చేశారు. ప్రభుత్వం తీసుకున్న భూమిలో కాలువ నిర్మాణం పోగా మిగిలిన భూమి ఖాళీగా ఉండడంతో ఆ భూమిని పలువురు రైతులు(Farmers)మళ్ళీ సాగు చేస్తున్నారు.

మిగులు భూమిని ఆధీనంలోకి తీసుకోవాల్సిన అధికారుల నిర్లక్ష్యంగా వ్యవహరించడం, రెవెన్యూ రికార్డుల్లోను రైతుల(Farmers) పేర్లు మారకపోవడంతో ఇదే అదునుగా భావించిన భూకబ్జదారులు ఆ భూముల్లో పాగా వేశారు. రైతుల(Farmers) పేరుమీది భూములను తక్కువ ధరకు వాళ్ళ పేర్ల మీదికి మార్చుకుని ఆ భూముల్లో వెంచర్లు చేసి దర్జాగా విక్రయాలు సాగిస్తున్నారు. ఈ మతలబు తెలియని అనేక మంది భూమి కొని నిర్మాణాలు చేసుకున్నారు. ఇలా నిర్మాణాలు చేసుకున్న వారిని ఇది ఎస్ఆర్ఎస్పి భూములు(SRSP lands) అని బెదిరించి మరో కబ్జాల బ్యాచ్ బెదిరించి అందినకాడికి దండుకుని సామాన్యులను ఇబ్బందులు పెడుతున్న ఆరోపణలు ఉన్నాయి.

శాఖల సమన్వయం లోపం అక్రమార్కులకు వరం

ఎస్.ఆర్.ఎస్.పి, రెవెన్యూ శాఖ నిర్లక్ష్యం, సమన్వయ లోపం అక్రమార్కులకు వరంగా మారింది. ఎస్సారెస్పీ కెనాల్ నిర్మాణ అనంతరం మిగులు భూముల్లో నాలా కన్వర్షన్ చేసి ప్లాట్లుగా చేసి విక్రయాలు సాగిస్తున్న అధికారులు పట్టించుకోకపోవడంతో ఎస్సారెస్పీ భూముల్లో 3 ఫంక్షన్ హాళ్లు, అనేక ప్రైవేటు నిర్మాణాలు వెలిశాయి.. హనుమకొండ కరీంనగర్ హైవే ను ఆనుకొని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ నేత తన ఫంక్షన్ హాల్ కోసం ఏకంగా 2300 గజాల ఇరిగేషన్ శాఖ భూములకు ఆక్రమించి నిర్మించారనే ఆరోపణలు ఉన్నాయి. పలువురు ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ మాజీ ప్రజా ప్రతినిధులు, కొంతమంది పోలీస్ శాఖకు చెందిన ఉన్నతాధికారులు, మాజీ రెవెన్యూ ఉద్యోగులు ఎస్సారెస్పీ భూములను వెంచర్ వేసి విక్రయాలు సాగిస్తున్నారు. మరో నేత ఏకంగా వెయ్యి గజాల స్థలంలో కాంపౌండ్ వాల్ నిర్మించి ఫామ్ హౌస్ నిర్మించుకోగా మరో యువ నాయకుడు ఫామ్ కోసం షెడ్ నిర్మించారు. ఇంత జరుగుతున్న ఎస్సారెస్పీ, రెవెన్యూ అధికారులు పట్టించుకోలేదు. మున్సిపల్ అధికారులు ఇష్టారాజ్యంగా అనుమతులు ఇస్తున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి.

పుట్టలమ్మ చెరువు మాయం

సాగునీటి అవసరాల కోసం నిర్మించిన ఎస్సారెస్పీ కెనాల్ భూములు అన్యాక్రాంతం కాగా మరో వైపు పట్టణ త్రాగు నీటి అవసరాల కోసం రిజర్వాయర్ నిర్మించాలని సంకల్పించి భీమారం పుట్టలమ్మ చెరువు మీద రిజర్వాయర్ నిర్మించింది. రిజర్వాయర్ నిర్మాణం పూర్తయ్యాక మిగిలిన 20 ఎకరాల భూములను పలువురు నకిలీ డాక్యుమెంట్స్ సృష్టించి దర్జాగా కబ్జా చేసారు. భాగ్యనగర్ సొసైటీ పేరుతో ఓ వ్యక్తి 2 ఎకరాల 20 గుంటల భూమి ప్రభుత్వం నుండి లీజుకు తీసుకొని విద్యా సంస్థ నిర్వహించారు. తర్వాత ప్రభుత్వ పెద్దల అండతో వరంగల్ లోని ప్రముఖ విద్యా సంస్థల అధినేత చెరువు భూముల్లో ఏకంగా ఒక కార్పొరేట్ పాఠశాల ఏర్పాటు చేశారు. చెరువు భూముల్లో అపార్ట్మెంట్లతో పాటు ఏకంగా పలు కాలనీలు వెలుస్తున్న అధికారులు ఏమి పట్టనట్టు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

 Also Read: Khammam Rains: ఆ జిల్లాలో భారీ వర్షాలు.. ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు సెలవులు

సామాన్యులకు రాని అనుమతులు అక్రమార్కులకు ఎలా వస్తున్నాయి

సామాన్యులు అన్ని డాక్యుమెంట్స్ తో నిర్మాణ అనుమతుల కోసం వెళ్తే సవాలక్ష కొర్రీలు పెట్టే మున్సిపల్ శాఖ అధికారులు చెరువు భూమిలో మాత్రం యదేచ్చగా అనుమతులు ఎలా ఇస్తున్నారు అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఎస్సార్ఎస్పీ భూములు ఒకవైపు మరోవైపు పుట్టలమ్మ చెరువు భూములను నకిలీ డాక్యుమెంట్స్ ద్వారా చేజిక్కించున్న అక్రమార్కులు ఆ భూముల అమ్మకం ద్వారా కోట్లు సంపాదించారనే ఆరోపణలు ఉన్నాయి. పుట్టలమ్మ చెరువు స్థలంలో ఒక వైపు రైతు వేదిక మరో వైపు ఒక అపార్ట్మెంటు, ప్రైవేటు నిర్మాణాలు వెలిసి రెగ్యులరైజ్ కూడా అవుతున్న అధికారులు మొడ్డునిద్ర వీడడం లేదనే విమర్శలు ఉన్నాయి.

ప్రభుత్వ భూములు అని బోర్డులు ఉన్నా పక్కనే నిర్మాణాలు

ప్రభుత్వ భూమి(Government land) అని హద్దురాళ్లు, ప్రభుత్వ అధికారులు ఏర్పాటు చేసిన బోర్డులు ఉన్నా. కనీస పర్యవేక్షణ లేకుండా అధికారులు అనుమతులు ఇచ్చి ఏమి పట్టనట్టు వ్యవహరిస్తున్నారనే ప్రజలు ఆరోపిస్తున్నారు. భీమారం శ్యామల చెరువు నాలపై పలు ఆక్రమణలు ఉన్నా అధికులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెరువు భూములను ఎస్సారెస్పీ భూముల(SSRSP lands)ను కాపాడాల్సిన అధికారులు కూడా కబ్జా కోరులకే కొమ్ము కాస్తున్నారనే విమర్శలు పెద్ద ఎత్తున వెల్లువెత్తుతున్నాయి. చెరువు భూములను, ఎస్సారెస్పీ భూములను కాపాడాలని భీమారంకు చెందిన పలువురు అనేకసార్లు కలెక్టర్ కు,ఆర్డీవోకు,ఎమ్మార్వో ఆఫీసులో ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు….

కాపలాదారులే కబ్జాలకు పాల్పడుతున్నారు.

ప్రభుత్వ భూములు నిత్యం పరదేశిస్తూ కబ్జాల గురి కాకుండా కాపాడాల్సిన వారు కబ్జాదారులకు కొమ్ము కాస్తున్నారు. పరిహారం పొందిన భూములను ప్రభుత్వం అధీనంలోకి తీసుకోక పోవడంతో అదే అదునుగా రికార్డులను ఆసరగా చేసుకుని కాలువ భూములు విక్రయాలు సాగిస్తున్నారు. కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి.

పప్పుల రమేష్, నగర వాసి..  అమాయకులు బలి అవుతున్నారు

ప్రభుత్వ భూముల్ని(Government lands) యదేచ్ఛగా కబ్జా చేసి నకిలీ డాక్యుమెంట్స్ సృష్టించి విక్రయాలు సాగిస్తున్నారు. కబ్జాలను అరికట్టాల్సిన అధికారుల నిరక్ష్యం వల్ల ఇరిగేషన్ శాఖకు చెందిన వంద ఎకరాల భూమి అన్యాక్రాంతం అయింది. కోట్ల విలువ చేసే భూములు కబ్జా అవుతుంటే అధికారులు.మాత్రం పట్టించుకోవడం లేదు. ఈ భూములు కొనుగోలు చేసిన అమాయకులు మాత్రం బలి అవుతున్నారు. డాక్యుమెంట్స్ చూసి కొనుగోలు చేసిన తరువాత ఇవి ఎస్ఆర్ఎస్పి భూములు అని తెలిసి అనేక ఇబ్బందులు పడుతున్నారు.

నాతి రమేష్, నగర వాసి.. ప్రభుత్వం ఇప్పటికైన దృష్టి పెట్టీ కోట్ల రూపాయల ప్రభుత్వ భూములు కాపాడాలి

కబ్జాకు గురైన భూములు వందల కోట్ల విలువ ఉంటుంది. అధికార బలంతో ఒకరు, రాజకీయ బలంతో ఇంకొకరు, రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో మరొకరు యదేచ్ఛగా ప్రభుత్వ భూములు కబ్జా చేస్తున్న కూడా అధికారులు కనీసం పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం ఇప్పటికైన ఎస్సారెస్పీ భూముల్లో,పుట్టలమ్మ చెరువు భూముల్లో సర్వే నిర్వహించి హద్దులు ఏర్పాటు చేయాలి, కబ్జా అని తేలితే బాధ్యులపై చర్యలు తీసుకొవాలి. కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూముల(Government lands)ను కాపాడాలి.

బూర శరత్, నగరవాసి

 Also Read: Khammam District: ఖమ్మం జిల్లాలో మంత్రి పీఏ ఆగడాలు.. ప్రజలు ఇబ్బందులు

Just In

01

Expand Dog Squad: రాష్ట్రంలో నేరాలను తగ్గించేందుకు పోలీసులు సంచలన నిర్ణయం..?

Tummala Nageshwar Rao: రైతులకు గుడ్ న్యూస్.. ఇకపై రైతు వేదికల వద్ద యూరియా అమ్మకం

Coolie: ‘కూలీ’ మూవీ ‘చికిటు’ ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో రచ్చ రచ్చ!

JD Chakravarthy: ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ క్రెడిట్ నాదే..

Malkaajgiri Excise: డిఫెన్స్ మద్యం స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్