Swetcha Effect: మేడ్చల్ పట్టణంలోని వినాయక్ నగర్ కాలనీ(Vinayak Nagar Colony)రోడ్డు నెంబరు 1లో ఆక్రమించిన రోడ్డును గురువారం తొలగించారు. జాతీయ రహదారి పక్కన ఉన్న ఒక భవన యజమాని, తన సెల్యులార్‌లోకి నిర్మించిన గదుల్లోకి వెళ్లేందుకు ఏకంగా రోడ్డును కబ్జా చేసి, మెట్లను నిర్మించాడు. ఏడు అడుగుల రోడ్డును ఆక్రమించి, షట్టర్ల ముందు సెప్టిక్ ట్యాంక్, మెట్లను నిర్మించడంతో కాలనీలో రాకపోకలు సాగించేందుకు స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
Also Read: Gold Rates (01-08-2025): బంగారం కొనాలంటే కోనేయండి ఇప్పుడే.. భారీగా తగ్గిన గోల్డ్ రేట్స్..
“స్వేచ్ఛ” డిజిటల్ లో “దర్జాగా రోడ్డు కబ్జా”
దీనిపై మున్సిపాలిటీ అధికారులకు ఫిర్యాదు చేసినా, ఎలాంటి చర్యలు తీసుకోకుండా తాత్సారం చేశారు. ఈ విషయాన్ని “స్వేచ్ఛ” డిజిటల్ లో “దర్జాగా రోడ్డు కబ్జా” అనే శీర్షికతో ప్రచురించిన కథనానికి మున్సిపాలిటీ అధికారులు స్పందించారు. జేసీబీ సాయంతో రోడ్డును ఆక్రమించి నిర్మించిన మెట్లను తొలగించారు. రోడ్డు ఆక్రమణ తొలగింపుపై కాలనీ అధ్యక్ష, కార్యదర్శులతో పాటు స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
Also Read: Radhika Sarath Kumar: ఆస్పత్రిలో నటి రాధిక.. ఏమైందంటే?