Radhika Sarath Kumar: వెటరన్ హీరోయిన్ రాధికా శరత్ కుమార్ ఆస్పత్రి పాలయ్యారు. ఆమె ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమెకు ఏమైందో అని అంతా కంగారు పడుతున్నారు. ఎందుకంటే, ఈ ఫొటోలలో ఆమె చాలా నీరసంగా కనిపిస్తున్నాయి. ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే రాధికను ఇలా చూసి అంతా షాక్ అవుతున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తున్నారు. అసలామెకు ఏమైందనే విషయానికి వస్తే..
Also Read- Vijay Deverakonda: ‘అన్నా మనం హిట్ కొట్టినం’ అంటుంటే.. మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంది..
రాధిక శరత్ కుమార్ (Radhika Sarath Kumar) నాలుగైదు రోజులుగా జ్వరంతో బాధపడుతూ.. తీవ్ర అస్వస్థలకు గురయ్యారని తెలుస్తోంది. జ్వరం ఎంతకీ తగ్గకపోవడంతో వెంటనే ఆమె ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో జాయిన్ చేశారు. ప్రస్తుతం ఆమె వైద్యుల ప్రత్యేక పర్యవేక్షణలో ఉన్నట్లుగా తెలుస్తోంది. కొన్ని పరీక్షల అనంతరం ఆమె డెంగ్యూ (Dengue) ఫీవర్‌తో బాధపడుతుందని, ప్లేట్‌లెట్స్ కూడా పడిపోవడంతో.. వెంటనే డాక్టర్స్ అలెర్ట్ అవడంతో ప్రాణాపాయం తప్పిందనేలా కోలీవుడ్ మీడియాలో వార్తలు దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం ఆమె బాగానే ఉన్నారని, కోలుకుంటున్నారని తెలుస్తుంది. పూర్తిగా తగ్గే వరకు ఆస్పత్రిలోనే ఉండటం మంచిదని డాక్టర్స్ ఆమెకు సూచించినట్లుగా సమాచారం. ఈ వార్త ఆలస్యంగా వెలుగులోకి రావడంతో.. ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు. గెట్ వెల్ సూన్ రాధిక మేడమ్ అంటూ ఓ హ్యాష్ ట్యాగ్‌ని వైరల్ చేస్తున్నారు. డాక్టర్స్ చెబుతున్న ప్రకారం ఆమె ప్రస్తుతం నార్మల్ స్టేజ్‌కి వచ్చారని తెలుస్తోంది. తన భర్త శరత్ కుమార్‌తో కలిసి ఉన్న ఫొటోలను చూస్తుంటే.. ఆమె కోలుకున్నట్లుగా అర్థమవుతోంది.
Also Read- Chetebadi: అమావాస్య రోజు మట్టిలో బతికున్న నల్లకోడిని పెట్టి.. రియల్ ఇన్సిడెంట్స్‌తో ‘చేతబడి’!
రాధికా శరత్ కుమార్ విషయానికి వస్తే.. ఆమె హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎన్నో సినిమాలలో నటించారు. ఒకప్పుడు టాలీవుడ్‌లో తిరుగులేని హీరోయిన్‌గా ట్రెండ్ సెట్ చేసిన ఆమె, ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా.. ముఖ్యంగా హీరో, హీరోయిన్లకు మదర్‌గా చేస్తూ.. ఆ పాత్రలకు ప్రాణం పోస్తుంది. ఇప్పటికీ ఆమె నటిగా బిజీగా ఉంటున్నారు. సీరియల్స్‌లోనూ ఆమె నటించారు. అలాగే ఇప్పుడు వెబ్ సిరీస్‌లలోనూ ఆమెకు ప్రధాన పాత్రలు లభిస్తుండటం విశేషం. ప్రస్తుతం ఆమె భర్త శరత్ కుమార్ ఎప్పటికప్పుడు ఆమె ఆరోగ్యం గురించి డాక్టర్స్‌ని వాకబు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం డెంగ్యూ ఫీవర్ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న విషయం తెలిసిందే. వెంటనే గమనిస్తే ఓకే కానీ, లేదంటే ప్రాణపాయ పరిస్థితి ఉందని డాక్టర్స్ సూచిస్తున్నారు.
டெங்கு காய்ச்சல் காரணமாக நடிகை ராதிகா சரத்குமார் மருத்துவமனையில் அனுமதிக்கப்பட்டுள்ளார். இரு நாட்களுக்கு முன்பு மருத்துவமனையில் அனுமதிக்கப்பட்ட அவர், மேலும் 5 நாட்கள் சிகிச்சை பெற்ற பின் இல்லம் திரும்புவார் என்று மருத்துவர்கள் தெரிவித்துள்ளனர். #RadhikaSarathkumar #BJP #Dengue pic.twitter.com/UlAqSXjnfP
— Idam valam (@Idam_valam) July 31, 2025
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు