Kothagudem DSP: కొత్తగూడెం జిల్లాలో అక్రమంగా గంజాయి, మత్తు పదార్థాల వ్యాపారం చేసే సంబంధిత వ్యక్తులు తమ ప్రవర్తన మార్చుకోకపోతే కఠిన చర్యలు తప్పవని కొత్తగూడెం డిఎస్పి రెహమాన్ వెల్లడించారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు అదేశాల మేరకు చైతన్యం డ్రగ్స్ పై యుద్ధం కార్యక్రమాలలో భాగంగా కొత్తగూడెం సబ్ డివిజన్లోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో గంజాయి కేసులతో సంభంధం ఉన్న వ్యక్తులతో డి.ఎస్.పి కార్యాలయంలో కొత్తగూడెం డీఎస్పీ రెహమాన్ కౌన్సిలింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా డీఎస్పీ మాట్లాడుతూ గంజాయి కేసులలో సస్పెక్ట్ షీట్స్ తెరవబడి ఉన్న వ్యక్తులపై నిరంతర నిఘా పెట్టడం జరిగిందన్నారు.
అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడితే చట్టప్రకారం కఠిన చర్యలు
గతంలో గంజాయి అక్రమ రవాణా, విక్రయం,సేవించడం వంటి అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ప్రవర్తన మార్చుకోని వ్యక్తులపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కష్టపడి సంపాదించి కుటుంబ సభ్యులతో కలిసి ప్రశాంతంగా గడపాలని సూచించారు. డ్రగ్స్ ను సమూలంగా నిర్మూలించడంలో పోలీస్ వారికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఏదైనా సమాచారం తెలిస్తే వెంటనే సమాచారం అందించి భాద్యతగా మెలగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం 2టౌన్ సీఐ ప్రతాప్,జూలూరుపాడు సీఐ శ్రీలక్ష్మి,చుంచుపల్లి సీఐ వెంకటేశ్వర్లు,1టౌన్ సీఐ కరుణాకర్,కొత్తగూడెం 3టౌన్ సీఐ శివప్రసాద్ మరియు ఇతర అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.
Also Read: Kothagudem District: ఓబీ కంపెనీలో మహిళా కార్మికులకు రక్షణ కరువు.. పట్టించుకోని అధికారులు
ప్రత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం లక్ష్మీపురం గ్రామంలో అనుశ్రీ ఇండస్ట్రీస్ యాజమాన్యం ఆధ్వర్యంలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారిచే ప్రత్తి కొనుగోలు కేంద్రాన్ని పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ప్రారంభించారు. సిసిఐ కొనుగోలు కేంద్రాల ఏర్పాటుతో రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం, రైతుకు ఒక భరోసా కల్పిస్తుందని అన్నారు. రైతులు పండించిన పంట దళారులకు అమ్మి మోసపోవద్దని సూచించారు.
కపాస్ కిసాన్ ద్వారా స్లాట్ బుకింగ్
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వ్యవసాయ అధికారులు మాట్లాడుతూ సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో ప్రత్తి అమ్మడానికి రైతులు తప్పనిసరిగా వ్యవసాయ శాఖ ద్వారా ప్రత్తి పంట నమోదుతో పాటు ప్రత్తి రైతుల ప్రయోజనాల కోసం అందరూ కపాస్ కిసాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని సిసిఐ వారు అభ్యర్థిస్తున్నారు. అదేవిధంగా కపాస్ కిసాన్ ద్వారా స్లాట్ బుకింగ్ చేసుకుని ప్రత్తిలో తేమశాతం 8 శాతం నుండి 12 శాతం వరకు మించకుండా తగు జాగ్రత్తలు పాటించి సిసిఐ కొనుగోలు కేంద్రాలకు తీసుకుని రావాలని తెలుపుతూ 2025-26 సంవత్సరం లో ప్రత్తి పంటకు ప్రకటించబడిన కనీస మద్దతు ధర 8110/- పొందాలంటే రైతు, సిసిఐ కి నేరుగా ప్రత్తి విక్రయించి మద్దతు ధర పొందవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Also Read: Bhadradri Kothagudem: గత ప్రభుత్వం అమలు చేసిన పథకాలలో నిధుల దుర్వినియోగంపై ఆరోపణలు
