Kothagudem District: సింగరేణి సంస్థలు అప్ లోడింగ్ పనులు నిర్వహించే కంపెనీలు ఎంతోమందికి ఉపాధి కల్పించే వరంలా ఉండేవి. కాని ప్రస్తుతం ఆ ఓబీ(OB)కంపెనీలే కార్మికులకు శాపంలా మారాయి. ఒక కంపెనీలో మేనేజర్ కార్మికులను వేధిస్తుంటే.. కొత్తగా వచ్చిన మరో కంపెనీలో మేనేజర్ ఏకంగా అక్కడ పనిచేసే ఆడవారిపై కన్నేసి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. కార్మికులను కడుపులో పెట్టుకొని చూసుకోవాల్సిన మేనేజర్లు వారి పట్ల కాలయముడిలా ప్రవర్తిస్తుంటే వారి పరిస్థితి వర్ణనాతీతం. సింగరేణి సంస్థ మణుగూరు(Manuguru) ఏరియాలో నూతనంగా ఏర్పడిన గౌరవ్(Gourav) ఓబీ కంపెనీ మేనేజర్ కంపెనీ గౌరవానికే మచ్చ తెచ్చేలా ప్రవర్తించాడు.
మహిళలపై అసబ్య ప్రవర్తన
కంపెనీలో పని చేసే మహిళా పట్ల దురుసుగా ప్రవర్తించి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే ఆరోపణలు వచ్చాయి. దీంతో మహిళ కుటుంబ సభ్యులతో కలిసి ఓబీ కంపెనీ ప్రాంగణంలోనే మేనేజర్ కు దేహశుద్ధి చేశారు. మణుగూరు చరిత్రలోనే ఓబీ కంపెనీలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడు నెలకొనలేదు. గౌరవ్ కంపెనీ మేనేజర్ చేసిన పనికి ఇవి ఓబీ కంపెనీలా లేక (వ)రస్ట్ కంపెనీల అన్న విధంగా అనిపిస్తుంది. ఎంతోమంది కంపెనీలను నమ్ముకొని ఉద్యోగాలు చేస్తూ తమ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. అయితే ఆ సంస్థల్లో మేనేజర్ లు చేసే పనులకు కార్మికులు విసిగిపోతున్నారు. వారి బాధను ఎవరికి చెప్పుకోవాలో తెలియక వారు చేసే వికృత చేష్టలను తప్పక భరిస్తున్నారు. దీంతో కార్మికులు భయాందోళన చెందుతున్నారు.
Also Read: Viral News: కోచింగ్ సెంటర్‌లో ప్రేమాయణం.. టీచర్‌ను పెళ్లి చేసుకున్న విద్యార్థిని.. ఆ తర్వాత..
సింగరేణి అధికారుల మౌనం వెనుక అంతర్యమేమిటి?
సింగరేణి సంస్థ మణుగూరు ఏరియాలో అప్ లోడింగ్ పనులు దక్కించుకున్న కంపెనీలపై సింగరేణి అధికారుల నిఘా కొరవడింది. నిత్యం ఓబి కంపెనీల్లో ఎన్నో ప్రమాదాలు జరిగినా, ప్రైవేట్ యాజమాన్యం కార్మికులపై ఎలాంటి దుశ్చర్యకు పాల్పడిన, మహిళలను లైంగిక వేధింపులకు గురి చేస్తున్న సరే సింగరేణి అధికారులు మాత్రం మౌనం పాటిస్తున్నారు. వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. అదేవిధంగా ఓబీ కంపెనీ(OB Compuny)లలో ఎలా అంటే రక్షణ చర్యలు పాటించడం లేదు. అయినా సింగరేణి యాజమాన్యం తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇంత జరుగుతున్న సింగరేణి యాజమాన్యం మౌనం వెనుక ఉన్న అంతర్యం ఏమిటో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా యాజమాన్యం మేల్కొని ప్రైవేట్ ఓబీ కంపెనీలపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Also Read: Money Lending Act: రైతులకు మనీ లెండింగ్ యాక్ట్ అమలు.. త్వరలో రానున్న చట్టం