Bhadradri Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలో, గత ప్రభుత్వం అమలు చేసిన పథకాలలో అవకతవకలు చోటుచేసుకున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా దమ్మపేట, అశ్వారావుపేట మండలాల్లో ఈ పథకాల అమలులో తీవ్ర అవకతవకలు జరిగాయని వారు చెబుతున్నారు. ఈ పథకాలు ప్రధానంగా దళితబంధు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముభారక్ వంటి పథకాలను కేవలం నిరుపేద మరియు వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం ప్రవేశపెట్టినవి.
దళితబంధు పథకం లబ్ధిదారులు
అశ్వారావుపేట నియోజకవర్గంలో, గత బిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో అమలు చేసిన దళితబంధు పథకం కింద మొత్తం 2,346 మంది లబ్ధిదారులు నమోదయ్యారు. వీటిలో అశ్వారావుపేట మండలంలో సుమారు 1,245 మంది, దమ్మపేట మండలంలో సుమారు 1,101 మంది లబ్ధి పొందినట్లు ప్రాథమిక గణాంకాలు సూచిస్తున్నాయి. ప్రజల ఆరోపణల ప్రకారం, కొందరు లబ్ధిదారులు పథకం కింద అందిన నిధులను ఉద్దేశిత ప్రయోజనాలకు కాకుండా వేరే అవసరాలకు వినియోగించారని తెలుస్తోంది. ప్రభుత్వం దళితుల ఆర్థిక స్థితిని బలోపేతం చేయడం కోసం ప్రారంభించిన దళితబంధు పథకం, నిరుపేద కుటుంబాల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముభారక్ పథకాలు అశ్వారావుపేట నియోజకవర్గంలోని అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లో అమలులో తీవ్ర అవకతవకలు చోటుచేసుకున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ప్రభుత్వాన్ని నమ్మించి..
ప్రజల ఆరోపణ ప్రకారం, దళితబంధు పథకం కింద లబ్ధి పొందిన కొందరు లబ్ధిదారులు నిధులను ఉద్దేశిత ప్రయోజనాలకు కాకుండా వేరే అవసరాలకు వినియోగించారని ప్రభుత్వ ఉద్దేశం స్వయం ఉపాధి, చిన్న వ్యాపారాలు స్థాపించడమే అయినప్పటికీ, కొందరు లబ్ధిదారులు ఆ సదుపాయాన్ని దుర్వినియోగం చేసినట్లు స్థానికులు అభిప్రాయపడుతున్నారు. దమ్మపేట మండలంలో, కొన్ని కుటుంబాలు కిరాణా షాపులు, బట్టల వ్యాపారాల పేరుతో నిధులు పొందినా, వాటిని వాస్తవంగా వ్యాపారాల కోసం ఉపయోగించకపోవడం ప్రజల్లో అసంతృప్తి రేకెత్తిస్తోంది. కొందరు లబ్ధిదారులు ఆ నిధులను వ్యక్తిగత అప్పులు తీర్చడానికి లేదా భూములు కొనుగోలు చేసేందుకు, వడ్డీ వ్యాపారాలకు వినియోగించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. లబ్ధిదారులు వ్యాపారాల పేరుతో ప్రభుత్వాన్ని నమ్మించి నిధులు పొందినా, ఆ వ్యాపారాలు ప్రారంభించకపోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది. ప్రజల అభిప్రాయం ప్రకారం, ‘దళితబంధు’ వంటి గొప్ప పథకం నిజమైన లబ్ధిదారులకు కాకుండా రాజకీయ పలుకుబడి ఉన్న కొంతమంది చేతుల్లోకి వెళ్లి దుర్వినియోగం కావడం విచారకరమని, పథక నిధులు సరైన విధంగా వినియోగించకపోవడం వల్ల ప్రభుత్వం ఉద్దేశించిన ఆర్థిక స్థిరత్వం దళితులకు అందడంలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పథకంలో జరిగిన అవకతవకలపై ఇప్పటికీ పూర్తి స్థాయి దర్యాప్తు జరగలేదని, నిధులు వేరే అవసరాలకు వినియోగించిన లబ్ధిదారుల వివరాలు బహిర్గతం చేసి, తగిన చర్యలు తీసుకోవాలని దళితబంధు పథకం దుర్వినియోగంపై అశ్వారావుపేట నియోజకవర్గ ప్రజలు సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను బహిర్గతం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
Also Read- Tollywood: డబ్బులిచ్చి ఇంటర్వ్యూలు చేయించుకుంటూ.. మళ్లీ ఈ సారీలు చెప్పించుకోవడం ఏంటి?
కళ్యాణ లక్ష్మి పథకం లబ్ధిదారులు
నిరుపేద, మధ్యతరగతి కుటుంబాల పెళ్లయిన అమ్మాయిలకు ప్రభుత్వం అందించే కళ్యాణ లక్ష్మి పథకం కింద, మొత్తం 4,812 మంది లబ్ధిదారులు నమోదు అయ్యారు. అశ్వారావుపేట మండలంలో 2,535 మంది, దమ్మపేట మండలంలో 2,277 మంది లబ్ధిదారులు ఉన్నారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముభారక్ పథకాలలోనూ, ప్రభుత్వానికి సమర్పించే పత్రాల కోసం పెద్ద మొత్తంలో గ్రామ పంచాయతీ, తహసీల్దార్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు పేద ప్రజల దగ్గర 30 శాతం వసూలు చేసినట్టు, కొంతమంది ప్రైవేటు వ్యక్తులు సహకరిస్తూ దీనిని అవకాశంగా తీసుకొని సొమ్ము చేసుకుంటున్నారని, అలాగే పెళ్లయి 5 నుంచి 10 సంవత్సరాలు గడిచిన దొంగ పత్రాలను సృష్టించి, గ్రామ పంచాయతీ ఉద్యోగులతో కలిసి ఈ పథకాల పేరుతో అనర్హులకు లబ్ధి చేకూరుస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
షాదీ ముభారక్ పథకం లబ్ధిదారులు
ఈ పథకానికి గాను మొత్తం 1,109 మంది లబ్ధిదారులు నమోదు అయ్యారు. వీటిలో అశ్వారావుపేట మండలంలో 585 మంది, దమ్మపేట మండలంలో 524 మంది లబ్ధిదారులు ఉన్నారు. ప్రజలు చెబుతున్నట్టు, ఈ పథకంలో కొందరు దొంగ పత్రాలను సృష్టించి, గ్రామ పంచాయతీ, మండల తహసీల్దార్ కార్యాలయాల్లో ఉద్యోగుల సహకారంతో లబ్ధి పొందినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
దమ్మపేట మండలంలో ప్రజా పథకాల అవకతవకలు, దళితబంధు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముభారక్ వంటి పథకాల నిధుల దుర్వినియోగంపై పైరవీలు పెద్దఎత్తున జరిగాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనల కారణంగా దమ్మపేట మండల కార్యాలయం నిత్యం వార్తల్లో నిలుస్తోంది, ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది. ప్రజలు, ఈ పైరవీలు ప్రభుత్వ నిధుల దుర్వినియోగానికి నిదర్శనమని, వెంటనే సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు.
తప్పుడు పత్రాలు తయారు చేయడం లేదా వాటిని వినియోగించడం కూడా నేరంగా పరిగణించబడుతుందనీ సంబంధిత అధికారులు గుర్తు చేస్తున్నారు. ప్రభుత్వం నిధులను దుర్వినియోగం చేస్తే IPC సెక్షన్ 409, 420, 468, 471, 120B కింద శిక్షలు విధించబడతాయని, ప్రజా నిధులను దుర్వినియోగం చేసిన ప్రభుత్వ ఉద్యోగులు లేదా బాధ్యత కలిగిన వ్యక్తులకు 10 సంవత్సరాల వరకు జైలు విధించవచ్చనీ, మోసంచేసి పథకాల పేరుతో లబ్ది పొందిన వారిపై 7 సంవత్సరాల జైలు, జరిమానా విధించబడుతుందనీ గుర్తు చేశారు.
Also Read- Akhanda 2: హిందీలో పరిస్థితేంటి? ఆ హీరోల సరసన బాలయ్య నిలుస్తాడా?
ప్రజలు, దళితబంధు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముభారక్ నిధులను దుర్వినియోగం చేసినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మరియు నిజమైన లబ్ధిదారులకు పథకాల లబ్ధులు చేరేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని అధికారులు కోరుతున్నారు. ఈ పథకాల కోసం సమర్పించిన పత్రాలలో కొంతమంది ప్రైవేటు వ్యక్తులు, వారికి సహకారంగా గ్రామ పంచాయతీ, రెవెన్యూ ఉద్యోగులు కూడా ఉన్నారని, వచ్చిన మొత్తంలో 30 శాతం అమాయకపు ప్రజల దగ్గర వసూలు చేసారని వినిపిస్తోంది. ఈ పథకాల్లో జరిగిన అవకతవకలపై ఇప్పటికీ పూర్తి స్థాయి దర్యాప్తు జరగలేదని, ప్రజలు ఆరోపిస్తున్నారు.
నిధులు వేరే అవసరాలకు వినియోగించిన లబ్ధిదారుల వివరాలు బహిర్గతం చేసి, తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని కోరుతూ ప్రజలు, అశ్వారావుపేట నియోజకవర్గంలో ప్రజా సంక్షేమ పథకాల అమల్లో అవకతవకలను ప్రజలకు తెలియజేయడం, వాటిని సరిచేయడం ప్రభుత్వ బాధ్యత అని, స్థానికులు ఆవేదనతో అభిప్రాయపడ్డారు. ప్రజల ఆర్థిక సుస్థిరత కోసం ఈ పథకాల ఉద్దేశాలను నిజంగా అమలు చేయడం అత్యవసరమని స్పష్టం చేశారు.
ఈ పథకాలలో జరుగుతున్న అవకతవకలను గుర్తించి, నిజమైన లబ్ధిదారులకు మాత్రమే నిధులు చేరేలా ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని, సమగ్ర విచారణ జరిపి బహిర్గతం చేయాలని స్థానికులు పేర్కొంటున్నట్టు, పథకాల నిధులను దుర్వినియోగం చేసేవారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అసలు లబ్ధిదారుల సంఖ్య, అవకతవకలపై స్పష్టమైన నివేదికలు అందించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
