Medchal Ellampet Municipality: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన మున్సిపాలిటీలు ఏర్పాటుచేసి రెండు నెలలు కావస్తున్నా గ్రామ పంచాయతీలకు మాత్రం మున్సిపాలిటీలుగా బోర్డులు మార్చలేదు. ఎల్లంపేట్ మున్సిపాలిటీ పరిధిలోని పలు గ్రామాలను విలీనం చేస్తూ నూతన మున్సిపాలిటీగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నూతన మున్సిపాలిటీ కమిషనర్ బాధ్యతలు చేపట్టి నెల రోజులు కావస్తున్నప్పటికీ గ్రామ పంచాయతీ భవనాలకు ఇంకా గ్రామ పంచాయతీ కార్యాలయం అనే బోర్డులే దర్శనమిస్తున్నాయి.
గ్రామ పంచాయతీలకు పాత బోర్డులే
మున్సిపాలిటీ పరిధిలోని గ్రామాలకు గ్రామ పంచాయతీ బోర్డులు తొలగించి మున్సిపాలిటీ కార్యాలయం, లేదా వార్డు కార్యాలయం బోర్డులు రాయించాలి. ఎల్లంపేట్ మున్సిపాలిటీ పరిధిలోని రావల్ కోల్, సైదోనిగడ్డతండా వార్డు భవనాలకు ఇంకా గ్రామ పంచాయతీలకు పాత బోర్డులే ఉన్నాయి. ఏదో పెట్టాములే అన్నట్లు గ్రామ పంచాయతీ కార్యాలయాలకు మున్సిపాలిటీ బోర్డులు ఫ్లెక్ల్సీలలో పెట్టి కట్టారు. అవి గాలికి ఉండాలా? వద్దా! అన్నట్లు ఉన్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు మేల్కొని గ్రామ పంచాయతీ భవనాలకు మున్సిపాలిటీ భవనాలుగా బోర్డులు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
Also Read: Disabled: దివ్యాంగులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వం ఆ దిశగా అడుగులు!
ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా పలు గ్రామ పంచాయతీలను విలీనం చేస్తూ నూతన మున్సిపాలిటీలను ఏర్పాటు చేసింది, ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్ (ORR) పరిధిలోని 51 గ్రామ పంచాయతీలను సమీప మున్సిపాలిటీలతో కలిపింది. ఎల్లంపేట్ మున్సిపాలిటీ మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో ఎల్లంపేట్ మున్సిపాలిటీని ఏర్పాటు చేసారు, ఇందులో రావల్ కోల్, సైదోనిగడ్డ తండా వంటి గ్రామాలు విలీనమయ్యాయి. వీటిని ఎర్పాటుచేసి రెండు నెలలు గడిచినప్పటికీ, గ్రామ పంచాయతీ భవనాలకు మున్సిపాలిటీ బోర్డులు ఏర్పాటు చేయకపోవడం, తాత్కాలిక ఫ్లెక్సీ బోర్డుల వాడకం వల్ల స్థానికుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. అటు ప్రభుత్వ అధికారులు సైతం పట్టించుకోకుండా పంచాయతీల్లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
Also Read: KTR: ప్రజల్లో చర్చిద్దామంటే రేవంత్ పారిపోయాడు.. కేటీఆర్ సంచలన కామెంట్స్!