Disabled (imagecredit:twitter)
తెలంగాణ

Disabled: దివ్యాంగులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వం ఆ దిశగా అడుగులు!

Disabled: రాష్ట్రంలో 10లక్షల మంది దివ్యాంగులు ఉన్నారు. వారందరిని ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. మహిళా స్వయం సహాయక సంఘాల తరహాలో దివ్యాంగులకు పొదుపు సంఘాలు ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తుంది. రుణసదుపాయంతో పాటు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు సిద్ధమైంది. సెర్ప్ ఆధ్వర్యంలో మార్గదర్శకాలకు రూపకల్పన జరుగుతుంది. గతంలో 70వేల సంఘాలు పనిచేసినప్పటికీ ఇప్పుడు యాక్టీవ్ లేవు. దీంతో మళ్లీ యాక్టీవ్ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది.

బీపీఎల్ ఉన్నవారికి పింఛన్

రాష్ట్ర ప్రభుత్వం మహిళల పొదుపు సంఘాలను ఏర్పాటు చేసి ఆర్ధిక సాధికారత, స్వాలంభన లక్ష్యంతో ముందుకెళ్తుంది. అందులో భాగంగానే దివ్యాంగులకు సైతం పొందుపు సంఘాలను ఏర్పాటు చేయాలని భావిస్తుంది. వారికి సైతం ఆర్థికంగా బలోపేతం చేసి వారికి సమాజంలో గౌరవాన్ని తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో 2011 జనాభా లెక్కల ప్రకారం 10లక్షల 50వేల మంది దివ్యాంగులు ఉన్నారు. వారిలో 7లక్షల మందికి సదరం సర్టిఫికెట్లు ఉన్నట్లుసమాచారం. బీపీఎల్ ఉన్నవారికి పింఛన్ వస్తుంది. అలా వచ్చేవారికి 5లక్షల మంది పింఛన్లు వస్తున్నాయి. గతంలో 70వేల సంఘాలు పనిచేశాయి. అయితే 2016 తర్వాత వీటి కార్యకలాపాలు నెమ్మదించాయి. ప్రభుత్వం ఆశించిన స్థాయిలో వారి నుంచి కూడా సరైన సపోర్టు రాకలేదని సమాచారం. దీంతో అవి ఇన్ యాక్టీవ్ అయినట్లు తెలిసింది. తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం పాత సంఘాలను బలోపేతం చేయడంతోపాటు కొత్త సంఘాల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. సెర్ప్ అధికారులకు సైతం ఆదేశాలిచ్చింది.

సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ (సెర్ప్) ఆధ్వర్యంలో దివ్యాంగులకు అండగా నిలువాలని భావిస్తుంది. అందుకు సంబంధించిన విధివిధానాలు రూపకల్పన చేస్తున్నారు. ఒక్కో సంఘంలో ఎంతమంది సభ్యులు ఉండాలి? నెలవారీ పొదుపు ఎంత చేయాలి? బ్యాంకు సౌకర్యాలు లేని ప్రాంతాల్లో డబ్బు సేకరణ ఎలా జరగాలి? వంటి అంశాలపై చర్చలు జరుగుతున్నాయి. అన్ని అంశాలు కొలిక్కి వచ్చిన తర్వాత ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు వెలువడనున్నాయి. గతంలో ఏర్పాటు చేసిన ఒక్కో సంఘంలో 6 గురు నుంచి 7గురు సభ్యులుగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

Also Read: Telangana RTC: తెలంగాణ ఆర్టీసీలో తొలి మహిళా డ్రైవర్‌.. ఏవరంటే!

ఐదుగురు దివ్యాంగులతో ఒక సంఘం

మహిళా స్వయం సహాయక సంఘాలు ప్రస్తుతం సెర్ప్ ఆధ్వర్యంలో విజయవంతంగా నడుస్తున్నాయి. ఇవే తరహాలో దివ్యాంగుల సంఘాలను రూపొందించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. పొదుపు, బ్యాంకు రుణాలు, సమావేశాల నిర్వహణ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. గ్రామీణ ప్రాంతాల్లో 4 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో 6లక్షల మంది దివ్యాంగులు ఉన్నట్లు సమాచారం. అయితే కొత్తగా ఏర్పాటు చేయబోయే పొదుపుసంఘంలో ఐదుగురు దివ్యాంగులతో ఒక సంఘం ఏర్పాటు చేయాలని ప్రతిపాదించినట్లు సమాచారం. సంఘంలో చేరేందుకు ఆధార్ కార్డు, స్థానిక చిరునామా తప్పనిసరి. పట్టణ ప్రాంతాల్లో మెప్మా సిబ్బంది సహాయం పొందవచ్చు. అయితే, ఈ పొదుపు సంఘాలు దివ్యాంగులకు ఆర్థిక వృద్ధి, స్వయం ఉపాధి అవకాశాలను కల్పించనున్నాయి. సూక్ష్మ రుణాలు, పొదుపు డబ్బులతో వ్యవసాయం, వ్యవసాయేతర కార్యకలాపాలు, ఉత్పత్తి యూనిట్లు, వ్యాపారాలను ప్రారంభించవచ్చు. అంతేకాక, సాంకేతిక, వృత్తి శిక్షణ, ప్రొస్తెటిక్ ఎయిడ్స్​, మొబిలిటీ ఎయిడ్స్​, మార్కెటింగ్ సదుపాయాలు, రాయితీ ఫైనాన్స్ వంటి సాయం అందించే ఛాన్స్​ ఉంది. పొదుపు సంఘాల ద్వారా దివ్యాంగులు ఆర్థిక సాధికారతతోపాటు స్వాలంబన దిశగా అడుగులు వేయనున్నారు.

సదరం సర్టిఫికెట్ తెలంగాణకు పరిమితం

ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే సదరం సర్టిఫికెట్ తెలంగాణకు పరిమితం అవుతుంది. ఇతర రాష్ట్రాలకు వెళ్తే పనిచేయడం లేదని సమాచారం. అక్కడకూడా వర్తింపజేసేందుకు ప్రభుత్వం చొరవ తీసుకుంటే బాగుటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు సదరం సర్టిఫికెట్ కు డిజిటల్ సైన్ తో జారీ చేయకపోవడంతో ఆలస్యమవుతుందని పలువురు పేర్కొంటున్నారు. అలా కాకుండా డిజిటల్ సైన్ తో జారీ చేస్తే త్వరగా సర్టిఫికెట్ విద్యాంగులకు అందుతుందని పెన్షన్ సైతం జాప్యం జరుగకుండా వచ్చే అవకాశం ఉంది. అధికారులు, డాక్టర్ల మధ్య కూడా కొంత సమన్వయం లోపం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అలాకాకుండా ఇద్దరు ఎప్పటికప్పుడు కలిసి పనిచేస్తే దివ్యాంగులకు నష్టం జరుగకుండా ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం నిర్వహించే సదరం క్యాంపులు సైతం యాక్టీవ్ గా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని పలువురు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు. ఏది ఏమైనా ప్రభుత్వం దివ్యాంగులకు పొదుపు సంఘాల ఏర్పాటుకు చొరవ తీసుకోవడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Census Schedule: జనాభా లెక్కల తేదీలు ప్రకటించిన కేంద్రం.. ఎప్పుడంటే

 

Just In

01

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?

Pending Bills: పెండింగ్‌లో అద్దెవాహన బిల్లులు.. ఖజానా కోసం ఎంపీడీవోల చూపులు

Sensational Cases: రాష్ట్రంలో సంచలన కేసులు.. నత్తనడకగా విచారణ.. ఇది దేనికి సంకేతం..?