Fake Ads (imagecredit:twitter)
నార్త్ తెలంగాణ

Fake Ads: రైతులను ముంచుతున్న సోషల్ మీడియా ఫేక్ ప్రచారం

Fake Ads: కొన్ని కంపెనీలు ఇస్తున్న డబ్బులు తీసుకొని కొంతమంది యూట్యూబ్లో ఆకర్షించే ప్రకటన(Ads)లు ఆకట్టుకునే మాటలతో సోషల్ మీడియా(Social Media)లో ఫేక్ ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారాలను రైతులు నమ్మి పెద్ద మొత్తంలో నష్టపోయేందుకు అవకాశం ఉంటుంది. ఈ పరిస్థితి గత కొద్ది రోజులుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పెరిగింది.

పలు ప్రాంతాల్లో ఎక్కువగా

భద్రాద్రి కొత్తగూడెం(Bhadradri Kothagudem) జిల్లాలోని సుజాతనగర్, జూలూరుపాడు, టేకులపల్లి, చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి, చండ్రుగొండ, అన్నపురెడ్డిపల్లి, ములకలపల్లి, గుండాల, ఆళ్లపల్లి లతోపాటు మరికొన్ని గ్రామాల్లో వివిధ కంపెనీలకు సంబంధించిన విత్తనాలు(Seeds), ఎరువులు(Fertilizer), రసాయనిక ఎరువులకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ ఫేక్ ప్రచారం ద్వారా నిర్వహించే వీడియోలకు ఆకర్షితులై రైతులు విత్తనాలను, ఎరువులను కొనుగోలు చేస్తూ తీవ్రంగా నష్టపోతున్నారు. గతంతో పోలిస్తే పాల్వంచ, చంద్రగొండ, అన్నపురెడ్డిపల్లి, జూలూరుపాడుతో సహా పలు మండలాల్లో యూట్యూబర్ల(Youtube) ప్రచారం మాయలో పడి కొనుగోలు చేసి విత్తనాలు దిగుబడి రాకపోవడంతో రైతులు( Farmers) ఆందోళన చెందారు.

Also Read: KTR: హోం మంత్రి అమిత్ షాకు కేటీఆర్ సూటి ప్రశ్నలు.. బదులిచ్చేదెవరు?

సోషల్ మీడియా ప్రచారం పక్కా ప్లాన్ తోనే

వివిధ రకాల విత్తన కంపెనీలు, ఎరువుల కంపెనీలు పక్కా పథకం ప్రకారమే సోషల్ మీడియాలో కొంతమంది వ్యక్తులతో ప్రచారం చేయిస్తున్నారని వ్యవసాయ శాఖ అధికారులు వివరిస్తున్నారు. విత్తనాలు, ఎరువులు పాజిటివ్ కు సంబంధం లేకుండా కేవలం సంపాదనే లక్ష్యంగా కొంతమంది యూట్యూబ్‌(Youtube)లలో ప్రత్యేక వీడియోలను అప్లోడ్ చేస్తూ రైతులను పక్కదారి పట్టిస్తున్నారన్నారు. ఏ కంపెనీ ఎక్కువ డబ్బులు ఇస్తే ఆ కంపెనీ గురించే వీడియోలు చేస్తూ ప్రచారాలను విస్తృతం చేస్తున్నారు. ఇలాంటి వాటి వీడియోల వలలో పడిన రైతులు విత్తన షాపులకు వెళ్లి ప్రచారం అవుతున్న కంపెనీలకు సంబంధించిన విత్తనాలు, ఎరువులే కావాలని దుకాణదారుల వద్ద నుంచి కొనుగోలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే అదునుగా భావించిన ఆ విత్తనాలు, ఎరువులను కృత్రిమ కొరత సృష్టించి ఎక్కువగా డబ్బులు వసూలు చేస్తున్నారు.

అధికారుల సలహా మేరకే రైతులు విత్తనాలు

వ్యవసాయ శాఖ(Department of Agriculture) అధికారుల సూచనల మేరకే విత్తనాలు(Seeds), ఎరువులను కొనుగోలు చేయాలి. సోషల్ మీడియాలో ఇవే నాణ్యమైన విత్తనాలు, అధిక దిగుబడి ఇచ్చే అంటూ ప్రచారం చేసే వాటిని రైతులు కొనుగోలు చేయవద్దు. ఇలాంటి దుష్ప్రచార కంపెనీల విత్తనాలను కొనుగోలు చేసి రైతులు మోసపోవద్దు. విత్తనాలు, ఎరువుల కొనుగోళ్లకు సంబంధించి వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు తప్పనిసరిగా తీసుకోవాలని, బాబురావు జిల్లా అగ్రికల్చర్ అధికారి తెలిపారు.

Also Read: Kishan Reddy: ప్రజల కోసమే పనిచేస్తాం.. రేవంత్ రెడ్డి కోసం కాదు!

 

Just In

01

Leaves denied: బ్రదర్ పెళ్లికి లీవ్స్ ఇవ్వలేదని ఓ మహిళా ఉద్యోగి తీసుకున్న నిర్ణయం ఇదీ

Students Protest: మా సార్ మాకు కావాలి.. నిరసనకు దిగిన విద్యార్థులు

Dhanush: మరో తెలుగు డైరెక్టర్‌కి ధనుష్ గ్రీన్ సిగ్నల్.. ఆ దర్శకుడెవరో తెలుసా?

Gaddam Prasad Kumar: మహిళల ఆర్థిక అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం.. గడ్డం ప్రసాద్ కీలక వ్యాఖ్యలు

Naresh65: కామెడీ గోస్ కాస్మిక్.. అల్లరి నరేష్ 65వ చిత్ర వివరాలివే..!