KMC Hospital: అసలే చాలి చాలని వేతనాలు అవి సమయానికి రాకపోవడంతో ఆరోగ్య శాఖలో పని చేసే ఔట్సోర్సింగ్(Outsourcing), కాంట్రాక్(contract)ట్ ఉద్యోగులు, సిబ్బంది అనేక ఇబ్బందులు పడుతున్నారు. నెల నెల క్రమం తప్పకుండ వేతనం పొందితేనే వారి కుటుంబ అవసరాలు సరిగా తీరవు అటువంటిది ఏకంగా ఆరు నెలలపాటు వేతనం రాకపోవడంతో వరంగల్ కేఎంసి సూపర్ స్పెషాలిటీ హాస్పత్రి(Warangal KMC Super Specialty Hospital)లో పని చేసే ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు, సిబ్బంది వారు చెప్పరాని ఇబ్బందులు అనుభవిస్తున్నారు. తెలంగాణలో ప్రధానమైన పండుగ దసరా సమయంలో వేతనం వస్తుందని ఎదురు చూసి నిరాశ చెందారు. పండుగ పూట అవసరాల కోసం అప్పులు చేసి అవసరాలు తీర్చుకున్నామని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీపావళి సమీపిస్తోంది అయిన వేతనం రాకపోవడంతో పండుగల పూట మా కుటుంబాలు పస్తులు ఉండాల అని ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు, సిబ్బంది ప్రభుత్వాన్ని ప్రశ్నస్తున్నారు.
సేవలు అందిస్తూనే నిరసనలు
వరంగల్ కేఎంసీలో పని చేసే 400 మంది ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు, సిబ్బంది సహా రాష్ట్ర వ్యాప్తంగా వేలాది ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు సిబ్బంది వేతనాలు సమయానికి రాక ఇబ్బందులు పడుతున్నారు.వరంగల్ కేఎంసి సూపర్ స్పెషాలిటీ హాస్పత్రిలో పనిచేస్తున్న ఉద్యోగులందరికి 6 నెలల పెండింగ్ వేతనాలు వెంటనే ఇవ్వాలని, సమాన పనికి – సమాన వేతనం, పిఎఫ్(PF), ఈఎస్ఐ(ESI),ఉద్యోగ భద్రత- రెగ్యులరైజేషన్, సెలవుల విషయంలో వారు ఎదుర్కొంటున్న ఇతర అన్ని సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వరంగల్ కేఎంసి సూపర్ స్పెషాలిటీ హాస్పత్రిలో పనిచేస్తున్న ఉద్యోగులు విధులు నిర్వహిస్తూనే వారం రోజులుగా నిరసన కార్యక్రమాలు వ్యక్తం చేశారు. అయిన ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో శుక్రవారం రోజు ఉదయం ఆసుపత్రి ముందు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం ఇప్పటికైన స్పందించకుంటే ఆందోళన కార్యక్రమాలు తీవ్రం చేసే ఆలోచనలో ఉన్నామని ఉద్యోగులు, సిబ్బంది పేర్కొన్నారు. చంటి పిల్లలు వున్న వారిని ఇంటి దగ్గర వదిలేసి మరి విధులు నిర్వహిస్తే మాకు ఇచ్చే పండుగల బహుమానం ఇదేనా అని స్టాఫ్ నర్స్ లు కన్నీటి పర్యంతం అవుతున్నారు.
Also Read: CM Revanth Reddy: సీఎంవో కార్యాలయం నుంచి అధికారుల లీకులతో ఇబ్బందులు.. సీరియస్‌గా తీసుకున్న సీఎం
పండగలకి పస్తులు వుండాల్సి వస్తుంది
పండగల సమయంలో పస్తులు వుండాల్సి వస్తుంది. ప్రజా సంక్షేమం కోసం పని చేస్తున్న ప్రజా ప్రభుత్వం నిత్యం వేలాది మంది రోగులకు వైద్య సేవలను అందిస్తున్న మా పట్ల ఇలాంటి వైఖరి అవలంబించడం ఆవేదన కలిగిస్తుంది. వేతనాలు సమయానికి రాకపోవడం అద్దెలు కట్టలేక, కుటుంబ అవసరాలు తీర్చుకోలేక, లోన్లపై ఈ అమ్మాయిలు కట్టుకోవడానికి ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పటి కైన ప్రభుత్వం స్పందించి వెంటనే మాకు పెండింగ్ ఉన్న వేతనం ఇవ్వడంతోపాటు ప్రతి నెల క్రమం తప్పకుండా సకాలంలో వేతనాలు చెల్లించాలని ప్రభుత్వాన్ని వేసుకున్నాం.
వసంత్ రావు, ల్యాబ్ టెక్నీషియన్
మా గోడు ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ వసంత్ రావు అనే ల్యాబ్ టెక్నీషియన్ వాపోయాడు. నిత్యం వేలాది మందికి సేవలు అందించే మాకు సకాలంలో వేతనాలు రాక పోవడం ఇబ్బంది కలిగిస్తుంది. మా కుటుంబ అవసరాలు తీర్చుకునేందుకు అప్పులు చేయాల్సి వస్తుంది. అధికారులు ప్రభుత్వ పెద్దలకు మా గోడు అనేకసార్లు చెప్పుకున్న పట్టించుకున్న వారు లేరు. ఆరు నెలలుగా వేతనం లేక కుటుంబ అవసరాల తీర్చుకునేందుకు అనేక తిప్పలు పడాల్సి వస్తుంది. ఇప్పటికైన ప్రభుత్వం స్పందించి మా గోడు గుర్తించి మాకు తిప్పలు లేకుండా చేయాలని స్టాఫ్ నర్స్ భాను వాపోయారు.
Also Read: Bandi Sanjay: క్రీడా రంగంపై కేంద్రం ఫోకస్.. యువతకు ఇదే మంచి ఛాన్స్.. బండి సంజయ్
