CM Revanth Reddy: ప్రజా ప్రభుత్వంలో పదేళ్ల పాటు అస్తవ్యస్తమైన వ్యవస్థను చక్కదిద్దాలని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రయత్నిస్తుంటే, కొందరు అధికారులు, సిబ్బంది ఇందుకు వ్యతిరేకంగా పనిచేస్తున్నట్లు స్పష్టమవుతున్న ది. ప్రతీ సారి సర్కార్ కు ఆటంకాలు ఏర్పడేలా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వంపై విమర్శలు వచ్చేందుకు అవకాశం కల్పిస్తున్నారు. సీఎం కార్యాలయం నుంచి మంత్రుల పేషీల వరకు ఇలాంటి ఆఫీసర్లు, స్టాఫ్ ఉన్నారు. కొందరు ఐఏఎస్ అధికారులూ ఇదే తరహాలో వ్యవహరిస్తున్నారు. సీఎం తీసుకునే నిర్ణయాలు, చేపట్టే కార్యక్రమాలు, అమలు చేసే విధానాలు, కొత్త ఫాలసీలు వంటివన్నీ ఈ కేటగిరీకి చెందిన వాళ్లు ముందుగానే లీకులు ఇస్తున్నారు.
Also Read:CM Revanth Reddy: 220 కోట్లతో ఆదర్శంగా కొండారెడ్డిపల్లి.. సీఎం సొంతూరులో అభివృద్ధి పనులు ఇవే!
సీఎం ఇంటర్నల్ గా నిర్వహించే రివ్యూ అంశాలను కూడా కొందరు ఐఏఎస్ ఆఫీసర్లు లీకులు
ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలతో పాటు ఆయా లీడర్లతో అనుకూలంగా ఉండే వ్యక్తులకు వివరిస్తున్నారు. సీఎం ఇంటర్నల్ గా నిర్వహించే రివ్యూ అంశాలను కూడా కొందరు ఐఏఎస్ ఆఫీసర్లు లీకులు రూపంలో ఇస్తున్నారు. ఇవి మీడియా రూపంలో ఆటోమెటి క్ గా ప్రతిపక్షాలకు చేరుతున్నాయి. తద్వారా సీఎం అమలు చేయబోయే యాక్షన్ ప్లాన్ కు కౌంటర్ గా ప్రతిపక్షాలు అలర్ట్ అవుతున్నాయి. గడిచిన రెండేళ్లుగా ఇదే విధానం కొనసాగుతున్న ది. చాలా సందర్భాల్లో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ముందుగానే ప్రతిపక్షాలకు లీక్ అయ్యాయి. తద్వారా ప్రభుత్వం డ్యామేజ్ అయ్యేందుకు కారణమైంది. మంత్రి వర్గ సమావేశాల వివరాలు, అంతర్గత మీటింగ్ నిర్ణయాలు, ఇలాంటి రహస్య వివరాలను కూడా కొంత మంది ఐఏఎస్ లు లీకులు ఇవ్వడం గమనార్హం.
సీఎంవో కార్యాలయం నుంచి కూడా?
ప్రజలకు మేలు చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి నిరంతరం శ్రమిస్తుంటే ఆఫీసర్లు చేస్తున్న తప్పిదాలకు సర్కార్ ఇరకాటంలో పడుతుంది. ఇది లాంగ్ రన్ లో మరింత డ్యామేజ్ చేస్తుందని ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు. ఏపీలోనూ గతంలో కొందరు ఆఫీసర్లు ఈ తరహాలో వ్యవహరించారని, తద్వారా జగన్ ప్రభుత్వం సులువుగా డ్యామేజ్ అయిందనే చర్చ మొదలైంది. ప్రజా ప్రభుత్వంలో ఈ విధానాలకు చెక్ పడకపోతే..భవిష్యత్ లో ప్రమాదం వాటిల్లక తప్పదని నిపుణులు చెబుతున్నారు. ఊదాహరణకు రెండు రోజుల క్రితం సీఎం రేవంత్ తన ఇంట్లో వైద్యారోగ్యశాఖ మంత్రి, ఆఫీసర్లతో ఇంటర్నల్ రివ్యూ నిర్వహించారు.ఇందులో కీలక అంశాలపై చర్చించారు.
ఓ రెండు పత్రికలకు లీకులు
బడ్జెట్, విధి, విధానాలపై ఓ నిర్ణయం తీసుకున్నారు. వీటిని బయటకు ఇప్పుడే చెప్పవద్దని సీఎం కూడా ఆదేశించారు. దీనికి అనుకూలంగానే సీఎం పీఆర్వో ఒకరు మంగళవారం ఎలాంటి రివ్యూస్ జరగలేదు, ప్రెస్ నోట్ రిలీజ్ లు కూడా లేవని సీఎం మీడియా గ్రూప్ లో స్పష్టంగా క్లారిటీ ఇచ్చారు. కానీ కొందరు అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించి ఓ రెండు పత్రికలకు లీకులు ఇచ్చారు. దీనిపై సీఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. మరోసారి ఇలాంటివి రిపీట్ కాకూడదని ఆదేశించినట్లు తెలిసింది. ఐఏఎస్ ఆఫీసర్లు లీకులు ఇచ్చినట్లు తెలిస్తే చర్యలు తప్పనిసరిగా ఉంటాయని నొక్కి చెప్పారు. ప్రభుత్వం చేపట్టే మంచి కార్యక్రమాలను తామే ఆఫీషియల్ గా రిలీజ్ చేస్తామని, ఐఏఎస్ లకు ఎందుకు అంత అత్యుత్సాహం అని సీఎం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.
చక్రం తిప్పుతున్నదెవరు.. లీకులు ఇస్తుందెవరు..?
ఇక మంత్రుల పేషీల్లోని కొందరు ఆఫీసర్లు పీఎస్ , ఓఎస్డీ తదితర కేడర్లతో పనిచేస్తూ..ప్రభుత్వానికి మచ్చ తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కాంట్రాక్టులు, టెండర్లు, డిప్యూటేషన్లు వ్యవహారాల్లో జోక్యం చేసుకొని కమీషన్లు తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో పాటు సీఎం, మంత్రుల మధ్య జరిగిన కన్వర్వేషన్స్, ఆఫీసర్లు మంత్రుల మధ్య జరిగిన ఇంటర్నల్ చర్చలు వంటివన్నీ బయట వ్యక్తులకు లీకులు ఇస్తున్నారనే ప్రచారం కూడా ఉన్నది. ఇలాంటి వాటిపై సీరియస్ గా వ్యవహరించాల్సిన అవసరం ఉన్నదని సీఎం ఇంటిలిజెన్స్ కు ఆదేశాలిచ్చారు. తాజాగా మంత్రి కొండా సురేఖ ఓఎస్డీ తొలగింపునకు కారణాలు కూడా ఈ తరహాలోనే ఉన్నాయని ఆఫీసర్లు తెలిపారు. దీంతో పాటు సీఎం కార్యాలయం నుంచి మంత్రుల పేషీల్లో పనిచేసే పీఆర్వోలపై కూడా ఫోకస్ పెట్టాలని సీఎం ఆదేశాలిచ్చారు. కొందరు పీఆర్వోలే లీకులు ఇచ్చి.. ఆ తర్వాత రెజాయిండర్లు, ఖండనలు ఇస్తున్నట్లు ఇంటిలిజెన్స్ సీఎంకు వివరించింది. దీనిపై సీరియస్ గా వ్యవహరించాలని సీఎం సూచించినట్లు సమాచారం.
